Thursday, December 12, 2024

పార్టీలు మారితే ఇదే గతి..ఈ నేతలకు టికెట్లు లేవ్..?

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు కానున్నాయా అంటే అవుననే అంటున్నాయి రాజకీయవర్గాలు. ఇవే తనకు చివరి ఎన్నికలని స్వయంగా బాబే ప్రకటించారు. ఆఖరిసారిగా ఆయన్ను సీఎంగా చూడటానికి తెలుగు తమ్ముళ్లు సిద్దంగా ఉన్నప్పటికి కూడా ప్రజలు మాత్రం చంద్రబాబు గత పాలన మీద ఇంకా విరక్తితోనే కనిపిస్తున్నట్లుగా ఉంది. అయితే జగన్‌ను ఢీ కొట్టడం తన ఒక్కడు వల్ల కాదని ముందే గ్రహించిన చంద్రబాబు.. తన ఎన్నికల పార్టనర్ అయిన పవన్‌ కల్యాణ్ మీద ఆధానపడ్డారు. దీనిలో భాగంగానే పవన్ మీద సానుభూతిని నటిస్తూ ఆయనకు దగ్గరైయ్యారు. శత్రువుకు శత్రువు మనకు మిత్రుడు అవుతాడనే సామేత ఎలాగు ఉంది కాబట్టి.. జగన్‌ను ద్వేషించే పవన్ చాలా త్వరగానే చంద్రబాబు వలలో పడినట్లుగా కనిపించింది. అందుకే చంద్రబాబు ఇంటికి వెళ్లి మరి ఆయన్ను పరామర్శించడం.. తన సభలకు వచ్చేవారు సంకరజాతి వారన్న బాలకృష్ణ షోకు అతిథిగా వెళ్లడం అని కూడా దీనిలో భాగంగానే కనిపిస్తోంది.

ఇక 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఈమేర ఇరు పార్టీ నేతలు ఓ నిర్ణయానికి కూడా వచ్చినట్లుగా సమాచారం అందుతుంది.30 నుంచి 40 ఎమ్మెల్యే స్థానాలను జనసేనకు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తుంది. నాలుగు పార్లమెంట్ స్థానాలు కూడా జనసేనకు దక్కే అవకాశం లేకపోలేదు. ఇదిలా ఉంటే టీడీపీ, జనసేన పొత్తు ఉంటే.. కొందరు టీడీపీ నేతలకు టికెట్లు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా 2014 ఎన్నికల్లో వైసీపీ తరుఫున గెలిచి, 23 ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిన సంగతి అందరికి తెలిసిందే. 2019 ఎన్నికల్లో అదే 23 స్థానాలు టీడీపీకి వచ్చాయి. ఇలా వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారందరికి కూడా చంద్రబాబు టికెట్లు కేటాయించారు. కాని ఆ 23 మందిలో కేవలం ఒక్కరు మాత్రమే విజయం దక్కించుకున్నారు. అద్దంకి నుంచి పోటీ చేసిన గొట్టిపాటి రవి కుమార్ ఒక్కరే తిరిగి విజయం సాధించారు. మిగిలిన వారు ఓటమి చవి చూశారు. పైగా.. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఒకరిద్దరు తప్ప.. మిగిలన వారు పార్టీలో యాక్టివ్‌గా లేకపోవడం గమనార్హం.

అయితే 2024 జరిగే ఎన్నికల్లో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారెవ్వరికి కూడా టికెట్లు దక్కేలా కనిపించడం లేదు. ఒక్క గొట్టిపాటి రవి కుమార్ మాత్రమే తిరిగి తన టికెట్‌ను నిలబెట్టుకుంటారని తెలుస్తోంది. సుజయ్ కృష్ణ రంగారావు, జలీల్ ఖాన్, భూమా అఖిల ప్రియ, రాజేశ్వరి, గిడ్డి ఈశ్వరి, అమర్నాథ్ రెడ్డి, మొదలగు వారందరికి కూడా టికెట్లు వచ్చే అవకాశం కనిపించడం లేదు. సుజయ్ కృష్ణ రంగారావు స్థానంలో ఆయన తమ్ముడు టికెట్ ఆశిస్తున్నారు. జలీల్ ఖాన్‌కు అసలు టికెట్ దక్కేలా కనిపించడం లేదు. ఇక భూమా అఖిల ప్రియ వల్ల పార్టీ పరువు పోయిందని చంద్రబాబు భావిస్తున్నారు. నంద్యాల టికెట్ భూమా బ్రహ్మనందరెడ్డికి ఖారారు చేసిన చంద్రబాబు.. ఆళ్లగడ్డ సీటు మాత్రం సస్పెన్స్‌లో ఉంచారు. దీంతో భూమా అఖిల ప్రియకు టికెట్ కష్టమనే సంకేతాలు వెలువడుతున్నాయి. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మాత్రం లోకేష్‌లో సిఫారసు చేయించుకుని అయిన టికెట్ పొందాలని చూస్తున్నారు. ఇలా వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన నేతందరు కూడా టికెట్లు కోసం నానాతంటాలు పడుతున్నారు. మరి వీరికి టికెట్లు దక్కుతాయో లేదో చూడాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!