Monday, February 10, 2025

జగన్మోహన్ రెడ్డిలో ఆ ఫైర్ కావాలంటున్న వైసీపీ శ్రేణులు!

- Advertisement -

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రమాదంలో ఉంది. అధినేత జగన్ సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. పార్టీకి ఘోర ఓటమి ఒకవైపు.. కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పడం మరోవైపు తెగ ఇబ్బంది పెడుతున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం మరింత దూకుడు పెంచుతోంది. కేంద్రంలో ఉన్న బిజెపి ద్వారా వైసీపీని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోంది. ఇటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో జగన్ తీసుకునే నిర్ణయాలపైనే వైసిపి భవిష్యత్తు ఆధారపడి ఉంది. అందుకే మునుపట్టి జగన్మోహన్ రెడ్డిలా నిర్ణయాలు తీసుకోవాలని పార్టీ క్యాడర్ కోరుతోంది. 2010లో వైయస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో జగన్ నాయకత్వం తెరపైకి వచ్చింది. అప్పటివరకు ఆయన ఒంటరి. తల్లి విజయమ్మతో కలిసి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ప్రజల గొంతుకై పని చేశారు. ఆయనపై అభిమానంతో కొందరు, ప్రత్యామ్నాయం లేక మరికొందరు నేతలు ఆయన వెంట నడిచారు. 2014 ఎన్నికల్లో 67 అసెంబ్లీ సీట్లతో గౌరవప్రదమైన ప్రతిపక్ష పాత్రకు వచ్చింది వైసిపి. కానీ 2019 ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించారు జగన్మోహన్ రెడ్డి. 151 అసెంబ్లీ సీట్లతో ఘన విజయం సాధించి దేశం యావత్ తన వైపు చూసుకునేలా చేసుకున్నారు. కానీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి అదే స్థాయిలో ఓటమి ఎదురైంది. ఇప్పుడు కూడా దేశం యావత్తు జగన్మోహన్ రెడ్డి పై చూసింది.

వైసీపీ ఆవిర్భావం తర్వాత జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు చాలావరకు ఫలించాయి. 2024 ఎన్నికల వరకు జగన్ అప్రతిహాస నిర్ణయాలతో ప్రత్యర్థులను కంటిమీద కునుకు లేకుండా చేశారు. ముఖ్యంగా నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు సైతం జగన్మోహన్ రెడ్డి ఎత్తుగడలను తట్టుకోలేకపోయారు. జగన్ ప్రజలతో మమేకమైన తీరు, సమాజంలో ఉన్న మెజారిటీ వర్గాల అభిమానాన్ని పొందడం వంటివి చాలా ప్రత్యేకం. జగన్ ఒక ప్రత్యేక ఓటు బ్యాంకు తయారు చేసుకున్నారు అంటే ఆయన ఎంత ఆకర్షణీయంగా మారారో అర్థమవుతోంది. తన చరిస్మను పెంచుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఎంతటి భారీ ఓటమిలో కూడా 40 శాతం ఓటు బ్యాంకు సాధించుకున్నారు అంటే ఏ స్థాయిలో ప్రజల్లో ప్రభావితం చూపారు అర్థం అవుతుంది.

2014 నుంచి 2019 వరకు విపక్ష పాత్ర పోషించారు జగన్మోహన్ రెడ్డి. పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించారు. అయినా సరే ఎక్కడ వెనక్కి తగ్గలేదు. అప్పట్లో ప్రజలతో మమేకమై పనిచేసిన తీరు అభినందనలు అందుకుంది. ప్రత్యేక హోదా నినాదంతో ఆయన చేసిన పోరాటానికి చంద్రబాబు ఆందోళనకు గురయ్యారు. ఆయన చేసిన రాజకీయం మూలంగా ఏకంగా బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కు సైతం గుడ్ బై చెప్పారు. రాజకీయంగా తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. దానికి ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి ఆడిన పొలిటికల్ గేమ్ కారణం. సుదీర్ఘకాలం పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రజలతో ఇట్టే కలిసి పోయారు. భారీ విజయాన్ని నమోదు చేసుకున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి మునుపటిలా దూకుడుగా వ్యవహరించాలని పార్టీ శ్రేణులు సైతం కోరుతున్నాయి.

విదేశాల నుంచి ఇటీవల జగన్మోహన్ రెడ్డి బెంగళూరు చేరుకున్నారు. ఈరోజు ఆయన తాడేపల్లి రానున్నారు. పార్టీ ముఖ్యులతో సమావేశం కానున్నారు. కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. జిల్లాల పర్యటనకు సంబంధించి షెడ్యూల్ నిర్ణయించనున్నారు. అయితే త్వరలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఉంటుందన్నమాట నడుస్తోంది. 2027 ద్వితీయార్థంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే దానికి సంబంధించి సూత్రప్రాయంగా పార్టీ నేతల అభిప్రాయాలను తీసుకునే అవకాశం ఉందని ప్రచారం నడుస్తోంది. అయితే పాదయాత్ర చేసేందుకు ఇంకా సమయం ఉందని.. ఎన్నికలకు ఏడాదిన్నర ముందు చేస్తే సరిపోతుందని అభిప్రాయం పార్టీ నేతల్లో ఉంది. అయితే నిత్యం ప్రజలతో ఉండేందుకు మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తే పార్టీకి పూర్వ వైభవం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!