Friday, November 14, 2025

వైసీపీ కోసం ఏక‌మ‌వుతున్న రెడ్లు

- Advertisement -

రాయ‌ల‌సీమ వైసీపీకి పెట్ట‌ని కోట. 2019లో ఏక‌ప‌క్ష తీర్పు ఇచ్చిన చ‌రిత్ర. కానీ 2024లో సీన్ రివ‌ర్స్. రాయ‌ల‌సీమ‌లో వైసీపీకి ఎదురుగాలి వీచింది. కీల‌క వ‌ర్గం మ‌ద్ద‌తు దూర‌మైంది. దీంతో ఓట‌మి పాలైంది. ఓట‌మి నుంచి పాఠాలు నేర్చుకుంది. త‌ప్పుల‌ను సరిదిద్దే ప‌నిలో ప‌డింది. ఫ‌లితంగా సీమ‌లో అనుకూల ప‌వ‌నాలు వీస్తున్నాయ‌న్న చ‌ర్చ మొద‌లైంది. ఇంత‌కీ దూర‌మైన వ‌ర్గం ఏంటి?. ఎందుకు దూర‌మైంది ?. ఇప్పుడెలా ద‌గ్గ‌ర‌వుతుందో ఈ వీడియాలో చూసేద్దాం.

వాయిస్ ఓవ‌ర్ : 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి రాలేదు. కానీ గ‌ణ‌నీయ‌మైన సీట్లు వ‌చ్చాయి. ఆ సీట్లు రావ‌డానికి రాయ‌ల‌సీమ ప్రాంత‌మే కార‌ణం. రాయ‌ల‌సీమ‌లో వైసీపీకి ఉన్న ప‌ట్టు కార‌ణంగా 2014 ఎన్నిక‌ల్లో గ‌ణ‌నీయ‌మైన సీట్లు సాధించింది. ఆ త‌ర్వాత 2019 ఎన్నిక‌ల్లో వైసీపీకి రాయ‌ల‌సీమ ఏక‌పక్ష తీర్పునిచ్చింది. మొత్తం రాయ‌ల‌సీమ‌లో 52 సీట్లు ఉంటే అందులో 49 సీట్లు వైసీపీకి వ‌చ్చాయి. టీడీపీ మూడు సీట్ల‌తో స‌రిపెట్టుకుంది. అందులో కుప్పం, ఉర‌వ‌కొండ‌, హిందూపురం ఉన్నాయి. ఈ మూడు సీట్లు త‌ప్పా అన్నీ వైసీపీనే గెలిచింది. అంత‌టి ఏక‌ప‌క్ష తీర్పు రాయ‌ల‌సీమ ఇచ్చింది. కానీ 2024 ఎన్నిక‌ల్లో వైసీపీ ద‌శ మారిపోయింది. రాయ‌ల‌సీమ‌లో కేవ‌లం ఏడు సీట్ల‌కు ప‌రిమితం కావాల్సి వ‌చ్చింది. 2019 ఎన్నిక‌లు.. 2024 ఎన్నిక‌లు రెండింటికీ ఇంత తేడా ఎందుకు అన్న ప్ర‌శ్న వినిపిస్తోంది. కానీ ఈ తేడా వెనుక కీల‌క సామాజిక‌వ‌ర్గం వైసీపీకి దూరం కావ‌డ‌మేన‌న్న‌ది విశ్లేష‌కులు అంచ‌నా.

