Thursday, December 12, 2024

జగనే మాకు సీఎంగా కావాలంటున్న ఒడిస్సా గ్రామస్తులు

- Advertisement -

వైసీపీ అధినేత , ఏపీ సీఎం జగన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జగన్ క్రేజ్ ఒక్క ఏపీకే పరిమితం కాలేదు. జగన్ క్రేజ్ ఏపీ సరిహద్దు ప్రాంతాలకు పాకింది. ముఖ్యంగా మరో తెలుగు రాష్ట్రం అయిన తెలంగాణలో ఇప్పటికి జగన్‌ను అభిమానించే వారి సంఖ్య అధికంగానే ఉంది. జగన్ హైదరాబాద్ వస్తే చాలు ఆయన్ను చూడటానికి అభిమానులు భారీ సంఖ్యలో వస్తుంటారు. తెలంగాణలో సైతం జగన్ వంటి ముఖ్యమంత్రి మాకు కూడా ఉంటే బాగుండు అని చాలామంది అనుకోవడం మనం చూస్తునే ఉన్నాం. మన పక్క రాష్ట్రాలు అయిన కర్నాటక, తమిళనాడు కూడా జగన్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. తమిళనాడులో జగన్ నామాస్మరణ బాగా వినిపిస్తోంది. చైన్నైలో అయితే జగన్ పేరిట భారీ ఫ్లెక్సీలు దర్శనం ఇస్తున్నాయి. ఆ మధ్య జరిపిన సర్వేలో దేశ ప్రధాని మోదీ తరువాత అంతటి చరిష్మా కలిగిన నేతగా వైఎస్ జగనే నిలిచారు.

ఇదిలా ఉంటే జగనే మాకు సీఎం అంటూ పక్క రాష్ట్రం ప్రజలు ప్రకటించడం ఇప్పుడు సంచలనంగా మారింది. రాష్ట్రం వేరు అయినప్పటికి కూడా జగనే మాకు సీఎంగా కావాలని క్క రాష్ట్రంలోని ఓ గ్రామస్తులు కోరుకుంటున్నారు. ఇంతకీ జగనే మాకు సీఎంగా కావాలంటున్న పక్క రాష్ట్రంలోని గ్రామం ఎక్కడ ఉందో తెలియాలంటే ఈ మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. ఏపీకి అనుకునే ఒడిస్సా రాష్ట్రంలో ఉంది. రాష్ట్రాల విభజన జరిగినప్పుడు .. కొన్ని తెలుగు ప్రాంతాలను కూడా ఒడిస్సా రాష్ట్రంలో కలిపేయడం జరిగింది. అక్కడ తెలుగు మాట్లాడేవారు ఉన్నారు. ఇలా రాష్ట్రాల సరిహద్దులలోని శివారు ప్రాంతాలకు చెందిన వారు అటూ ఇటూ ఉన్నారు. అయితే ఇన్నాళ్లు ఒడిస్సాలోనే కలిసి ఉన్న ఓ గ్రామం ఇప్పుడు తమను ఏపీలో కలపాలని డిమాండ్ చేస్తుంది. దీనికి కారణం.. ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే అని తెలుస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు నియోజకవర్గంలోని కొటియా గ్రామం తమను ఏపీలో కలిపేయాలని.. జగనే మా సీఎం అని ఆ గ్రామస్తులు అంటున్నారు.

గ్రామాంలో ఉండే వారిని మీ ముఖ్యమంత్రి ఎవరు అంటే జగన్ అని ఠక్కున చెబుతారు. ఏపీలోనే తాము ఉంటామని, తమకు ఏపీ సంక్షేమ పధకాలు కావాలని వారు కోరుతున్నారు. తమను ఆంధ్రలో కలిపివేయాలని ఆ గ్రామస్తులు ఒడిషా ప్రభుత్వన్ని కోరుతున్నారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం కూడా కలుగచేసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. గతంలో దీనిపై ఏపీ సీఎం జగన్.. ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్‌‌తో సమావేశం అయి.. దీనిపై చర్చించారు. దాని మీద రెండు రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ కమిటీని అధికారులతో నియమించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించాయి. అయితే దీనిపై పురొగతి లేకపోవడంతో మరోమారు కొటియా గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. మరి ఇప్పటికైనా ఏపీలో కలవాలనే వీరి డిమాండ్ నెరవేరుతుందో లేదో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!