Tuesday, October 8, 2024

AP Government: సర్కారు బడుల్లో సీబీఎస్ఈ రద్దు.. కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ ఫైర్

- Advertisement -

AP Government: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సీఎం చంద్రబాబు సర్కారు బడుల్లో సీబీఎస్ఈ విధానాన్ని రద్దు చేశారు. తద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యా ప్రమాణాలను ఈ కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందనే మాట ఒప్పుకోవాల్సిందే. సీబీఎస్ఈ విధానంలో విద్య ద్వారా విద్యార్థులకు చిన్నప్పటి నుంచే అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన విజ్ఞానం పెంపొందుతుంది. ప్రైవేటుకు ధీటుగా గవర్నమెంట్ స్కూళ్లల్లో కూడా పోటీతత్వం అనేది అలవడి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు పడతాయి. విద్యాశాఖ మంత్రి హోదాలో ఉండి కూడా నారా లోకేష్ సర్కారు బడులను మళ్లీ మొదటి దశలోకే తీసుకెళ్తుండడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అద్దం పట్టేలా ఉంది. కాగా, ఇదే విషయమై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ ప్రభుత్వ స్కూళ్లలో సీబీఎస్‌ఈ రద్దుతో చంద్రబాబు మరోసారి పేదల వ్యతిరేకి అని నిరూపించుకున్నారని సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తారు.

మీ ఇళ్లల్లో పిల్లలకు ఉన్నత చదువులు అందాలి కానీ, సామాన్య ప్రజల విషయంలో ఎందుకు ఇలాంటి నిర్లక్ష్య ధోరణి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్న 14 ఏళ్లలో చేయలేని పనులన్నీ ఐదేళ్లలోనే వైఎస్సార్‌సీపీ హయాంలో చేసి చూపించామని అన్నారు. నాడు-నేడు, ఇంగ్లీష్‌ మీడియం, సీబీఎస్‌ఈ.. తదితర కార్యాచరణలతో గతంలో అధికారంలో ఉన్నప్పుడు విద్యా ప్రమాణాలను కాపాడమని గుర్తు చేశారు. వైసీపీ హయాంలో సర్కారు బడుల్లో నాణ్యమైన విద్యను తీసుకొస్తే.. మీరు అధికారంలోకి వచ్చాక అన్నీ రద్దు చేస్తూ వెళ్తున్నారని, అలాంటప్పుడు మీ ప్రభుత్వాలు అసలు ఎందుకు అంటూ నిలదీశారు. ప్రభుత్వ స్కూళ్లలో బోధించే ఉపాధ్యాయులు కూడా ఎందులోనూ తక్కువ కాదని, వారిని ప్రోత్సహించడం మాని ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. సర్కారు బడుల్లో చదివే పిల్లలకు భవిష్యత్తులో రాబోయే ప్రపంచ స్థాయి గుర్తింపును మీరు ఇప్పటి నుంచే దెబ్బతీస్తున్నారంటూ, దీన్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని, మీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని వైఎస్ జగన్ ‘X’ వేదికగా ట్వీట్‌ చేశారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!