Monday, February 10, 2025

వైసీపీలో యాక్టివ్ తగ్గించిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి.. కారణమేంటి?

- Advertisement -

వైసీపీ యువనేతల్లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ది ప్రత్యేక స్థానం. మంచి ఇమేజ్ కలిగిన నేతగా ఆయన గుర్తింపు సాధించారు. సోషల్ మీడియాలో తనకంటూ ఒక గుర్తింపు పొందారు. జగన్మోహన్ రెడ్డి ఆయనను ఎంతగానో ప్రోత్సహించారు. చిన్న వయసులోనే నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలను అప్పగించారు. అత్యున్నత నామినేటెడ్ పదవిలో నియమించారు. అయితే వైసిపి అధికారంలో ఉన్నన్నాళ్లు సౌండ్ చేసిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి.. ఇప్పుడు సైలెంట్ కావడం హాట్ టాపిక్ అవుతుంది. ఆయన వేరే ఆలోచనతో ఉన్నారా అన్న ప్రచారం నడుస్తోంది. అయితే అటువంటిదేమీ లేదని ఆయన అనుచర వర్గం చెబుతోంది. చివరి వరకు జగన్మోహన్ రెడ్డి వెంట అడుగులు వేస్తారని.. మరో ఆలోచనకు తావు లేదని తేల్చి చెబుతోంది.

కర్నూలు జిల్లాలో బైరెడ్డి కుటుంబానికి ప్రత్యేక స్థానం. బైరెడ్డి శేష సైనా రెడ్డి తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు. కర్నూలు జిల్లాలో తన మార్కును చూపించారు. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఆయన హవా నడిచింది. నందమూరి తారక రామారావు హయాంలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. ఆ కుటుంబం నుంచి తర్వాత వారసుడిగా తెరపైకి వచ్చారు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. చంద్రబాబు హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు రాజశేఖర్ రెడ్డి. ఈయన స్వయాన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి పెదనాన్న. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆ కుటుంబం తెలుగుదేశం పార్టీకి దూరమైంది. వైసిపి ఆవిర్భావంతో ఆ పార్టీ వెంట అడుగులు వేసింది.

బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తో పార్టీ సిద్ధార్థ రెడ్డి వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో నందికొట్కూరు నియోజకవర్గ ఇన్చార్జిగా సిద్ధార్థ రెడ్డి నియమితులయ్యారు. అది ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం. కానీ సిద్ధార్థ రెడ్డి ఆమోదముద్రతో తోగూరు ఆర్ధర్ 2019 ఎన్నికల్లో గెలిచారు. ఆయన గెలుపు కోసం సిద్ధార్థ రెడ్డి కీలక పాత్ర పోషించారు. అటు తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం నందికొట్కూరు నియోజకవర్గంలో ఏకపక్ష విజయం వైసిపి సాధించడంలో సిద్ధార్థ రెడ్డి కీలక పాత్ర పోషించారు.

2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా సిద్ధార్థ రెడ్డి 2021 జూలై 17న నియమితులయ్యారు. అప్పటినుంచి నాలుగేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. ఒకానొక దశలో సిద్ధార్థ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరతారని ప్రచారం నడిచింది. కానీ తాను చివరి వరకు జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తానని సిద్ధార్థ రెడ్డి తేల్చి చెప్పారు. ఆయన స్యాప్ చైర్మన్గా నియమితులైన సమయంలో వయస్సు కేవలం 28 సంవత్సరాలు మాత్రమే. ఇంతవరకు ఆయనకు వివాహం కాలేదు. అయితే వైసిపి ఓడిపోయిన తర్వాత సిద్ధార్థ రెడ్డి చరిత్ర మసకబారింది. అంతవరకు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆయన చర్యలు తగ్గుముఖం పడ్డాయి. ప్రధానంగా ఆడుదాం ఆంధ్ర పథకంలో భారీ అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పటి క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజాతో పాటు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చుట్టూ ఆరోపణలు ఉన్నాయి. అందుకే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వైసీపీలో యాక్టివ్ తగ్గించారని టాక్ నడుస్తోంది. అయితే జగన్ జిల్లాల పర్యటనకు సిద్ధపడుతున్న నేపథ్యంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కర్నూలు జిల్లాలో యాక్టివ్ అవుతారని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!