Sunday, June 29, 2025

సుమ‌న్ హిట్స్ అండ్ ఫ్లాప్స్‌

- Advertisement -

తెలుగు సినీ ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో సుమన్. తన కెరీర్‌లో విభిన్న చిత్రాల్లో లీడ్ రోల్ యాక్ట‌ర్ న‌టించి మంచి పేరు తెచ్చుకున్నారు. 1980 నుంచి 2000ల వరకు క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌తో పాటు కుటుంబ కథాచిత్రాల్లో విభిన్న పాత్ర‌ల్లో యాక్ట్ చేశారు. వివిధ సంద‌ర్భాల్లో మృదుస్వభావిగా..మ‌రికొన్నిసార్లు యాక్షన్ హిరోగా, మళ్లీ 2000 తరువాత విలనిజంలోనూ సుమన్ మెరిశారు. ఆయన నటించిన 100 సినిమాల జాబితాను పరిశీలిస్తే..త‌న కెరీర్‌లో గణనీయమైన ఒడిదుడుకులే కనిపిస్తాయి. ఈ వంద మూవీస్‌ల్లో సూపర్ హిట్ చిత్రాలు 20 వ‌ర‌కు ఉండ‌గా.., హిట్లు 24..అవరేజ్ సినిమాలు 27, ఫ్లాపులు 29గా ఉన్నాయి. అంటే మొత్తం విజయవంతమైన చిత్రాలు 44 కాగా మిగ‌తా సినిమాల‌న్నీ ఆయ‌న‌కు నిరాశే మిగ‌ల్చ‌డం గ‌మ‌నార్హం.

సుమన్‌కి ఇద్దరు కిలాడీలు, సితార, నేటి భారతం, త్రివేణి సంగమం, ఉగ్రనేత్రుడు, పెద్దింటి అల్లుడు, బావ బావమరిది, కల్యాణరాముడు, లాహిరి లాహిరి లాహిరిలో వంటి సినిమాలు మైలు రాయులుగా నిలిచాయి. బావ బావమరిది వంటి బ్లాక్ బ్లాస్టర్‌ అయితే ఆయనకు నేటికీ గుర్తింపును తెచ్చిపెట్టింది. అదే సమయంలో కొండవీటి రౌడీ, రామ్, దాదాగిరి, జై బాలాజీ వంటి చిత్రాలు ఆయ‌న‌ను తీవ్ర నిరాశ‌కు గురిచేశాయి. అయినా తన స్థిరమైన అభినయ నైపుణ్యం..క్లాస్-మాస్‌లకు మేళవింపైన సినిమాల ఎంపిక ద్వారా సుమ‌న్ ద‌శాబ్దాల పాటు ప్రేక్షకాభిమానాన్ని చూరగొన్నారు. కెరీర్ ప్రారంభం నుంచే వైవిధ్యంతో కూడిన కథలను ఎంచుకుంటూ ప్రయోగాలకు వెనుకాడని నటుడిగా ఆయన సినీ ప్రయాణం నిలిచిపోతుంది.

