Thursday, December 12, 2024

చంద్రబాబుకుబిగ్ షాక్జ జగన్ ను కలిసేందుకు సిద్ధమైన టిడిపి మాజీ మంత్రి

- Advertisement -

ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ లోని కొంతమంది నేతలకు సమస్యలు వెంటాడుతున్నాయా… వారు ఆ సమస్యలను ఎదుర్కోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా… దీంతో వారు తమ రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా ఇతరు పార్టీలవైపు మొగ్గుచూపుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది కొంతమంది నేతలను చూస్తుంటే…

ముఖ్యంగా రాయలసీమకు చెందిన ఓ మాజీ టిడిపి మంత్రి ప్రస్తుతం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారట… ఈ సమయంలో పార్టీ అధిష్టానం ఆయనకు అండగా ఉండకపోవడంతో తన అసహనం వ్యక్తం చేస్తున్నారట… ఇక దాంతోపాటు గతంలో ఆయన గెలుపుకు సహకరించిన బీసీ సామాజిక వర్గం కూడా దూరం కావడంతో ఏం చేయలేని స్థితిలో ఉన్నారట… ఇప్పుడు ఆ సామాజిక వర్గం వైసీపీకి సపోర్టెడ్ గా ఉందట..

దాంతో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా వైసీపీ గెలుపు నల్లేరు మీద నడక అని అంటున్నారు కొంతమంది… ఇక చేసేదేమీలేక ఆ మాజీ మంత్రి తన రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… ఈ క్రమంలో టిడిపి అధిష్టానం ఎంత బుజ్జగించినా తాను పార్టీలో ఉండనని తేల్చి చెప్పేస్తున్నారట ఆ మాజీ మంత్రి..

తాజా సమాచారం ప్రకారం వైసీపీ సర్కార్ కు చెందిన ఓ కీలక నేతతో తనపార్టీ చేరికపై చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి.. పార్టీ అధిష్టానం ఓకే అంటే మంచి ముహూర్తం చూసుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో సైకిల్ దిగి ఫ్యాన్ కింద రెస్ట్ తీసుకోవాలని చూస్తున్నారట ఆ టిడిపి మాజీ మంత్రి… చూడాలి మరి టిడిపి అధిష్టానం ఆయనను పార్టీ మారకుండా ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందో…

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!