ఇండియన్ పాలిటిక్స్ హిస్టరీలో చంద్రబాబుది ప్రత్యేక స్థానం. ఆయన రాజకీయ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తారు. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తారు. ఈ విషయంలో ఎంత దాకైనా వెళ్లేందుకు ఆయన సిద్ధపడతారు. ఆయన రాజకీయ గమనం గురించి తెలిసిన వారు ఇట్టే ఈ విషయాన్ని పసిగట్టగలరు. అయితే ఆయన పాలనా దక్షుడని.. గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఆయన గురించి ప్రచారం చేస్తుంది. అదే పనిగా ఆయనను పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అయితే ఆయన గుడ్ అడ్మినిస్ట్రేషన్.. పాలనా దక్షుడు అన్న మాటను పక్కన పెడితే.. రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతారు అన్నది.. జాతీయస్థాయి నేతలను అడిగితే ఇట్టే చెబుతారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ.. కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ ఈయన చేతిలో బాధితులే. అధికారం కోసం.. తన ఉనికిని కాపాడుకునే కోసం ఆయన ఎంతవరకైనా వెళ్తారు. ఆయనకు సెంటిమెంట్స్ అంటూ ఉండవు. కేవలం రాజకీయ ప్రయోజనాలు తప్ప.
2019 ఎన్నికల్లో బిజెపిని చంద్రబాబు వ్యతిరేకించారు. మరోసారి ఈ దేశానికి నరేంద్ర మోడీ ప్రధాని కాకూడదని కంకణం కట్టుకున్నారు. సైద్ధాంతిక విభేదాలను పక్కనపెట్టి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారు. ఏకంగా రాహుల్ గాంధీని ప్రధాని చేస్తానని శపధం చేశారు. దేశవ్యాప్తంగా బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ప్రధాని మోదీ శత్రువు అన్న రీతిలో ప్రవర్తించారు. ఎట్టి పరిస్థితుల్లో దేశంలో రెండోసారి మోడీ ప్రధాని కాకూడదని ఊరు వాడ ప్రచారం చేశారు. అయితే ప్రజలు తనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. ఈ దేశానికి ముచ్చటగా రెండోసారి మోడీ ప్రధాని అయ్యారు. దీంతో ఒక్కసారిగా రాహుల్ గాంధీ అంటే ఎవరో తెలియని రీతిలో చంద్రబాబు ప్రవర్తించారు. అసలు తనకు కాంగ్రెస్ పార్టీతో సంబంధమే లేదని అర్థం వచ్చేలా మాట్లాడారు. తన నటన చాతుర్యంతో కొత్త రాజకీయం చేశారు. అసలు రాహుల్ గాంధీ ఎవరో తెలియని మాదిరిగా కాంగ్రెస్ పార్టీని వదిలించుకున్నారు.
2014లో బిజెపితో కలిసి చంద్రబాబు పోటీ చేశారు. కేంద్రంలోనూ అధికారాన్ని పంచుకున్నారు. రాష్ట్రంలోనూ బిజెపికి అధికారాన్ని పంచుకునే ఛాన్స్ ఇచ్చారు. అయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలను సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారు. ఇదే విషయాన్ని నాటి ప్రతిపక్ష నేత జగన్ చెప్పేసరికి తట్టుకోలేక పోయారు. కేంద్రంలో బిజెపితో అధికారం పంచుకోవడంతో తనపై ఏపీ ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని చంద్రబాబు భయపడ్డారు. అందుకే ఉన్నఫలంగా బిజెపితో కటీఫ్ చెప్పారు. మరో మాట చెప్పకుండా ఏపీ ప్రజలను బిజెపిని బూచిగా చూపి రాజకీయ లబ్ధి పొందాలని భావించారు. కానీ తాను ఒకటి తలిస్తే.. ప్రజలు ఒకటి తలచినట్లు.. ఆ ఎన్నికల్లో చంద్రబాబును దారుణంగా దెబ్బతీశారు ప్రజలు. చంద్రబాబు చెబుతున్న మాటలు వినక వైసీపీకి ఏకపక్షంగా మద్దతు తెలిపారు. సైద్ధాంతిక విభేదాలను పక్కనపెట్టి చంద్రబాబుతో చేతులు కలపడాన్ని ప్రజలు తట్టుకోలేకపోయారు. అందుకే వాతలు పెట్టారు. అధికారం నుంచి దూరం చేశారు.
బిజెపితో విభేదించిన చంద్రబాబు 2018లో ఎన్డీఏకు గుడ్ బై చెప్పారు. ఎన్డీఏ వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమితో చేతులు కలిపారు చంద్రబాబు. 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీని నిలువునా ముంచారు. ఆంధ్రప్రదేశ్లో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతుగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా ఎన్నికల ప్రచారం చేశారు. అయినప్పటికీ చంద్రబాబుకు దారుణ పరాజయం తప్పలేదు. అదే సమయంలో బాబు విభేదించిన బిజెపి రెండోసారి అధికారంలోకి రాగలిగింది. దీంతో ఒక్కసారిగా చంద్రబాబు భయపడ్డారు. అప్పటివరకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీని దూరంగా ఉంచారు.
భారతీయ జనతా పార్టీ లేనిదే ఏపీలో తన విజయం లేదని చంద్రబాబు గ్రహించారు. అందుకే ఐదేళ్లు తిరిగేసరికి అదే బిజెపితో మళ్ళీ స్నేహ సంబంధాన్ని ఏర్పరచుకున్నారు. అయితే అది మోడీ చరిస్మ.. లేకుంటే జగన్ సర్కార్ వ్యతిరేకతో తెలియదు కానీ.. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. కానీ రాజకీయాల్లో స్నేహ సంబంధాలను మరిచి.. ఒకప్పుడు తనను సాయం అందించిన ఢిల్లీ సీఎం అరవింద్ వ్యతిరేకంగా ఇప్పుడు చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. ఒకప్పుడు బిజెపి బాధ్యత నేతగా ఉన్న చంద్రబాబుకు అండగా నిలబడ్డారు కేజ్రీవాల్. ఇప్పుడు అదే కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా … బిజెపికి అనుకూలంగా ప్రచారానికి ముందుకెళ్తున్న చంద్రబాబును ఏమనాలి? ఏమని వర్ణించాలి? రాజకీయాల అందు చంద్రబాబు తీరు వేరు అన్నట్టు ఉంది ఆయన పరిస్థితి.