Monday, February 10, 2025

టిడిపిలో సీనియర్లకు చెక్.. లోకేష్ టీం కి ప్రాధాన్యం!

- Advertisement -

[1:53 pm, 20/1/2025] Ajaygoud: టిడిపిలో కొత్త వారికి పెత్తనం వెళ్ళిపోయిందా? పాత తరం శకం ముగిసినట్టేనా? వారు చెల్లని కాసులుగా మిగిలిపోవాల్సిందేనా? అంటే నిజమే అనిపిస్తోంది. ఒకప్పుడు చంద్రబాబు టీం అంటూ ఒకటి ఉండేది. చంద్రబాబు చుట్టూ యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దేవినేని ఉమా, సీఎం రమేష్, సుజనా చౌదరి లాంటి నాయకులు ఎక్కువగా కనిపించేవారు. పార్టీతో పాటు ప్రభుత్వంలో నిర్ణయాత్మక శక్తిగా వారు ఉండేవారు. కానీ ఇప్పుడు వారి ప్లేస్ లో కొత్తవారు వచ్చారు. సానా సతీష్, కేశినేని చిన్ని, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్ వంటి నేతల మాటలు ఎక్కువగా చెల్లుబాటు అవుతున్నాయి. దీంతో టీడీపీలో పాత తరం నేతల హవా కు చెక్ పడిందని ప్రచారం నడుస్తోంది.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు యనమల రామకృష్ణుడు. ఒక విధంగా చెప్పాలంటే టిడిపి వ్యవస్థాపక సభ్యుడు కూడా. చంద్రబాబు చేతిలోకి పవర్ వచ్చిన నాటి నుంచి యనమల తన హవాను కొనసాగించగలిగారు. చంద్రబాబు పక్కన యనమల కచ్చితంగా ఉండాల్సిందే. అందుకే 2014లో యనమల ఎమ్మెల్సీగా ఉన్న మంత్రిని చేశారు. 2019లో పార్టీ ఓడిపోయిన యనమల సేవలను కొనసాగించారు. ఆయనకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. కానీ ఇప్పుడు దాదాపు పక్కన పడేసినట్టే. ఎంతలా అంటే పార్టీ అధినేతకి లేఖ రాసి పరిస్థితికి వచ్చింది అంటే అర్థం చేసుకోవచ్చు. ఇక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిస్థితి అలానే ఉంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నెల్లూరు జిల్లాలో ఆయన ఒక్కరే ఎదురీదారు. పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారు. కానీ ప్రస్తుతం ఆయనకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని తెలుస్తోంది.

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో లోకేష్ టీం హల్ చల్ చేస్తోంది. గత 20 సంవత్సరాలుగా లోకేష్ తో ట్రావెల్ చేసిన వారు టిడిపిలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు వారికే టాప్ ప్రయారిటీ దక్కుతోంది. ఎన్నికల్లో లోకేష్ టీమ్ గా పని చేశారు సానా సతీష్. ఆర్థిక వ్యవహారాలు కూడా చూసుకున్నారు. అందుకే ఇప్పుడు ఆయనకు ఎనలేని ప్రాధాన్యం దక్కుతోంది. మొన్నటికి మొన్న పెద్దలకు ఇవ్వాల్సిన రాజ్యసభ పదవిని సాన సతీష్ కు అప్పగించారు. అదంతా లోకేష్ చలువతోనేనని ప్రచారం నడుస్తోంది. అనగాని సత్యప్రసాద్ లాంటి నేతకు ప్రాధాన్యం ఇచ్చి.. ధూళిపాళ్ల నరేంద్ర వంటి వారికి ప్రియార్టీ తగ్గింది. గొట్టిపాటి రవికుమార్ కు సైతం ఎనలేని ప్రాధాన్యం దక్కుతోంది.

లోకేష్ కోసమే తమను పక్కన పెట్టారన్న అనుమానం, అవమానంతో సీనియర్లు గడుపుతున్నారు. యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ధూళిపాళ్ల నరేంద్ర, జ్యోతుల నెహ్రూ, గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు.. లాంటి నేతలు అంతా తమకు ప్రాధాన్యం తగ్గించేసారని తెగ బాధపడుతున్నారు. నిన్న గాక మొన్న వచ్చి.. తెర వెనుక రాజకీయాలు చేసిన వారికి ప్రయారిటీ ఇస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. మున్ముందు ఈ పరిస్థితులు ఎటు దారితీస్తాయో నన్న ఆందోళన మాత్రం టిడిపి శ్రేణుల్లో ఉంది.
[1:53 pm, 20/1/2025] Ajaygoud: జగన్ బాగానే చూసుకున్నారని అంటున్న గ్రంధి శ్రీనివాస్

మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కు పొమ్మన లేక పొగ పెట్టారా? ఆయన స్థానిక నేతల తీరుతోనే బయటకు వెళ్లిపోయారా? జగన్ చుట్టూ కోటరీ తోనే వైసీపీ నేతలు గుడ్ బై చెబుతున్నారా? గ్రంధి శ్రీనివాస్ చెబుతున్న మాటల్లో నిజం ఎంత? ఏపీ పొలిటికల్ సర్కిల్ ఇదే హాట్ టాపిక్. కొద్ది రోజుల కిందట వైసీపీకి గుడ్ బై చెప్పారు గ్రంధి శ్రీనివాస్. తాను పార్టీలో నుంచి ఎందుకు బయటకు వెళ్లి పోవాల్సి వచ్చిందో చెప్పుకొచ్చారు. వివిధ ఇంటర్వ్యూలో సైతం తన ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ విషయంలో తనకు ