Wednesday, October 16, 2024

టీడీపీ మైండ్ గేమ్..ఆ నలుగురే కాదు..!

- Advertisement -

ఇంతకాలం ఏపీలో అధికార వైసీపీ పోలిటికల్ గేమ్ ఆడుతూ ఎక్కడకక్కడ ప్రతిపక్ష టి‌డి‌పికి చెక్ పెడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతుంది..టి‌డి‌పి మైండ్ గేమ్ ఆడుతూ వైసీపీని నిలువరించే ప్రయత్నం చేస్తుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టి‌డి‌పిని ఎన్నిరకాలుగా ముప్పుతిప్పలు పెట్టారో చెప్పాల్సిన పని లేదు. టి‌డి‌పి నేతలకు చుక్కలు చూపించారు..అలాగే నేతలపై కేసులు పెట్టడం, జైలుకు పంపించడం జరిగింది..ఇక చంద్రబాబుని ఎన్ని రకాలుగా బూతులు తిట్టారో…ఆయన్ని ఎన్ని రకాలుగా అడ్డుకున్నారో చెప్పాల్సిన పని లేదు.

ఇక టి‌డి‌పి ఎమ్మెల్యేలని వైసీపీలోకి లాగడం..టి‌డి‌పి నేతలని చాలామందిని లాక్కోవడం చేశారు. ఇక ప్రతి ఎన్నికల్లోనూ వైసీపీ విజయాలు అందుకుంది.. వన్ సైడ్ గా గెలిచేసింది..ఇంకా టి‌డి‌పి చాప్టర్ క్లోజ్..చంద్రబాబు పని అయిపోయిందని వైసీపీ నేతలు విపరీతంగా ప్రచారం చేస్తూ వస్తున్నారు. దీంతో నిజంగానే ఇంకా టి‌డి‌పి పుంజుకోలేదా అనే పరిస్తితి.

వైసీపీ దెబ్బకు టి‌డి‌పి పని అయిపోయిందనే భావన వచ్చిన పరిస్తితి. అలాంటి పరిస్తితి నుంచి టీడీపీ పికప్ అవ్వడం..అధికార బలంతో ఉన్న వైసీపీకి రివర్స్ లో చెక్ పెట్టే దిశగా టి‌డి‌పి మైండ్ గేమ్ ఆడటం మొదలుపెట్టింది. ఇప్పటికే మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిచి టి‌డి‌పి ఊపు మీద ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకుంది.

టి‌డి‌పి నుంచి నలుగురు ఎమ్మెల్యేలని వైసీపీ లాక్కుంటే..అదే సంఖ్యలో వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేల చేత క్రాస్ ఓటింగ్ వేయించి టి‌డి‌పి గెలిచింది. అయితే వీరే కాదు..ఇంకా వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని. 16 మంది ఎమ్మెల్యేలు దాకా టచ్ లో ఉన్నారని టి‌డి‌పి మైండ్ గేమ్ ఆడేస్తుంది. దీంతో ఆ ఎమ్మెల్యేలు ఎవరు అని వైసీపీలో టెన్షన్ మొదలైంది..ఇప్పటికే నలుగురు షాక్ ఇచ్చారు..మరి రానున్న రోజుల్లో ఎంతమంది షాక్ ఇస్తారో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!