Monday, February 10, 2025

చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. రాజ్యసభకు బాలకృష్ణ.. ఎమ్మెల్యేగా నందమూరి వసుంధర దేవి!

- Advertisement -

నందమూరి బాలకృష్ణను సైడ్ చేస్తున్నారా? ఆయన భార్య వసుంధరను తెరపైకి తెస్తున్నారా? వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేయడం ఖాయమా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. నందమూరి బాలకృష్ణకు ఇటీవల పద్మ అవార్డును ప్రకటించారు. సందర్భంగా సోదరి నారా భువనేశ్వరి ఆత్మీయ కలయిక నిర్వహించారు. తన సొంత ఫామ్ హౌస్ లో దీనిని ఏర్పాటు చేశారు. నందమూరి, నారా కుటుంబ సభ్యులు, ఆత్మీయులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా ఏపీ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ బాలకృష్ణ తన భార్య వసుంధరకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారని.. ఆమె మెప్పు కోసమో.. లేకుంటే నిజంగా అడుగుతున్నారో తెలియడం లేదని చెప్పుకొచ్చారు. అయితే అక్కడే ఉన్న బాలకృష్ణ రెండు టికెట్లు కావాలని సింబల్ చూపించారు. దీంతో ఇది కొత్త చర్చకు దారితీస్తోంది. బాలకృష్ణ స్థానంలో వసుంధర పోటీ చేస్తారని ప్రచారం ప్రారంభం అయింది. అయితే చంద్రబాబు ఏది మాట్లాడినా దాని వెనుక వ్యూహం ఉంటుంది. సరైన సమయం చూసి దానిని బయట పెట్టగలరు కూడా. ఇప్పుడు నందమూరి కుటుంబ సభ్యులంతా ఉండగా చంద్రబాబు ఈ విషయాన్ని ప్రకటించడం విశేషం. తప్పకుండా దీని వెనుక వ్యూహం ఉంటుంది అన్నది విశ్లేషకుల అభిప్రాయం.

హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు గెలిచారు నందమూరి బాలకృష్ణ. 2014 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేశారు. ఘన విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో రెండో సారి పోటీ చేసి గెలుపొందారు. జగన్ ప్రభంజనాన్ని తట్టుకొని మరి నిలబడ్డారు. ఈ ఎన్నికల్లో బాలకృష్ణను ఓడించేందుకు వైసిపి సర్వశక్తులు వడ్డింది. కానీ విజయాన్ని ఆపలేకపోయింది. హ్యాట్రిక్ విజయంతో బాలకృష్ణ తన ముద్ర చూపించుకున్నారు. వాస్తవానికి హిందూపురం నియోజకవర్గంలో టిడిపి ఇంతవరకు ఓడిపోలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి గెలుపొందుతూ వస్తోంది. అప్పట్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి.. ఇప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టినా హిందూపురం నియోజకవర్గం విషయంలో మాత్రం ఏం చేయలేకపోయారు.

నందమూరి కుటుంబానికి హిందూపురం పెట్టని కోటగా మారింది. టిడిపి ఏర్పాటు చేసిన తర్వాత నందమూరి తారక రామారావు హిందూపురం నుంచి పోటీ చేసి గెలిచారు. అటు తరువాత ఆయన కుమారుడు నందమూరి హరికృష్ణ సైతం ఇదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. నందమూరి బాలకృష్ణ సైతం ఇదే నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. గత మూడు ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు. అయితే ఈసారి ఆయన తప్పుకుని భార్య వసుంధరకు అవకాశం ఇవ్వాలని బాలకృష్ణ కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులోనూ భారీ ఎత్తుగడ ఉన్నట్లు సమాచారం. 2029 ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన పూర్తవుతుంది. నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది. అందుకే హిందూపురం తో పాటు మరో నియోజకవర్గాన్ని తమకు కేటాయించాలని బాలకృష్ణ కోరుతున్నట్లు సమాచారం. అయితే కుటుంబంలో ఇద్దరికీ టిక్కెట్లు ఇవ్వమని చంద్రబాబు సైతం చెబుతున్నారు. కానీ అక్కడ అడుగుతోంది నందమూరి కుటుంబం కాబట్టి చంద్రబాబు తన ఆలోచన మార్చుకునే అవకాశం కూడా ఉంది.

అయితే వసుంధర దేవి హిందూపురం నియోజకవర్గ బాధ్యతలను చూస్తున్నారు. బాలకృష్ణ సినిమా షూటింగ్లలో బిజీగా ఉంటే పరామర్శలు, ఇతరత్రా కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. నియోజకవర్గం పై ఆమెకు అవగాహన కూడా ఉంది. అయితే బాలకృష్ణ మరో ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. తాను కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఆలోచనతో ఉన్నారని సన్నిహితులు చెబుతున్నారు. భార్య వసుంధర దేవికి హిందూపురం నియోజకవర్గం అప్పగించి.. రాజ్యసభ సభ్యుడిగా వెళ్లిపోతే బాగుంటుంది అని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎంపీగా ఉంటూనే సినిమాల్లో కొనసాగవచ్చని.. అప్పుడు ఏ ఇబ్బందులు ఉండవని చంద్రబాబు దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు సమాచారం. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్లే వసుంధర దేవి ప్రస్తావన తీసుకొచ్చారని.. వచ్చే ఎన్నికల్లో ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!