Thursday, December 12, 2024

చంద్రబాబు ఇన్నాళ్లు గెలవడానికి కారణం ఇదే

- Advertisement -

కుప్పం అంటే మొదటగా గుర్తుకు వచ్చేది టీడీపీ అధినేత చంద్రబాబే. గత 40 ఏళ్లుగా చంద్రబాబు కుప్పం నియోజకవర్గం నుంచి విజయం సాధిస్తూ వస్తున్నారు. తన సొంత నియోజకవర్గం అయిన చంద్రగిరి నియోజకవర్గంలో ఓడిపోయిన తరువాత చంద్రబాబు కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. అక్కడ ప్రజలు ఆయన్ను ఆదరించడంతో.. చంద్రబాబుకు ఎదురులేకుండాపోయింది. టీడీపీ కంచుకోటలలో కుప్పం నియోజకవర్గం కూడా ఒకటని ఇన్నాళ్లు అందరు భావించారు. కాని కుప్పంలో ఎప్పుడు లేనంత వ్యతిరేకత చంద్రబాబు మీద ఉందని తెలుస్తోంది. కుప్పంలో ఇన్నాళ్లు వరుసగా చంద్రబాబు విజయం సాధించడానికి గల కారణాలు ఏమిటని ఆరా తీస్తే ..విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే .. 2009 ఎన్నికల్లో వైఎస్ఆర్ రెండోసారి సీఎం అయిన తరువాత..అప్పటి ఎన్నికల కమీషనర్ అయిన సబర్వాల్ కుప్పంలో భారీగా దొంగ ఓట్లు ఉన్నాయని గుర్తించారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేలోపు. వైఎస్ఆర్ హఠాత్తుగా మరణించడంతో.. ఈ విషయం మరుగున పడిపోయింది.

కాని వైఎస్ఆర్ తనయుడు జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టుకున్నప్పటి నుంచి కూడా చంద్రబాబుకు కంటి మీద కునుకు ఉండటం లేదు. వైసీపీ స్థాపించిన తరువాత జరిగిన రెండు సార్వత్రిక ఎన్నికల్లో కూడా చంద్రబాబు మెజార్టీ తగ్గుతూ వచ్చింది. ఇంకాస్తా గట్టిగా పోరాడితే..కుప్పంలో చంద్రబాబును ఓడించడం పెద్ద కష్టం కాకపోవచ్చని వైసీపీ నాయకులు భావిస్తున్నారు. దీనిలో భాగంగానే వై నాట్ 175 అనే నినాదాన్ని తెర మీదకు రావడంతో పాటు.. కుప్పంను టార్గెట్‌గా పెట్టుకుని వైసీపీ నాయకులు పని చేస్తున్నారు. కుప్పంలో అభివృద్ది కార్యక్రమాలతో పాటు, టీడీపీకి ధీటుగా వ్యూహాలను పన్నుతున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించడమే పని పెట్టుకున్న వైసీపీ నాయకులు ..ఆయన ఇన్నాళ్లు ఏ అభివృద్ది చేయకుండా ఎలా గెలిచారనే దానిపై ప్రత్యేక దృష్టిని సారించారు.

ఈక్రమంలోనే కుప్పంలో భారీగా దొంగ ఓట్లను గుర్తించారు. క‌ర్నాట‌క‌లో స్థిర‌ప‌డిన కుప్పం వాసుల ఓట్లు సుమారు 60 వేలు ఇప్ప‌టికీ ఆంధ్రాలోనే ఉన్నాయ‌ని వైసీపీ గుర్తించింది. చంద్ర‌బాబు విజ‌య ర‌హ‌స్యం దొంగ ఓట్ల‌లో దాగి ఉంద‌ని గ్ర‌హించి, వాటిని తొల‌గించే ప్ర‌క్రియ‌కు ఆ పార్టీ గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు శ్రీ‌కారం చుట్టింది. పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ఆయ‌న కుమారుడు మిథున్‌రెడ్డి ఇద్దరు కూడా దొంగ ఓట్లను పూర్తిగా తొలగించే పనిలో నిమగ్నమైయ్యారు. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు సుమారు 28 వేల దొంగ ఓట్ల‌ను తొల‌గించారు. దీంతో చంద్ర‌బాబు మెజార్టీ అమాంతం ప‌డిపోయింది. ఒకొనోక దశలో చంద్రబాబు వైసీపీ అభ్య‌ర్థి చంద్ర‌మౌళి కన్నా కూడా వెనుకంజలో ఉన్నారు.దొంగ ఓట్ల‌ను క‌ట్ట‌డి చేయ‌డంతో చంద్ర‌బాబుకు మెజార్టీ త‌గ్గింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కుప్పంలో చంద్ర‌బాబు ఎత్తుల్ని చిత్తు చేసేందుకు వైసీపీ ప‌క‌డ్బందీ వ్యూహంతో ముందుకెళ్తోంది. దొంగ ఓట్ల ర‌హ‌స్యం బ‌య‌ట ప‌డ‌డం, దాన్ని పూర్తిస్థాయిలో అరిక‌డితే త‌న ప‌రిస్థితి ఏంట‌నే భ‌యం చంద్ర‌బాబును వెంటాడుతోంది. ఇంకా దాదాపు 30వేల ఓట్లను తొలగించాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఒకవేళ ఆ ఓట్లను కూడా తొలగిస్తే.,.. చంద్రబాబు పరిస్థితి అధోగతే అనే అభిప్రాయం కూడా వెల్లడవుతుంది. వచ్చే ఎన్నికల్లో కుప్పంను కూడా గెలుస్తున్నాం అని జగన్ అందుకే అంత ధీమాగా చెబుతున్నారని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు. మరి 2024 ఎన్నికల్లో కుప్పంలో ఎలాంటి ఫలితం వస్తుందో వేచి చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!