Bigg Boss 8 Day 14: బిగ్ బాస్ సీజన్ 8 ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇన్ఫినిటీ గేమ్ షో అంటూ సాగే ఈ షో ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తోందని చెప్పొచ్చు. మునుపెన్నడూ లేని విధంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేయడం, గత సీజన్లలో లాగా బిగ్ బాస్ చివరి వారంలో ఇవ్వాల్సిన సర్ ప్రైజ్ లను రెండో వారంలోనే ఇవ్వడం అన్నీ కూడా ఆడియన్స్ కు ఊహించని ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. కాగా, బిగ్ బాస్ సీజన్ 8 రెండో వారం చివరి దశకు చేరుకుంది. అందులో భాగంగానే నాగార్జున కంటెస్టెంట్లతో ఫుల్ కామెడీ చేయిస్తూ ఆకట్టుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు హౌసులో నైనిక, యష్మీ, నిఖిల్ అనే ముగ్గురు చీఫ్ లుగా ఉండగా.. యష్మీ, నైనిక చీఫ్ లుగా ఫెయిల్ కావడంతో వారి స్థానంలో అభయ్ నవీన్ హౌసులో కొత్త చీఫ్‌గా ఎన్నికయ్యారు. మరి నిఖిల్, అభయ్ క్లాన్ లలోకి ఎవరు వెళ్తున్నారో..? ఎందుకు వెళ్తున్నారో ? చెప్పి మరీ డిసైడ్ చేసుకోవాలని, గ్రూపులుగా డివైడ్ అవ్వాలని తెలిపారు హోస్ట్ నాగార్జున. అయితే విష్ణు ప్రియ నిఖిల్ టీంలోకి వెళ్తున్నానంటూ ప్రకటించింది. అయితే ఎందుకని నాగార్జున ప్రశ్నించగా.. నా గొయ్యి నేనే తవ్వుకున్నాను అంటూ సిగ్గుతో తలదించుకొని కామెంట్ చేసింది. ఇక తర్వాత ఒక్కొక్కరు అభయ్ , నిఖిల్ టీం లోకి ఎందుకు చేరుతున్నారో చెప్పి వారి క్లాన్ లలోకి వెళ్లిపోయారు.
ఆ తర్వాత నాగార్జున 13 మంది కంటెస్టెంట్ల మధ్య చిత్రం విచిత్రం టాస్క్ పెట్టారు. ఇందులో రెండు బొమ్మలు చూపించి.. ఆ రెండు బొమ్మలను కలిపితే ఏ పదం వస్తుందో చెప్పాలని నాగార్జున అడుగుతారు. నాగార్జున ముందుగా యాపిల్, ఎండు మిరపకాయలు చూపిస్తారు. దీనికి శేఖర్ బాషా సంబంధం లేని మిరపల్ అనే సంబంధం లేని పదం చెప్పి నవ్విస్తాడు. తరువాత, బ్యాటరీ.. ల్యాండ్‌లైన్ ఫోన్ బొమ్మలు ప్రదర్శించినప్పుడు, సీత సెల్‌ఫోన్ అని చెప్పింది. అయితే తనకు ఎవరో సహాయం చేస్తున్నారని నాగార్జున అన్నారు. సీత ఎవ్వరూ చేయలేదని చెబితే, నేను చెప్పాను, కాదు విష్ణు చెప్పింది అని అంటారు. విష్ణు ప్రియ లేచి నిలబడి.. ‘‘సార్.. అంత తెలివితేటలు ఉంటే నేను ఐఏఎస్ అయ్యేవాడిని’’ అంటూ అందరినీ నవ్విస్తుంది. ఆ తర్వాత ఒక గ్లాసులో పాలు, మరో ఫొటోలో దుబాయ్ షేక్ ఫోటో చూపించగానే.. మిల్క్ షేక్ అవుతుంది. కానీ విష్ణు ప్రియ అతి తెలివి ప్రదర్శించి దుబాయ్ షేక్ మీకు నమస్కారం చేస్తున్నాడు అంటూ కామెంట్ చేసి అందరినీ నవ్విస్తుది. మొత్తానికి విష్ణుప్రియ తన కామెడీతో ప్రోమోకే హైలెట్ గా నిలిచిందని చెప్పొచ్చు.