అంతా ఊహించినట్టే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కొత్త అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ నియమితులయ్యారు. బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ముంబయిలోని ఏజీఎం వేదికగా బిన్నీ అధ్యక్ష పదవీ చేపట్టినట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. 67 ఏళ్ల వయస్సులో ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు. గంగూలీ పదవీ కాలం ముగియడంతో అధ్యక్ష పదవీకి ఏకైక నామినేషన్ రావడంతో రోజర్ బిన్నీ ఎంపిక నామమాత్రమైంది. 1983 వరల్డ్ కప్ జట్టులో సభ్యుడైన రోజర్ బిన్నీ.. ఇప్పటి వరకు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసొసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. తాజాగా బీసీసీఐ ప్రెసిడెంట్ పదవీ చేపట్టడంతో ఆ బాధ్యతను వదులుకోనున్నారు. 1983 వరల్డ్ కప్ విజయంలో బిన్నీ కీలక పాత్ర పోషించారు. మీడియం పేసర్ గా అద్భుతంగా రాణించిన రోజర్ బిన్నీ 83 ప్రపంచ కప్ లో 8 మ్యాచ్ లు ఆడి 18 వికెట్లు పడగొట్టాడు.
ఇదిలా ఉంటే బీసీసీఐ సెక్రటరీగా జేషా కొనసాగనున్నారు. ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా, కోశాధికారిగా ఆశీష్ షేలార్, జాయింట్ సెక్రటరీగా దేవజిత్ సైకియా, ఐపీఎల్ ఛైర్మన్‌గా అరుణ్ దుమాల్ ఎంపికయ్యారు