Thursday, December 12, 2024

గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ఎవరు ఊహించని వ్యక్తి తెర మీదకు తీసుకువచ్చిన జగన్

- Advertisement -

రాబోవు ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు కూడా చాలా కీలకం అని చెప్పాలి. 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించింది వైసీపీ పార్టీ. ఆ ఎన్నికల్లో 175 సీట్లగాను 151 సీట్లలో విజయం సాధించడం జరిగింది. టీడీపీ కేవలం 23 అసెంబ్లీ స్థానాలకు, మూడు పార్లమెంట్ స్థానాలకు పరిమితం అయింది. వచ్చే ఎన్నికల్లో అయిన టీడీపీ ఘన విజయం సాధించాలని చూస్తోంది. పార్టీ గెలుపు బాధ్యతలను తన భూజాన వేసుకున్నారు నారా లోకేష్. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఆయన యువగళం పేరట పాదయాత్ర కూడా చేయడానికి సిద్దం అయ్యారు. ఇటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా వారాహీ వాహనంతో బస్సు యాత్ర చేయడానికి సన్నద్దం అవుతున్నారు. ఈ రెండు పార్టీలు కూడా వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించాలని ప్రయత్నిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రత్యర్థుల వ్యూహాలను తిప్పి కొట్టేందుకు జగన్ కూడా రెడీ అవుతున్నారు.

రాబోవు ఎన్నికల్లో మరొసారి టీడీపీ, జనసేన పార్టీలను చావు దెబ్బ కొట్టడానికి జగన్ సిద్దం అవుతున్నట్లుగా స్పష్టం అవుతుంది. టీడీపీ , జనసేన పార్టీలు కలిసి వచ్చిన ఎదుర్కొనేందుకు జగన్ సంసిద్దంగా ఉన్నట్లుగా ఆయన వ్యవహారశైలిని చూస్తే అర్థం అవుతుంది. టీడీపీ, జనసేన పార్టీలు కూడా ప్రస్తుతం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని చెప్పడం వైసీపీ సర్కార్‌కు కలిసి వచ్చే అంశం. టీడీపీ, జనసేన పార్టీలు తమ వ్యూహాలు బయటపెట్టినప్పటికి కూడా జగన్ మాత్రం ఇప్పటి వరకు తన వ్యూహాం ఏమిటో చెప్పింది లేదు. 2024 ఎన్నికలు చాలా కీలకం అని జగన్‌కు కూడా తెలుసు. అందుకే ఆయన చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో చాలాచోట్ల అభ్యర్థులను మారుస్తున్నరనే ప్రచారం జరుగుతుంది. ఇది నిజమే అని పార్టీ నేతలు కూడా చెబుతున్నారు.

ఒక్కో నియోజకవర్గానికి దాదాపు ముగ్గురు నేతలను జగన్ సిద్దం చేసుకుంటున్నారట. వారిలో అన్ని రకాల అమోధ్యమైన వ్యక్తిని ఎంపిక చేస్తారని పార్టీలోనే టాక్ వినిపిస్తోంది. దీనిలో భాగంగానే గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ఎవరు ఊహించని వ్యక్తిని తెర మీదకు తీసుకువచ్చారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిన స్థానాలలో గుంటూరు ఎంపీ కూడా ఒకటి. 2014 ఎన్నికల్లో కూడా ఆ సీటు టీడీపీనే గెలుచుకుంది. వచ్చే ఎన్నికల్లో మాత్రం… గుంటూరు ఎంపీ స్థానంను వైసీపీ కైవసం చేసుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నారట పార్టీ అధినేత. దీనిలో భాగంగానే 2019 ఎన్నికల్లో పోటీ చేసిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని కాదని.. ఓ బీసీ నేతకు టికెట్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నారట. రాజధాని తరలిపోవడంతో.. అక్కడ వైసీపీకి వ్యతిరేకత ఉందని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు చెక్ పెడుతూ.. ఎవరు ఊహించని నేతకు పార్లమెంట్ స్థానంను కేటాయించాలని చూస్తున్నారట. అయితే ఆ నేత పేరు మాత్రం బయటకు రావడం లేదు. మరి కొత్త నేత ఎంట్రీలో అయిన 2024 ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ స్థానంలో వైసీపీ విజయం సాధిస్తుందో లేదో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!