Thursday, December 12, 2024

AP Politics: ఎన్డీయేకు వణుకు పుట్టిస్తున్న కేకే సర్వే.. 2029తో జగన్ కు ఊహించని సీట్లు

- Advertisement -


AP Politics: ఇటీవలి ఎన్నికలలో వైసీపీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. కానీ 11సీట్లకు పరిమితం కావడంతో జగన్ ఓటమిపై అనుమానాలు నెలకొన్నాయి. ఈవీఎంలలో ఏమైనా జరిగిందా అన్న అనుమానం సామాన్యుల్లో నెలకొంది. దీంతో జగన్ పై సానుభూతి పెరుగుతుంది. కూటమి కుట్రకు జగన్ బలయ్యారు. అయినా మొక్కవోని ధైర్యంతో ఆయన 2029 ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో కేకే సర్వే ఎన్డీయేపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఆయన ఎన్డీయేను మునిగిపోయే నావతో పోల్చారు. తొందర్లోనే ఓడిపోతుంది. వచ్చే అన్ని ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదని.. దాంతో వెళ్తే టీడీపీ, జనసేనకు తీవ్ర నష్టం అని ఆయన పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్లో ఎన్నికలు పూర్తయ్యాయి, త్వరలో హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్ర, జార్ఖండ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ , 2026వరకు ఏడు రాష్టాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ అన్ని ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని.. దాన్ని నమ్ముకున్న పార్టీలన్నీ అధోగతి పాలేనని తెలిపారు. బీజేపీ నెగెటివ్ అంతా కాంగ్రెస్ కు పాజిటివ్ అవుతుందని చెప్పారు. హర్యానాలో 90అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 89సీట్లలో పోటీ చేస్తుంది బీజేపీ. కాంగ్రెస్ ఆప్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

బీజేపీ ప్రతి మూడు సీట్లలో రెండు సీట్లు ఓడిపోతుందని కేకే చెప్పారు. వెస్ట్ బెంగాల్, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల్లో బీజేపీ ఇప్పటి వరకు లేదు. హర్యానా, మహారాష్ట్రలో పొత్తుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ సారి అన్ని రాష్ట్రాల్లో ఇండియా కూటమి అలయెన్స్ అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఇది ఖచ్చితంగా బీజేపీకి పెద్ద దెబ్బ. ఈ ప్రభావం 2029కి ఎన్డీయే పెద్ద షాక్ కలిగిస్తుంది. మూడు మోదీ రావడమంటేనే అసాధారణం. నాలుగో సారి మోదీ రావడం జరుగని పని అన్నారు. బీజేపీ మతతత్వాన్ని నమ్ముకుని పార్టీ పబ్బం గడపాలని చూస్తుంది. ఇది కొద్ది కాలమే. రియల్ ఇష్యూ తెరపైకి వస్తే మళ్లీ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్న సామాన్యుడిలో మెదలుతుంది. ఇండియా కూటమి కాస్త మెలకుని ఉంటే ఇంకా మంచి సీట్లు వచ్చేవి. బీజేపీ ఈ సారి చాలా డౌన్ అయింది. గతంతో పోలిస్తే 60సీట్లను కోల్పోయింది. అందువల్ల చంద్రబాబు, నితీష్ మీద ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ. ఇంకాస్త గట్టిగా ట్రై చేసి ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉండేది.

హర్యానాలో ప్రధానంగా వ్యవసాయ చట్టాలపై ధర్నాలు చేస్తుండగా.. వారిని నానారకాలుగా హింసించింది. దాని వల్ల బీజేపీ యాంటీగా రైతులు పనిచేసే అవకాశం ఉంది. అగ్ని పథ్ స్కీం కూడా బీజేపీకి తీవ్ర వ్యతిరేకత తెచ్చింది. నిరుద్యోగం కూడా బీజేపీ సర్కార్ హయాంలో బాగా పెరిగిపోయింది. నైపుణ్యాలు నేర్పించడంలో బీజేపీ ఫెయిల్యూర్, ఆస్ట్రేలియా, జర్మనితో పోలీసే 100ఏళ్లు వెనకబడి ఉన్నాం. స్కిల్స్ లేకుండా మన యువత వెనకబడిపోయింది. రెజర్ల్స్ విషయం బీజేపీకి చాలా మైనస్. కనీస మద్దతు ధర అందించడంలో కూడా బీజేపీ ఫెయిల్యూర్. వీటిన్నింటి వల్ల కాంగ్రెస్ కు ప్లస్ అవుతుంది. కేజ్రీవాల్ కు కాదని కేకే అంటున్నారు. ఒకవేళ ఇండియా కూటమి గనక వస్తే జగన్ కూడా దాని వైపు వెళ్లే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. 2029లో చంద్రబాబు, పవన్ ఇబ్బందులు పడే అవకాశం ఉంది. యాంటీ మోదీ కూడా వీళ్లపై పని చేస్తుంది. ఐదేళ్లలో వీళ్లు చెప్పిన హామీలు నెరవేర్చే పరిస్థితులు లేవు. జగన్ అధికారంలోకి వచ్చిన 100రోజుల్లో 87శాతం హామీలు నెరవేర్చాడు. చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ లో ఒక్క ఫించన్ తప్పా ఏదీ అమలు కాలేదు. పైగా ఆయనకు వయసు అయిపోతుంది. వీటన్నింటినీ బేరీజు వేసుకుని చూస్తూ ఏపీలో జగన్ 2029ఎన్నిల్లో 165సీట్ల వరకు గెలవచ్చని చెబుతున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!