Monday, February 10, 2025

ఫిబ్రవరి నెలలో 18 వేల పింఛన్లు కట్

- Advertisement -

ఏపీ ప్రజలకు షాక్ ఇస్తోంది కూటమి ప్రభుత్వం. తాము వస్తే సంపద సృష్టించి మరి సంక్షేమ పథకాలు అందిస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. రెట్టింపు సంక్షేమం అమలు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. కానీ ఏడు నెలల పాలన దాటుతుందన్న క్రమంలో బాదుడు ప్రారంభించారు. భూముల విలువను పెంచి.. రిజిస్ట్రేషన్ ధరలను అమాంతం పెంచేశారు. ఇప్పుడు పింఛన్ల కోత తో ప్రజలు విలవిల్లాడుతున్నారు. అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది. ప్రతి నెల పింఛన్లలో కోతపడుతోంది. ఫిబ్రవరిలో ఏకంగా 18 వేల పింఛన్లు తొలగించినట్లు తెలుస్తోంది. దీంతో లబ్ధిదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇలా తొలగించిన పింఛన్లలో దివ్యాంగులకు సంబంధించినవే ఎక్కువగా ఉండటం విశేషం.

అధికారంలోకి వస్తే పింఛన్ మొత్తాన్ని మూడు వేల నుంచి 4 వేలకు పెంచుతానని.. ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని గత ఏడాది జరిగిన ఎన్నికల్లో హామీ ఇచ్చారు చంద్రబాబు. అధికారంలో వచ్చిన వెంటనే నాలుగు వేల రూపాయలకు పింఛన్ మొత్తాన్ని పెంచారు. మూడు నెలల బకాయితో కలిసి అందించారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్. అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచి పింఛన్ల కోత పడుతూనే ఉంది. ప్రతి నెల రకరకాల కారణాలు చెప్పి పింఛన్లు తొలగిస్తూ వస్తున్నారు. ఫిబ్రవరి నెలకు సంబంధించి ఏకంగా 18 వేల మంది పింఛన్లు తొలగించారు. మున్ముందు రెండు లక్షల పింఛన్లు తొలగిస్తారని ప్రచారం నడుస్తోంది.

అనర్హుల పేరుతో పింఛన్ల తొలగింపునకు దిగింది కూటమి ప్రభుత్వం. ప్రధానంగా వైసీపీ సానుభూతిపరుల పింఛన్లు తొలగించాలని పెద్ద స్కెచ్ వేసింది. దివ్యాంగ పింఛన్ల తనిఖీకి సర్వే చేపడుతోంది. నడవలేని దీర్ఘకాలిక రోగులకు ఇంటి వద్దకు వెళ్లి పరీక్షిస్తున్నారు వైద్యులు. మిగతా దివ్యాంగులకు సమీప ఆసుపత్రులకు రప్పిస్తున్నారు. వారికి వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. వైకల్యం నిర్ధారణ అయితేనే పింఛన్లు కొనసాగించే అవకాశం ఉంది. లేకుంటే మాత్రం తొలగించడం ఖాయంగా తెలుస్తోంది. అయితే ఎటువంటి సర్వే లేకుండానే ప్రతి నెల 5 నుంచి పదివేల వరకు పింఛన్లు తొలగించారు. ఈ సర్వే పూర్తయ్యాక మాత్రం లక్షల పింఛన్లు తొలగించే ఛాన్స్ కనిపిస్తోంది. అటు కొత్త పింఛన్లు లేకపోగా ఉన్న పింఛన్లు తొలగించడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనవసరంగా కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకొని జేజేతులా తప్పు చేశామని బాధపడుతున్నారు.

దాదాపు 3 లక్షలకు పైగా కొత్త లబ్ధిదారులు పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. కానీ వారిని ఇంతవరకు పరిగణలోకి తీసుకోలేదు. కొత్త పింఛన్ల జారీకి సంబంధించి ఎటువంటి కసరత్తు చేయలేదు. పైగా బీసీలకు 50 ఏళ్లు దాటితే చాలు పింఛన్లు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని సైతం బుట్ట దాఖలు చేశారు. ఎన్నికలకు ఏడాది ముందు అమలు చేసేందుకు సిద్ధపడుతున్నారు. అయితే 60 ఏళ్లు దాటి పింఛన్కు అర్హత పొందిన వారు ఉన్నారు. వారికి ఇంతవరకు పింఛన్ మంజూరు కావడం లేదు. కనీసం ఎప్పుడు ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుందో చెప్పడం లేదు. ఈ ఏడాది జనవరి నుంచి కొత్త పింఛన్లు అని ప్రచారం చేసుకున్నారు. దీంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు పెట్టుకున్నారు. కానీ వాటికి అతి గతి లేదు. పైగా ఇప్పుడు ఉన్న పింఛన్లు తొలగిస్తుండడంతో.. కొత్తగా మంజూరు అవుతాయో? లేదో అన్న ఆందోళన వారిలో ఉంది. అయితే గత ఐదేళ్లుగా దివ్యాంగ పింఛన్లు అందుకున్న వారికి నిలిపి వేస్తున్నారు. అది మాత్రం చాలా బాధాకరం. రకరకాల కుంటి సాకులు చెప్పి.. వైసీపీ సానుభూతిపరుల పింఛన్లు తొలగిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. మున్ముందు లక్షల పింఛన్లు తొలగిస్తారని తెలియడం ప్రజల కళ్ళల్లో కంటిమీద కునుకు లేకుండా పోతుంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!