సుమన్ హీరోగా న‌టించిన మూవీస్ లిస్ట్‌

1.తరంగిణి – అవరేజ్ 2. కొడలు కావాలి – అవరేజ్ 3. కల్యాణ వీణ – అవరేజ్ 4. ఇద్దరు కిలాడీలు – సూపర్ హిట్ 5. పండంటి కాపురానికి 12 సూత్రాలు – అవరేజ్ 6. నేటి భారతం – సూపర్ హిట్ 7. త్రివేణి సంగమం – సూపర్ హిట్ 8. ప్రళయ సింహం – హిట్ 9. సితార – సూపర్ హిట్ 10. జేమ్స్ బాండ్ 999 – హిట్ 11. మెరుపుదాడి – అవరేజ్ 12. కుర్రచేష్టలు – అవరేజ్ 13. డాకు – అవరేజ్ 14. ఈ చరిత్ర ఇంకెన్నాళ్లు – అవరేజ్ 15. దేశంలో దొంగలు పడ్డారు – హిట్ 16. న్యాయం మీరే చెప్పాలి – హిట్ 17. అమెరికా అల్లుడు – హిట్ 18. దర్జా దొంగ – అవరేజ్ 19. కంచుకవచం – అవరేజ్ 20. దొంగల్లో దొర – అవరేజ్ 21. గర్జన – ఫ్లాప్ 22. ముసుగు దొంగ – హిట్ 23. సమాజంలో స్త్రీ – అవరేజ్ 24. మారుతి – హిట్ 25. శ్రీమతి కానుక – హిట్ 26. చాదస్తపు మొగుడు – అవరేజ్ 27. ప్రేమ సామ్రాట్ – సూపర్ హిట్ 28. ధర్మపత్ని – హిట్ 29. బందిపోటు – అవరేజ్ 30. ఉక్కు సంకెళ్లు – హిట్ 31. ఉగ్రనేత్రుడు – సూపర్ హిట్ 32. రక్త కన్నీరు – అవరేజ్ 33. పట్టనాటి రుద్రయ్య – హిట్ 34. నేరం నాది కాదు – అవరేజ్ 35. రావుగారింట్లో రౌడీ – హిట్ 36. కొండవీటి రౌడీ – ఫ్లాప్ 37. నేటి చరిత్ర – ఫ్లాప్ 38. 20వ శతాబ్దం – హిట్ 39. జయసింహ – ఫ్లాప్ 40. సాహసపుత్రుడు – హిట్ 41. దోషి నిర్దోషి – హిట్ 42. రాముడు కాదు రాక్షసుడు – ఫ్లాప్ 43. ఆత్మ బంధువు – సూపర్ హిట్ 44. పెద్దింటి అల్లుడు – సూపర్ హిట్ 45. మహా యజ్ఞం – ఫ్లాప్ 46. భార్గవ్ – ఫ్లాప్ 47. మొండి మొగుడు పెంకి పెళ్లాం – సూపర్ హిట్ 48. పట్టుదల – ఫ్లాప్ 49. యముడన్నకి మొగుడు – ఫ్లాప్ 50. చక్ర వ్యూహం – ఫ్లాప్ 51. కలెక్టర్ గారి అల్లుడు – హిట్ 52. అలెగ్జాండర్ – హిట్ 53. నక్షత్ర పోరాటం – హిట్ 54. పరువు-ప్రతిష్ట – అవరేజ్ 55. రెండిళ్ల పూజారి – హిట్ 56. బావ బావమరిది – బ్లాక్ బాస్టర్ 57. కొండపల్లి రాజా – సూపర్ హిట్ 58. దొంగల్లుడు – సూపర్ హిట్ 59. చిన్న అల్లుడు – సూపర్ హిట్ 60. భగత్ – ఫ్లాప్ 61. గడుసు పిండం – అవరేజ్ 62. సమరం – ఫ్లాప్ 63. ఛాంపియన్ – ఫ్లాప్ 64. అల్లుడు పోరు అమ్మాయి జోరు – అవరేజ్ 65. జయభేరి – ఫ్లాప్ 66. రామ్ – ఫ్లాప్ 67. ఎంటర్ ది డ్రాగన్ – ఫ్లాప్ 68. జాకీచాన్ – హిట్ 69. హిమబిందు – ఫ్లాప్ 70. వన్ మెన్ ఆర్మీ – ఫ్లాప్ 71. భలే మామయ్య – హిట్ 72. దాదాగిరి – ఫ్లాప్ 73. సూర్యపుత్రులు – ఫ్లాప్ 74. లక్ష్యం – ఫ్లాప్ 75. బంగారు మొగుడు – అవరేజ్ 76. హలో అల్లుడు – హిట్ 77. లీడర్ – ఫ్లాప్ 78. మాయబజార్ – అవరేజ్ 79. బాలరాజు బంగారు పెళ్లాం – హిట్ 80. ఖైదీ ఇన్ స్పెక్టర్ – సూపర్ హిట్ 81. ముద్దాయి ముద్దుగుమ్మ – ఫ్లాప్ 82. ఆలుమగులు – ఫ్లాప్ 83. నాయుడిగారి కుటుంబం – సూపర్ హిట్ 84. అబ్బాయిగారి పెళ్లి – సూపర్ హిట్ 85. ప్రియమైన శ్రీవారు – అవరేజ్ 86. ఏవండి పెళ్లి చేసుకోండి – హిట్ 87. ఓసి నా మరిదలా! – అవరేజ్ 88. సంభవం – ఫ్లాప్ 89. శ్రీవారంటే మావారే – అవరేజ్ 90. స్వర్ణముఖి – అవరేజ్ 91. పెద్ద మనుషులు – సూపర్ హిట్ 92. రామసక్కనోడు – అవరేజ్ 93. పెళ్లాం వచ్చింది – ఫ్లాప్ 94. ఫిబ్రవరి 14 నెక్లెస్ రోడ్డు – ఫ్లాప్ 95. చంద్రవంశం – అవరేజ్ 96. లాహిరి లాహిరి లాహిరిలో – సూపర్ హిట్ 97. కళ్యాణ రాముడు – సూపర్ హిట్ 98. రామప్ప – ఫ్లాప్ 99. జై బాలాజీ – ఫ్లాప్ 100. అయ్యప్ప కటాక్షం – ఫ్లాప్

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!