వాయిస్ ఓవ‌ర్ : 2024 ఎన్నిక‌ల్లో రెడ్డి సామాజిక‌వ‌ర్గం వైసీపీకి దూర‌మైంది. ఎందుకంటే వైఎస్ జ‌గ‌న్ 2019లో అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీల‌కు పెద్ద‌పీఠ వేశారు. ఈ క్ర‌మ‌లో రెడ్ల‌కు కొంత ప్రాధాన్య‌త త‌గ్గింది. ఈ నేప‌థ్యంలో రెడ్డి సామాజిక‌వ‌ర్గంలో అసంతృప్తి మొద‌లైంది. అది 2024 ఎన్నిక‌ల నాటికి తీవ్రమైంది. ఎన్నిక‌ల్లో టీడీపీ వైపు రెడ్లు వెళ్లేలా చేసింది. ఫ‌లితంగా రాయ‌ల‌సీమ‌లో వైసీపీ ఏడు సీట్ల‌కు ప‌రిమితం కావాల్సి వ‌చ్చింది. మొద‌టి నుంచి వైసీపీకి అనుకూలంగా ఉన్న రెడ్డి సామాజిక‌వ‌ర్గం ఎందుకు దూర‌మైంద‌న్న విశ్లేష‌ణ వైసీపీ మొద‌లుపెట్టింది. ఈ క్ర‌మంలో ప్రాధాన్య‌త త‌గ్గ‌డంతో రెడ్లు వైసీపీకి దూర‌మ‌య్యార‌న్న అంచ‌నాకు వైసీపీ అధిష్టానం వ‌చ్చింది. అక్క‌డి నుంచి ఆప‌రేష‌న్ మొద‌లుపెట్టింది. రెడ్లును మ‌ళ్లీ ద‌గ్గ‌రికి తీసుకునే ప్ర‌య‌త్నం మొద‌లు పెట్టింది.

వాయిస్ ఓవ‌ర్ : రాయ‌ల‌సీమ‌లోని స‌త్య‌సాయి జిల్లా త‌ప్పా అన్ని జిల్లాల వైసీపీ అధ్య‌క్షులుగా రెడ్డి సామాజిక‌వ‌ర్గ నేత‌ల‌కే వైఎస్ జ‌గ‌న్ పెద్ద‌పీఠ వేశారు. వారినే నియ‌మించారు. త‌ద్వార రెడ్ల‌లోని అసంతృప్తిని త‌గ్గించే ప్ర‌య‌త్నం మొద‌లుపెట్టింది వైసీపీ. ఆ త‌ర్వాత పార్టీ క‌మిటీల నియామ‌కంలోనూ రెడ్ల‌కు ప్రాధాన్య‌త ఇచ్చింది. అధికారంలోకి వ‌చ్చాక కీల‌క ప‌ద‌వులు ఇస్తామ‌న్న భ‌రోసా ఇచ్చింది. దీంతో రెడ్ల మ‌ళ్లీ వైసీపీ వైపు రావ‌డం మొద‌లైంది. అదే స‌మ‌యంలో జ‌గ‌న్ పై టీడీపీ సాగిస్తున్న కుట్ర‌లు కూడా రెడ్లకు న‌చ్చ‌డంలేదు. త‌మ నాయ‌కుడిని ఇంతలా ఇబ్బందిపెడుతున్న టీడీపీకి బుద్ది చెప్పాల‌న్న ఆలోచ‌న‌కు రెడ్లు వ‌చ్చారు. ఇది వైసీపీకి పాజిటివ్ గా మారింది. ఇటీవ‌ల నిర్వ‌హించిన స‌ర్వేలో కూడా రెడ్లు వైసీపీకే వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ద్ద‌తు ఇస్తార‌న్న అంశం వెల్ల‌డైంది.

ఎండ్ వాయిస్ : పోయిన‌చోట వెతుక్కోవ‌ల‌న్న‌ది పాత సామెత‌. ఇప్ప‌డు వైసీపీ అదే చేస్తోంది. త‌న‌కు ప‌ట్టున్న సీమ‌లో టీడీపీని క్లీన్ బౌల్డ్ చేసే దిశ‌గా ప‌నిచేస్తోంది. కీల‌క‌మైన సామాజిక‌వ‌ర్గాల‌కు ప్రాధాన్య‌త ఇస్తూనే రెడ్ల‌ను కూడా త‌మ‌వైపు తిప్పుకుంటోంది. ఫ‌లితంగా వ‌చ్చే ఎన్నిక‌లు నాటికి సీమ‌లో వైసీపీ బ‌లప‌డే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి.ys jagan

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!