రాజకీయ విశ్లేషకుడు , మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మరొసారి తెర మీదకు వచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలపై తనదైనశైలిలో మాట్లాడి అందరిని ఆకట్టుకుంటురాయన. తాజాగా ఈ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఏపీ రాజకీయాల గురించి.. వచ్చే ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి.. కాపులు ఏ పార్టీకి అండగా నిలవబోతున్నారు అనే దానిపై చక్కటి విశ్లేషణ చేశారు. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉండవల్లి అరుణ్ కుమార్ .. పెద్దగా పరిచియం అక్కర్లేని పేరు ఇది. వైఎస్ఆర్ అనుచరుడుగా, రాజమండ్రి ఎంపీగా ఏపీ రాజకీయాలలో తనదైన ముద్ర వేశారాయన. ఏపీ రాజకీయాల్లో ఆయనది ఎప్పుడు కూడా ప్రతిపక్ష పాత్రే. ఎప్పటికప్పుడు అధికరపక్షాన్ని నిలదీస్తుంటరాయన. గతంలో చంద్రబాబును, ఇప్పుడు జగన్‌ను ప్రశ్నిస్తునే ఉన్నారు. తాజాగా ఆయన ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో 2024 ఎన్నికల ఫలితాలతో పాటు, కాపులు ఎటు వైపు నిలుస్తారు అనే దాని గురించి మాట్లాడారు.
సీఎం జగన్ చెబుతున్నట్లుగా వచ్చే ఎన్నికలు క్లాస్ వార్ కాదని..క్యాస్ట్ వార్ కొనసాగుతోందని ఉండవల్లి చెప్పుకొచ్చారు. ఈ విషయం జగన్‌కు కూడా తెలుసునని ఆయన వెల్లడించారు. అధికారంలోకి వస్తే ప్రస్తుతం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇస్తున్న అంశం పైన స్పందించారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఆలస్యం అయినా సంక్షేమ పథకాల్లో భాగంగా పెన్షన్లు మాత్రం ఆగటం లేదన్నారు. జీతాలు ఆలస్యం అయితేనే ఉద్యోగులే గొడవ చేస్తున్నారని.. పెన్షన్లు ఆలస్యం అయితే సహించే పరిస్థితి ఉండదన్నారు. జగన్ ఉద్యోగుల మీద ఆశలు పెట్టుకన్నట్లుగా కనిపించడం లేదని ఉండవల్లి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాపుల ఓట్లు చాలా కీలకంగా మారనున్నాయి అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదని ఉండవల్లి చెప్పుకొచ్చారు. కాపులు సంఖ్య పరంగా అధికారం డిసైడ్ చేసే స్థానంలో ఉన్నా.. ఆర్దికంగా ..రాజకీయంగా ప్రయోజనాలు పొందని వారిగా కాపులు మిగిలిపోయారని ఆయన విశ్లేషించారు.
2014 ఎన్నికల్లో టీడీపీకి అండగా నిలిచిన కాపులు ఓటర్లు .. తీరా 2019 ఎన్నికల్లో పవన్‌కు మద్దతు ఇవ్వలేదన్నారు. 2019 ఎన్నికల్లో కాపులు మెజార్టీ ఓటింగ్ జగన్‌కు అండగా నిలిచి వైసీపీకే ఓటు వేశారని ఉండవల్లి గుర్తు చేశారు. కాపు ఓటింగ్ ఎవరికి పడితే వారికి అధికారం దక్కించుకోవటానికి అవకాశం ఉంటుందన్నారు. టీడీపీ – జనసేన పొత్తు పెట్టుకున్న కాపులంతా ఆ పార్టీలకే ఓటు వేస్తారని చెప్పలేమని ఉండవల్లి పేర్కొన్నారు. మధ్యతరగతి ప్రజల ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయని..వచ్చే ఎన్నికల్లో వేరే పార్టీ అధికారంలోకి వస్తే.. ప్రస్తుతం వస్తున్న డబ్బులు, పథకాలు ఆగిపోతాయోమే అనే భయంతో కూడా వారు ఉండవచ్చని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. ఎవరు అధికారంలో ఉంటే తమకు లాభం అని భేరీజు వేసుకున్న తరువాతే వారు ఓటు వేస్తారని ఈ మాజీ ఎంపీ విశ్లేషణ చేశారు. మరి వచ్చే ఎన్నికల్లో కాపులు ఎవరి పక్షానా నిలుస్తారో చూడాలి.