Thursday, January 23, 2025

Biggboss 8 : బిగ్ బాస్ సాక్షిగా శేఖర్ బాషాకు గుడ్ న్యూస్ చెప్పిన నాగార్జున..ప్రైజ్ మనీ కూడా దీని ముందు తక్కువే

- Advertisement -


Biggboss 8 : స్టార్ మాలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజ‌న్ 8 రియాల్టీ షో మంచి రేటింగ్స్‌తో దూసుకుపోతోంది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ రియాల్టీ షో తొలి వీకెండ్ ఫ్లాట్ గా ఉన్నా.. ఆ తర్వాత టాస్క్ లు, నామినేషన్లతో ఊపందుకుంది. ఈ సీజన్‌లో అడుగుపెట్టిన 14 మంది కంటెస్టెంట్స్‌లో బేబక్క మొదటి వారంలోనే ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ బిగ్ బాస్ షోలో కెప్టెన్ కాకుండా నిఖిల్, నైనికా, యష్మీ గౌడ హౌస్ చీఫ్‌లుగా ఎన్నికయ్యారు. హౌస్‌లో అందర్నీ తమ ఆట తీరుతో ఆకట్టుకుంటుంటే, సీనియర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆర్జే శేఖర్ బాషా కూడా తన ఆటతో మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. మొదటి వారం పెద్దగా ఆడకపోయినా.. పంచ్ లతో బాగానే అలరించాడు.

శేఖర్ బాషా ‘ఆర్జే’ అన్న సంగతి తెలిసిందే. అందుకే హౌసులో కూడా తన టాలెంట్ అంతా చూపిస్తున్నాడు. గేమ్ పరంగా కాకుండా పంచ్ లు విసురుతూ బిగ్ బాస్ హౌస్ లో అందరినీ ఆకర్షించాడు శేఖర్. నామినేషన్లు సీరియస్‌గా ఉన్న సమయంలో కూడా శేఖర్ బాషా తన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్నాడు. అయితే ఈ వారం నామినేషన్స్‌లో తాను కూడా చేరాడు. శనివారం ఫైనల్ వీకెండ్ రాగానే, నాగార్జున మళ్లీ వచ్చి ఎలిమినేషన్ డే హీట్ తీసుకొచ్చాడు. అయితే దీనికి ముందు నాగార్జున కంటెస్టెంట్ శేఖర్ భాషాకు ఓ స్వీట్ గుడ్ న్యూస్ అందించారు.

ఇక బిగ్ బాస్ సీజన్ 8లో రెండో శనివారం రాగా, ఈ వారం కూడా అనేక కారణాలను తీసుకుని వచ్చి కంటెస్టెంట్స్ కి క్లాస్ చెప్పడానికి నాగార్జున వచ్చేసాడు. తాజా ఎపిసోడ్ లో ఒక సూపర్ గుడ్ న్యూస్ వచ్చింది. అయితే నాగార్జున వచ్చీ రాగానే శేఖర్ బాషాకి గుడ్ న్యూస్ చెప్పాడు. శేఖర్ బాషా వైఫ్ కి ప్రెగ్నెన్సీ డెలివరీ సాఫీగా జరిగిందని, తనకు “హెల్తీ బేబీ బాయ్” పుట్టాడని నాగార్జున ప్రకటించాడు. అంతే కాదు తల్లి బిడ్డ చాలా హెల్తీ గా సంతోషంగా ఉన్నారని నాగార్జున.. శేఖర్ బాషాకి ధైర్యం చెప్పాడు. ఈ న్యూస్ వినగానే శేఖర్ బాషా ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక హౌస్ లో కంటెస్టెంట్స్ అందరూ శేఖర్ బాషాని హగ్ చేసుకుని స్పెషల్ గా విషెస్ చెప్పారు. ఇక ఈ ఎపిసోడ్ చూసిన నెటిజన్లు శేఖర్ భాషకి కంగ్రాట్స్ చెప్తూ, శేఖర్ బాషాకి లైఫ్ లో ఇంతకన్నా పెద్ద సంతోషం ఉండదని కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!