వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు దేశ ప్రధాని మోదీ ఫోన్ చేశారనే విషయం అందరికి తెలిసిందే. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం మీద విమర్శలు చేసిన షర్మిలను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షర్మిలను అరెస్ట్ చేసిన తరువాత ఆమెను కోర్టుకు తరలించడం.. కోర్టు షర్మిలకు 7 రోజులు రిమాండ్ విధించడం ..వెంటనే పార్టీ నాయకులు షర్మిలను బెయిల్ మీద బయటకు తీసుకురావడం అన్ని కూడా వెంట వెంటనే జరిగిపోయాయి. ఓ మహిళను ఇంత దారుణంగా అరెస్ట్ చేయడంపై రాజకీయ పక్షాలన్ని కూడా స్పందించాయి. షర్మిల అరెస్ట్‌ను ముక్తకంఠంతో ఖండించాయి. షర్మిల అరెస్ట్‌పై దేశ ప్రధాని మోదీ కూడా మాట్లాడటం జరిగింది. ఆమెకు ప్రత్యేకంగా ఫోన్ చేసి మరి షర్మిలను మోదీ పరామర్శించారు.
పది నిమిషాల పాటు ఫోన్ లో ప్రధాని మోదీ షర్మిలతో మాట్లాడారు. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై షర్మిలను ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నారు. అక్రమ అరెస్ట్ పై… ఎంతోమంది తన అరెస్ట్ పట్ల స్పందించారని, మోదీ కూడా ఫోన్ చేసి ఘటనపై ఆరా తీశారని షర్మిల తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఫోన్ చేయడం తనకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని వైఎస్ షర్మిల తెలిపారు. తనకు ఫోన్ చేసినందుకు షర్మిల కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక్కడ వరకు బాగనే ఉంది.. కాని తెలంగాణలో బీజేపీకి ఏమాత్రం సంబంధం లేకపోయినప్పటికి కూడా షర్మిలను మోదీ పరామర్శించారు. కాని ఏపీలో బీజేపీ మిత్రపక్షం అయిన జనసేనకు ఏం జరిగిన కూడా బీజేపీ అగ్ర నాయకులు స్పందించకపోవడం దారుణం అని జనసేన నాయకులు అంటున్నారు.
జగన్ సర్కార్ జనసేన కార్యకర్తలను చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నప్పటికి కూడా మిత్రపక్షం అయిన బీజేపీ మాట్లాడటం లేదని జనసేన నేతలు వాపోతున్నారు. ఇప్పటంలో తమ పార్టీని టార్గెట్ చేసుకుని అధికార పార్టీ నాయకులు దాడి చేసినప్పుడు కూడా బీజేపీ నేతలు తమకు మద్దతుగా నిలవలేదని..వైజాగ్ సంఘటనలో కూడా తమతో ఎవరు రాలేదని జనసేన కార్యకర్తలు తెగ బాధపడిపోతున్నారు. పైగా వైసీపీ ప్రభుత్వం మీద ఫిర్యాదు చేస్తే ఏమాత్రం కూడా స్పందించడం లేదని కార్యకర్తలు కామెంట్స్ చేస్తున్నారు. ఇదే సమయంలో మోదీ మద్దతు తమకే అని వైసీపీ నేతలు చూపించుకోవడాన్ని జనసేన కార్యకర్తలు తట్టుకోలేకపోతున్నారు. ఇన్ని ఘటనలు జరిగినప్పుడు ఎప్పుడు కూడా పవన్ కల్యాణ్‌కు అండగా నిలబడని బీజేపీ నాయకులు.. తెలంగాణలో షర్మిలకు ఫోన్ పరామర్శించడం ఏంటబ్బా అని తెగ జనసేన కార్యకర్తలు బాధపడిపోతున్నారట. వీరి తంతు చూస్తుంటే వచ్చే ఎన్నికల నాటికి బీజేపీతో కలిసి ఉండటం కష్టమనే సంకేతాలు జనసేన కార్యకర్తలు ఇస్తున్నారు. మరి రాబోవు రోజులలో జనసేన అధినేత అడుగులు ఎటువైపు వేస్తారో చూడాలి.