ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నట్లు కనిపిస్తుంది. ఒకరోజు అధికార పార్టీ అధిపత్యం చేలాయిస్తుంటే.. మరొక రోజు ప్రతిపక్షాలు జగన్ సర్కార్ మీద పైచేయి సాధించినట్లుగా కనిపిస్తోంది. ఏది ఏమైనప్పటికి కూడా ఏపీలో అన్ని రాజకీయాలు పార్టీలు కూడా ఎన్నికల మూడ్‌లో వెళ్లాయనేది మాత్రం అక్షర సత్యం. ఇదే సమయంలో ప్రకాశం జిల్లాలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. 2019 ఎన్నికల్లో పర్చూరులో వైసీపీ తరుఫున బరిలోకి దిగిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయబోయే ఆమంచి కృష్ణమోహన్ .. పర్చూరు నియోజకవర్గానికి రాగానే రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఆయన తనతో పాటు కొడుకు హితేష్ కూడా రాజకీయాలకు దూరం అని ప్రకటించి సంచలనం సృష్టించారు. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఇటీవల పర్చూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఆమంచి కృష్ణ మోహన్ ను వైసీపీ అధినేత జగన్ నియమించిన సంగతి తెలిసిందే. ఆమంచి కృష్ణమోహన్ పర్చూరు నియోజకవర్గానికి వచ్చారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యతలను ఆయన స్వీకరించారు. వైసీపీ కార్యకర్తలు పెద్దయెత్తున ఆయన స్వాగతం పలికారు. బైకులు, కార్లతో ఆమంచిని పర్చూరుకు ఆహ్వానించారు. ఆమంచి అలా బాధ్యతలను చేపట్టారో లేదో దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.రాజకీయాల నుంచి తనతో పాటు తన కుమారుడు హితేష్ కూడా తప్పుకుంటున్నారని తెలిపారు. . ప్రస్తుత రాజకీయాల్లో తాము మనలేమని ఆయన చెప్పుకొచ్చారు.మనసును చంపుకుని తాము నేటి రాజకీయాలు చేయలేకపోతున్నామని తెలిపారు.
ఇటువంటి రాజకీయల్లో మనుగడ కూడా కొనసాగించలేమని తెలిపారు. అందుకే తనతో పాటు తన కుమారుడు హితేష్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నామని తెలిపారు. అయితే ఉన్నట్లు ఉండి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇలా రాజకీయాల నుంచి తప్పుకోవడం వెనుక జగన్ మాస్టర్ స్కెచ్ కూడా ఉంది. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు .. టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన వైసీపీకి దూరంగా ఉంటున్నారు. తన కుమారుడు హితేశ్ ను రాజకీయాల్లోకి తేవాలని ఆయన మొన్నటి వరకూ భావించారు. అయితే జగన్ దగ్గుబాటి ఫ్యామిలీకి చెక్ పెడుతూ.. నియోజకవర్గ బాధ్యతలను ఆమంచి కృష్ణమోహన్‌కు అప్పగించారు. దగ్గుబాటి కొంతకాలంగా వైసీపీకి దూరంగా ఉండటమే కాకుండా..చంద్రబాబుతో దగ్గర అవుతున్నారు. ఇది గమనించిన జగన్ దగ్గుబాటి దూరం పెడుతూ..వచ్చారు. ఈక్రమంలోనే పర్చూరు నియోజకవర్గ బాధ్యతలను ఆమంచి కృష్ణ మోహన్ అప్పగించారు. అయితే దగ్గుబాటి టీడీపీలోకి వెళ్తారని అందరు భావించారు కాని.. ఇలా రాజకీయాలకే గుడ్ బై చెబుతారని ఎవరు కూడా ఊహించలేదు.