వైసీపీ అధినేత జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడుతున్న నేతలపై వేటు వేయడంలో ఏమాత్రం కూడా ఆయన సంకోచించడం లేదు. ఇప్పటికే ఇలా వ్యవరిస్తున్న పలువురు నేతలపై చర్యలు తీసుకున్న జగన్ తాజాగా మరో నేతపై సస్పెన్షన్ చేసి సంచలనం సృష్టించారు. తాజాగా వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ అయిన నేత ఎవ రో తెలియాలంటే ఈ మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. పామర్రు మాజీ ఎమ్మెల్యే డీవై దాస్ ను సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ అధిష్టానం ప్రకటించింది. పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతోనే.. ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. మాజీ ఎమ్మెల్యే డీవై దాస్ ను వైసీపీ సస్పెండ్ చేసింది. ఈ మేరకు పార్టీ కార్యాలయం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. పామర్రు నియోకవర్గ కార్యకర్తల నుంచి ఫిర్యాదులు రావడంతో దీనిపై విచారించన చేపట్టిన పార్టీ నాయకులు ఈ విషయన్ని వైసీపీ అధినేత జగన్ దృష్టికి తీసుకెళ్లారు. నిజ నిజాలు తెలిసిన తరువాత ఆయనపై చర్యలు తీసుకున్నారని సమాచారం. జగన్ అనుమతితో డివై దాస్ ను సస్పెండ్ చేసినట్లు పార్టీ తెలిపింది. అయితే తాజాగా దీనిపై డీవై దాస్ స్పందించారు. తనను సస్పెండ్ చేసిన విషయం తన దృష్టికి రాలేదని డీవై దాస్ తెలిపారు. తనకు సమాచారం కూడా ఇంకా అందలేదని ఆయన చెబుతున్నారు.
గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో పామర్రు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014లో టీడీపీ గెలిచిన తరువాత ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 2019 ఎన్నికల ముందు డీవై దాస్ వైసీపీలో చేరినప్పటికి కూడా టిక్కెట్ మాత్రం దక్కించుకోలేకపోయారు. తాజాగా ఆయన పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారని తెలుసుకున్న వైసీపీ అధిష్టానం ఆయనపై వేటు వేసింది. ఇదిలా ఉంటే ఇప్పటికే గుంటూరు జిల్లా మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. రావి వెంకటరమణ గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పని చేశారు. వైసీపీ ఆవిర్బావం నుంచి కూడా ఆయన పార్టీలోనే కొనసాగుతున్నారు. 2014 ఎన్నికల్లో పొన్నూరు నియోజవర్గం నుంచి వైసీపీ తరుఫున పోటీ చేసి ధూళ్లిపాళ్ల నరేంద్ర చేతిలో ఓడిపోయారు. రావి వెంకటరమణ కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చెప్పి .. ఆయనపై వేటు వేయడం జరిగింది. ఈ చర్యలతో వైసీపీ అధినేత పార్టీ నేతలకు తన వైఖరిని ఏమిటో తెలియజేసినట్లుగా అయింది.