Monday, February 10, 2025

చంద్రబాబును నమ్మి నాశనం అయిన టిడిపి సీనియర్ నేత.. పయనం ఎటు?

- Advertisement -

మాజీ మంత్రి బొండా ఉమామహేశ్వరరావు త్యాగానికి విలువ లేదా? ఆయనకు పదవి దక్కుతుందా లేదా? కనీసం ఆయన గురించి ఆలోచించేవారు టిడిపిలో ఉన్నారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. చంద్రబాబుతో పాటు లోకేష్ కు అత్యంత విధేయత దేవినేని ఉమామహేశ్వరరావు. గత ఐదేళ్లుగా పార్టీ కోసం పెద్ద యుద్ధమే చేశారు. ప్రత్యర్థులతో తలపడ్డారు. ఒకానొక దశలో పలనాడులో ప్రత్యర్థుల దాడికి కూడా గురయ్యారు. అటువంటి నేతకు ఇప్పుడు పార్టీలో కనీసంస్థానం లేదు. కనీసం గుర్తింపు లేదు. కనీసం చిన్నపాటి పదవి కూడా లేదు. పార్టీలో సర్దుబాటు కోసం ఆయనను పక్కన పెట్టారు. కానీ కనీసం ఉన్నాడన్న సంగతి మరిచిపోయారు. దీంతో ఆ సీనియర్ నేత బాధ వర్ణనాతీతం.

తెలుగుదేశం పార్టీకి అత్యంత విదేయనేత దేవినేని ఉమామహేశ్వరరావు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మైలవరం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతకుముందు రెండుసార్లు నందిగామ నుంచి పోటీ చేసి గెలిచారు. 2014లో నాలుగో సారి గెలిచేసరికి చంద్రబాబు ఆయన సేవలను గుర్తించారు. తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఏకంగా జలవనరుల శాఖను అప్పగించారు. ఐదేళ్లపాటు ఆ మంత్రి పదవిలో ఉంటూ తనకంటూ ఒక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. కానీ 2019 ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీ చేసిన దేవినేని ఉమామహేశ్వరరావు పై వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వసంత కృష్ణ ప్రసాద్ గెలిచారు. గత ఐదేళ్లుగా మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్ కు వ్యతిరేకంగా గట్టిగానే పోరాటం చేశారు దేవినేని ఉమామహేశ్వరరావు. పార్టీ క్యాడర్ను కాపాడుకోగలిగారు. అయితే ఎన్నికలకు ముందు చివరి నిమిషంలో వసంత కృష్ణ ప్రసాద్ టిడిపిలోకి ఫిరాయించారు. అప్పటివరకు టిడిపిలో కీలక నేతగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావు నాయకత్వం బలహీనంగా చూసే ప్రయత్నం చేశారు చంద్రబాబు. ఆయనను ఒప్పించి మైలవరం టికెట్ వసంత కృష్ణ ప్రసాద్ కు ఇప్పించారు. నీ భవిష్యత్తుకు నాది భరోసా అంటూ దేవినేని ఉమామహేశ్వరరావుకు సముదాయించారు. ఈ ఎన్నికల్లో వసంత కృష్ణ ప్రసాద్ గెలుపు కోసం దేవినేని ఉమామహేశ్వర రావు చిత్తశుద్ధితో కృషి చేశారు. కానీ ఆ చిత్తశుద్ధికి తగ్గ ఫలితం దేవినేని ఉమామహేశ్వరరావుకు దక్కలేదు.

కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు 8 నెలలు సమీపిస్తోంది. కానీ ఇంతవరకు దేవినేని ఉమామహేశ్వరరావుకు పదవి దక్కలేదు. రెండుసార్లు నామినేటెడ్ పోస్టులు ప్రకటించారు. మరో రెండు సార్లు ఎమ్మెల్సీ పదవులను భర్తీ చేశారు. మరొకసారి రాజ్యసభ పదవుల నియామకాలను చేపట్టారు. కానీ ఎంతవరకు దేవినేని ఉమామహేశ్వరరావు పేరు ప్రకటనకు నోచుకోలేదు. దీంతో ఆ సీనియర్ నేత చాలా మనస్థాపం చెందుతున్నారు. వైసీపీ నుంచి వచ్చిన నాయకుల కోసం తనను పక్కన పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఉమా. 2014 నుంచి 2019 మధ్య మంత్రిగా తన బాధ్యతలను చిత్తశుద్ధితో పూర్తి చేశారు. 2019 నుంచి 2024 వరకు ప్రతిపక్ష నేతగా దూకుడుగా వ్యవహరించారు. పార్టీ గీచిన గీతను ఎన్నడూ దాటలేదు. పైగా చంద్రబాబు తో పాటు లోకేష్ అస్మదీయనేతగా గుర్తింపు పొందారు. అయితే ఆ గుర్తింపునకు తగ్గట్టు మాత్రం పదవులేవి లభించలేదు దేవినేని ఉమామహేశ్వరరావుకు.

కృష్ణాజిల్లా అంటే ముందుగా గుర్తొచ్చేది దేవినేని ఉమామహేశ్వరరావు. ఒక్కమాటలో చెప్పాలంటే చంద్రబాబుతో పాటు లోకేష్ కు అత్యంత విధేయుడు. ఇదే కారణాన్ని చూపుతూ కొడాలి నాని లాంటి నేతలు పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. దేవినేని ఉమామహేశ్వరరావు ఉండగా తాము ఎదగలేమని భావించిన నేతలు కూడా ఉన్నారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది. కానీ కృష్ణాజిల్లాలో కీలక నేతగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావు ను పరిగణలోకి తీసుకోకపోవడం పై ఆయన అనుచరులు తెగ బాధపడుతున్నారు. తాము ఎంతో ఆశించామని.. కానీ తమ నేతకు ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదని బాధపడుతున్నారు. ఇకనైనా చంద్రబాబుతో పాటు లోకేష్ గుర్తించాలని కోరుతున్నారు. గుర్తించకపోతే మాత్రం తీవ్ర నిర్ణయాలు దిశ గా అడుగులు వేస్తామని హెచ్చరిస్తున్నారు. మున్ముందు ఈ పరిణామాలు తీస్తాయో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!