Monday, February 10, 2025

అరవింద్ కేజ్రీవాల్ కు షాక్ ఇచ్చిన చంద్రబాబు.. జాతీయస్థాయిలో ఇదే చర్చ

- Advertisement -

చంద్రబాబు రాజకీయాలే చేయగలరు. రాజకీయాల కోసం ఎంతటి దూరానికైనా వెళ్ళగలరు. అప్పుడప్పుడు తగ్గుతారు.. అవసరం అయితే రెచ్చిపోతారు. అవసరం అనుకుంటే చేరదీస్తారు. అవసరం లేదనుకుంటే పొమ్మనలేక పొగ పెడతారు. ఇది ఆయన నాలుగు దశాబ్దాల రాజకీయం తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు. తాజాగా ఆయన చేతిలో మరొకరు బాధితుడిగా మిగిలారు. ఆయనే ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. గతంలో అదే కేజ్రీవాల్ ను ఏపీకి తీసుకొచ్చి తనకు మద్దతుగా ప్రచారం చేయించుకున్నారు. ఇప్పుడు అదే కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు చంద్రబాబు.

ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈనెల ఐదున పోలింగ్ జరగనుంది. 8న ఫలితాలు వెల్లడించనున్నారు. దీంతో ఢిల్లీలో ప్రచారం పతాక స్థాయికి చేరింది. పదేళ్లకు పైగా ఉన్న అమ్ ఆద్మీ పార్టీని ఎలాగైనా ఓడించాలని బిజెపి కంకణం కట్టుకుంది. దేశం మొత్తం తన చేతిలోకి వచ్చినా.. దేశ రాజధాని మాత్రం కేజ్రీవాల్ చేతిలో ఉండడం బిజెపి పెద్దలకు మింగుడు పడడం లేదు. అందుకే ఈ ఎన్నికల్లో గెలిచేందుకు సర్వశక్తులు వడ్డుతోంది. అందులో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబును రంగంలోకి దించింది. తెలుగు ప్రజలు అధికంగా నివాసం ఉండే ప్రాంతాలలో చంద్రబాబుతో ప్రచారం చేయించింది. ఎన్డీఏ లో కీలక భాగస్వామిగా ఉంటూ చంద్రబాబు ప్రచారం చేయడంలో ఎంత మాత్రం తప్పులేదు. కానీ అరవింద్ కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా చంద్రబాబు మాట్లాడడాన్ని మాత్రం జాతీయ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రబాబు స్థాయికి తగ్గట్టు వ్యవహరించలేదని ఎక్కువ మంది వ్యాఖ్యానిస్తున్నారు. అవసరం కోసం ఇంతలా దిగజారి పోతారా అని కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఇదే కేజ్రీవాల్ చంద్రబాబుకు మద్దతుగా ఏపీలో ప్రచారం చేయడాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

2018లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది తెలుగుదేశం పార్టీ. అప్పట్లో వైసీపీ ట్రాప్ లో పడిన చంద్రబాబు కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేదని కారణం చూపుతూ ఎన్డీఏ కు గుడ్ బై చెప్పారు. రాజకీయ విరుద్ధ నిర్ణయాలు తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారు. ఈ దేశానికి రాహుల్ గాంధీని ప్రధాని చేస్తానని శపధం చేశారు. అంతటితో ఆగకుండా దేశవ్యాప్తంగా బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం కూడా చేశారు. ఆ సమయంలోనే ఢిల్లీ సీఎం గా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ తో పాటు ఫరుక్ అబ్దుల్లాను ఏపీకి రప్పించారు. బిజెపికి వ్యతిరేకంగా, తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ప్రచారం చేయించుకున్నారు. కానీ ఇప్పుడు అదే అరవింద్ కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ఢిల్లీలో ప్రచారం చేశారు చంద్రబాబు.

అయితే చంద్రబాబు ప్రచారం వరకు ఓకే కానీ.. కేజ్రీవాల్ ప్రభుత్వంపై చేసిన విమర్శలు ఇప్పుడు వైరల్Arvind Kejriwal.. అవుతున్నాయి. పదేళ్లకు పైగా అధికారంలో ఉన్న అం ఆద్మీ పార్టీ ఢిల్లీ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు కూడా ఇవ్వలేకపోయింది. దేశం స్వచ్ఛభారత్ లో దూసుకుపోతుంటే.. ఢిల్లీ మాత్రం మురికి కోపం లోకి వెళ్ళిపోతోంది. ఢిల్లీలో వాతావరణ కాలుష్యంతో పాటు పొలిటికల్ పొల్యూషన్ కూడా ఉంది. 1995లో హైదరాబాద్ ఉన్నట్లు ఇప్పుడు ఢిల్లీ కూడా ఉంది. అభివృద్ధి రాజకీయాలు, జీవన ప్రమాణాలు పెరగాలంటే బిజెపికి ఓటు వేయండి అంటూ చంద్రబాబు ఢిల్లీ ప్రజలకు పిలుపునివ్వడం గమనార్హం. కనీసం తన కోసం ప్రచారానికి అరవిందు కేజ్రీవాల్ వచ్చారన్న విషయాన్ని కూడా మర్చిపోయారు చంద్రబాబు. అది కేజ్రీవాల్ పై బిజెపి మెప్పుకోసం చంద్రబాబు చేసిన ఈ కామెంట్స్ జాతీయస్థాయిలో చర్చకు దారితీస్తున్నాయి. చంద్రబాబు తన హోదాకు తగ్గట్టు వ్యవహరించడం లేదని జాతీయ నేతలు తప్పుపడుతున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!