వైసీపీకి రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి. పార్టీ ఆవిర్భావానికి ముందే జగన్ వెంట అడుగులు వేసిన ఒకే ఒక వ్యక్తి విజయసాయిరెడ్డి. జగన్మోహన్ రెడ్డికి రాజకీయాలతో సంబంధం లేని రోజుల్లోనే ఆయన కార్యకలాపాలను చూసిన వ్యక్తి విజయసాయిరెడ్డి. అందుకే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో సైతం ఎ2గా నిలిచారు. ఆయనతో పాటే జైలు జీవితం గడిపారు. వైసిపి ఆవిర్భావంలో కూడా క్రియాశీలక పాత్ర పోషించారు. వైసీపీ విజయంలో కూడా తనదైన పాత్ర పోషించారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అహోరాత్రులు శ్రమించారు. కానీ అనూహ్య పరిస్థితుల్లో వైసీపీకి దూరమయ్యారు. ఏకంగా పార్టీ సభ్యత్వంతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి సైతం రాజీనామా చేశారు. దీంతో వైసీపీలో నెంబర్ 2 స్థానాన్ని కూడా విజయసాయిరెడ్డి వదులుకున్నారు. అయితే విజయసాయిరెడ్డి వదులుకున్న స్థానం ఇప్పుడు వైసీపీలో ఎవరిది అన్న టాక్ నడుస్తోంది.
వైసీపీకి గుడ్ బై చెప్పేనాటికి విజయసాయిరెడ్డి రాజ్యసభలో వైసిపి పక్ష నేత. పైగా ఉత్తరాంధ్ర పార్టీ సమన్వయకర్త కూడా. అయితే మొన్నటి వరకు ఆయన వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉండేవారు. రాజ్యసభలో 11 మంది సభ్యులతో పాటు లోక్సభలో నలుగురు వైసీపీ సభ్యులకు ఆయనే నాయకుడు. కానీ ఉన్నపలంగా ఆ బాధ్యతల నుంచి తప్పించారు జగన్. వైసిపి పార్లమెంటరీ పార్టీని తన బాబాయ్ వైవి సుబ్బారెడ్డి నియమించారు. రాజ్యసభ వైసీపీ పక్ష నేతగా విజయసాయిరెడ్డిని, లోక్సభలో పార్టీ పక్ష నేతగా పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిని నియమించారు. ఒక విధంగా చెప్పాలంటే విజయసాయిరెడ్డి అసంతృప్తి ఇక్కడే ప్రారంభం అయింది. వాస్తవానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా విజయసాయిరెడ్డి ఉండేవారు. కానీ ఆయనపై పార్టీ శ్రేణులు ఫిర్యాదు చేయడంతో ఆ బాధ్యతలనుంచి తప్పించారు జగన్. ఆ బాధ్యతలే కాదు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్న కీలక బాధ్యతల నుంచి కూడా తప్పించారు. కొద్ది రోజులపాటు పార్టీలో సైలెంట్ అయ్యారు విజయసాయిరెడ్డి.
ఈ ఎన్నికలకు ముందు అవసరాల కోసం విజయసాయిరెడ్డిని జగన్ చేరదీసినట్లు తెలుస్తోంది. పార్టీలో కీలకమైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టిడిపిలో చేరిపోయారు. దీంతో విజయసాయిరెడ్డిని పిలిచిన జగన్ నెల్లూరు పార్లమెంటు స్థానానికి అభ్యర్థిగా ప్రకటించారు. అయీష్టతగానే అక్కడికి వెళ్లారు విజయ్ సాయి రెడ్డి. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు. అయితే ఎన్నికల అనంతరం వైసిపి పార్లమెంటరీ పార్టీ నేతగా విజయసాయిరెడ్డిని తొలగించారు. ఆ స్థానంలో వైవి సుబ్బారెడ్డిని నియమించారు. అప్పటివరకు వైవి సుబ్బారెడ్డి నిర్వర్తించిన ఉత్తరాంధ్ర సమన్వయ కర్త పదవిని విజయసాయికి అప్పగించారు. ఈ మొత్తం పరిణామాలతో కలత చెందిన విజయసాయిరెడ్డి అఇష్టంగానే ఉత్తరాంధ్ర సమన్వయ ఉపాధ్యాయ బాధ్యతలను తీసుకున్నారు.
అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి వైసిపి తో పాటు రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పారు. ఇప్పుడు ఆయన స్థానంలో ఉత్తరాంధ్ర బాధ్యతలు తీసుకునేది ఎవరు అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. అయితే ఉత్తరాంధ్ర సమన్వయ బాధ్యతలను తీసుకునేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు. అదే సమయంలో జాతీయస్థాయిలో వైసీపీని సమన్వయం చేసుకునే బాధ్యతలు ఉండేవారు విజయసాయిరెడ్డి. ఆయన తప్పుకోవడంతో ఇప్పుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పై ఆధారపడుతున్నారు జగన్. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్న ఆయన పై వివేకానంద రెడ్డి హత్య కేసు కొనసాగుతోంది. ఈ క్షణమైనా ఆయనకు ముప్పు తప్పేలా లేదు. అందుకే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పై జగన్ ఆధారపడుతున్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు వై వి సుబ్బారెడ్డి ఉన్న ఆశించిన స్థాయిలో తన ప్రభావం చూపడం లేదు. అయితే జాతీయస్థాయిలో మిధున్ రెడ్డి ఓకే. కానీ ఉత్తరాంధ్రలో విజయసాయి రెడ్డి స్థానంలో ఎవరు వస్తారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.