Monday, February 10, 2025

ఫిబ్రవరి మొదటి వారంలో ఢిల్లీకి జగన్.. కేంద్ర పెద్దల ఎదుట కీలక ప్రతిపాదన!

- Advertisement -

మాజీ సీఎం జగన్ రూటు మార్చుతున్నారా? రాజకీయంగా పట్టు బిగించాలని భావిస్తున్నారా? సర్వశక్తులు వడ్డేందుకు సిద్ధపడుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం వైసీపీ చుట్టూ భారీ వ్యూహం అల్లుతోంది బిజెపి. రాష్ట్రంలో ఉన్న టిడిపి, జనసేన ఒత్తిడి చేస్తుండడంతో కేంద్ర పెద్దలు వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. ఏపీలో వైసీపీని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ కీలక నేతలను సైతం భయపెట్టి పార్టీ నుంచి బయటకు వెళ్లేలా చేస్తున్నారు. ఈ తరుణంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ బాట పడుతుండడం ఆశ్చర్యం వేస్తోంది. బిజెపి పెద్దలతో ఉన్న పాత పరిచయాల నేపథ్యంలో ఆయనకు ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జగన్ విదేశాల్లో ఉన్నారు. వచ్చిన వెంటనే ఫిబ్రవరి మొదటి వారంలో ఢిల్లీ వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షాను కలుస్తారని సమాచారం. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లలో వైసిపి నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానితో పాటు హోంమంత్రిని కలిసేందుకు అపాయింట్మెంట్ సైతం లభించినట్లు సమాచారం.

2019 నుంచి 2024 మధ్య వైసీపీ అధికారంలో ఉంది. ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులు చేపడుతూ వచ్చారు జగన్. రాజకీయాలకు అతీతంగా సంక్షేమాన్ని అమలు చేశారు. ఎన్నడూ కేంద్రంతో గొడవ పెట్టుకోలేదు. పైగా సఖ్యతగా మెలుగుతూనే వచ్చారు. అంతకుముందు చంద్రబాబు బిజెపిని ఏపీలో ఎంత నాశనం చేయాలో అంతలా చేశారు. కానీ జగన్ మాత్రం బిజెపి విషయంలో గౌరవభావంతోనే మెలిగారు.. ఎన్నడూ ఇబ్బందులు పెట్టిన దాఖలాలు కూడా లేవు. పైగా అంతులేని మెజారిటీతో లోక్సభ తో పాటు రాజ్యసభలో అడుగుపెట్టింది వైసిపి. తమకు సంఖ్యా బలం ఉందని వైసీపీ ఎన్నడు బిజెపి విషయంలో తప్పులు చేయలేదు. ఆ విషయం కేంద్ర పెద్దలకు సైతం తెలుసు. అందుకే ఈ ఎన్నికల్లో బిజెపి ముందుగా వైసీపీతో పొత్తు కోసం ముందుకు వచ్చింది. కానీ బిజెపితో నేరుగా కలిస్తే.. వైసీపీ సంప్రదాయ ఓటర్లు దూరం అవుతారన్న భయం జగన్కు వెంటాడింది. జగన్ తిరస్కరించేసరికి బిజెపి ప్రత్యామ్నాయంగా ఉన్న తెలుగుదేశం పార్టీతో జతకట్టింది.

అయితే ఎన్నికల అనంతరం కూడా జగన్ బిజెపి పట్ల విధేయతతో ముందుకు సాగుతూ వచ్చారు. పార్లమెంటులో బిల్లు ల పాస్ కావడం విషయంలో సైతం వైసీపీ బీజేపీకి మద్దతు తెలిపింది. చివరకు లోక్సభ స్పీకర్ పదవికి సైతం బిజెపికి జై కొట్టింది. అయితే ఏపీలో రాజకీయాల నేపథ్యంలో.. చంద్రబాబుతో పాటు పవన్ ఒత్తిడి మేరకు బిజెపి ఇప్పుడు జగన్ ను టార్గెట్ చేసుకుంది. అలా టార్గెట్ చేయవలసి వచ్చింది కూడా. అయితే కేంద్ర పెద్దలకు వైసీపీ పట్ల ఇప్పటికీ సాఫ్ట్ కార్నర్ ఉంది. అందుకే జగన్కు ఢిల్లీ పిలిపించి మాట్లాడేందుకు సిద్ధపడినట్లు సమాచారం.

గతంలో బిజెపి ప్రతిపాదనలకు గౌరవించి రాజ్యసభ పదవి సైతం కేటాయించారు జగన్. అలా పరిమల్ నత్వానికి రాజ్యసభ పదవి దక్కింది అందులో భాగంగానే. అయితే ఇప్పుడు అదే చనువుతో బిజెపి వద్దకు వెళ్తున్నారు జగన్. కీలక ప్రతిపాదన చేయనున్నారు. తన సతీమణి భారతికి రాజ్యసభ పదవి ఇవ్వాలని బిజెపికి జగన్ విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. దీని వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఏపీలో బలపడాలన్న ఆలోచనలో ఉంది బిజెపి. అయితే అది వైసిపి నిర్వీర్యం అయితే జరిగే పని కాదు. ఎందుకంటే వైసీపీ ఓటు బ్యాంకు వేరు. ఆ ఓటు శాతం బిజెపి వైపు తిరిగే ఛాన్స్ లేదు. బడుగు బలహీన వర్గాల తో పాటు వెనుకబడిన వర్గాల పార్టీగా వైసీపీకి ముద్ర ఉంది. పైగా మైనార్టీలు ఎక్కువగా మద్దతు తెలుపుతారు. అటువంటివారు బిజెపి వైపు మల్లుతారు అంటే జరగని పని. అయితే ఏపీలో వైసీపీ ని నిర్వీర్యం చేయడమంటే తెలుగుదేశం పార్టీని బలపడాలని భావించడమే. ఇదే విషయాన్ని జగన్ కేంద్ర పెద్దల వద్ద చర్చించే అవకాశం ఉంది. దేశంలో నాలుగోసారి అధికారంలోకి రావాలన్న బిజెపి ప్రయత్నానికి సైతం తాను మద్దతు తెలిపే అవకాశం ఉంది. ఏపీలో తన బలం పెరుగుతుందని.. గతం మాదిరిగా మద్దతు తెలుపుతానని జగన్ కేంద్ర పెద్దలకు హామీ ఇచ్చే అవకాశం ఉంది. టిడిపి, జనసేన తో పాటు తాను ఒక ప్రత్యామ్నాయం ఉన్నానన్న విషయాన్ని బిజెపికి గుర్తు చేసేందుకే జగన్ ఢిల్లీకి వెళ్తున్నట్లు సమాచారం. పైగా ఇన్నేళ్ల స్నేహానికి గుర్తింపుగా తన భార్యకు రాజ్యసభ పదవిని ప్రమోట్ చేయాలని కోరుతారని కూడా తెలుస్తోంది. మొత్తానికైతే భారీ స్కెచ్ తో ఫిబ్రవరి మొదటి వారంలో జగన్ ఢిల్లీలో అడుగుపెట్టనున్నారు అన్నమాట. మరి ఏం జరుగుతుందో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!