తక్కువ కాలంలోనే బలమైన రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి… ప్రస్తుతం ఆయన చేస్తున్న పరిపాలనకు ఏపీ ప్రజలే కాదు ఇతర రాష్ట్రాల ప్రజలు అలాగే ప్రజాప్రతినిధులు సైతం ఫిదా అవుతున్నారు… కొంతమంది తమకు ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటే బాగుండేది అనేవారు కూడా లేకపోలేదు.. జగన్ కు ఇంత క్రేజ్ రావడానికి కారణం ఆయన చేస్తున్న పరిపాలనే అంటారు…
ఇప్పటివరకు జగన్ పరిపాలనపై అనేక సర్వేలు నిర్వహించారు వాటన్నింటిలో వైసిపి పాలన అద్భుతంగా ఉందని తేల్చాయి… అంతే కాదు నెక్స్ట్ సీఎం కూడా జగనే ఉండాలని పలు సర్వేల్లో తేలిన విషయం తెలిసిందే…
తాజాగా మరో జాతీయ మీడియా ఏబీపీ ఛానల్ దేష్ ఖ మూడ్ పేరుతో దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించింది… ఇందులో ద బెస్ట్ సీఎంగా జగన్మోహన్ రెడ్డి మూడో స్థానంలో ఉన్నారు… ఒకటి రెండు స్థానాల్లో ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లు ఉన్నారు… అత్యుత్తమ పాలన సామర్థ్యంతో అన్ని వర్గాల ప్రజలకు ఆసరాగా నిలిచే సంక్షేమ పథకాలు సమర్ధవంతంగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఘనత సాధించారు… ఇక నాలుగవ స్థానంలో కేరళ ముఖ్యమంత్రి వినరయి విజయన్, ఐదవ స్థానంలో ఉద్దవ్ టాక్రే, ఆరవ స్థానంలో భూపేష్, ఏడవ స్థానంలో మమతా బెనర్జీ, ఎనిమిదవ స్థానంలో శివరాజ్ సింగ్ చౌహన్, తొమ్మిదవ స్థానంలో ప్రమోద్ సావంత్, పదవ స్థానంలో విజయ్ రూపాని ఉన్నారు…
అలాగే కేంద్రం పని తీరు పట్ల 66% సంతోషంగా ఉన్నారని 33 శాతం మంది సంతోషంగా లేరని ఈ సర్వేలో తేలింది అలాగే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 58 శాతం మంది ఎన్ డి ఏ కు మద్దతు ఇవ్వగా యూపీఏ కు 28 శాతం మంది మద్దతు ఇచ్చారని తేలింది… 55 శాతం మంది ప్రధాని పదవికి మోడీని ఎన్నుకోగా కేవలం 11 శాతం మాత్రమే రాహుల్ గాంధీని ఎన్నుకున్నారు