Thursday, December 12, 2024

చంద్రబాబుపై దారుణంగా కామెంట్స్ చేసిన పురంధేశ్వరి

- Advertisement -

బీజేపీ కీలక నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి టీడీపీ అధినేత, తమ బందువు అయిన చంద్రబాబు మీద విమర్శలు చేశారు. ఏపీలో ప్రస్తుత దుస్థితికి చంద్రబాబే కారణం అని పురంధేశ్వరి కామెంట్స్ చేశారు.చంద్రబాబు చేసిన తప్పిదం వల్లనే ఏపీకి ప్రత్యేక హోదా లేకుండా పోయిందని పురంధేశ్వరి కామెంట్స్ చేశారు. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే… 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కల్యాణ్, బీజేపీ మద్దతుతో ఏపీలో అధికారంలోకి వచ్చారు చంద్రబాబు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన ఏ హామీని కూడా ఆయన నెరవేర్చింది లేదు. పైగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులను కూడా తీసుకురావడంలో చంద్రబాబు పైగా ఫెయిల్ అయ్యరు.

పైగా కేంద్రం నిర్మించాల్సిన పోలవరం ప్రొజెక్ట్ కూడా కమీషన్ల కోసం కక్కుర్తిపడి.. రాష్ట్ర ప్రభుత్వమే పోలవరాన్ని నిర్మిస్తుందని చంద్రబాబు చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కూడా చంద్రబాబు లాలూచి పడ్డారు. ప్రత్యేక హోదాకు బదులు , ప్రత్యేక ప్యాకేజీ తీసుకుని రాష్ట్రానికి చంద్రబాబు తీరని అన్యాయం చేశారు. తాజాగా దీనిపై దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. చంద్రబాబు తీరును ఆమె ఎండగట్టారు. చంద్రబాబు వల్లే ఏపీకి ఈ దుస్థితని ఆమె పేర్కొన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదాకు బదులుగా కేంద్రం గతంలో ప్రకటించిన ప్యాకేజీని గత సీఎం చంద్రబాబు అంగీకరించిన విషయాన్ని కూడా పురందేశ్వరి గుర్తుచేశారు. కేంద్రం ఇచ్చిన నిధులతో అప్పటి నేతలు జేబులు నింపుకున్నారని.. ఇప్పటి ప్రభుత్వం అయిన కేంద్రం ఇచ్చిన నిధులను ప్రజల కోసం ఉపయోగించాలంటూ వైసీపీ ప్రభుత్వానికి సూచించారు. మొత్తనికి చాలాకాలం తరువాత మీడియా ముందుకు వచ్చిన దగ్గుబాటి పురంధేశ్వరి టీడీపీని విమర్శించడం హాట్ టాపిక్‌గా మారింది. దగ్గుబాటి పురంధేశ్వరి కుమారుడు హితేష్ వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరుఫున పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ఇలా చంద్రబాబు మీద కామెంట్స్ చేయడం ఇటు టీడీపీలోను.. ఇటీ బీజేపీలోను చర్చనీయంశంగా మారింది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!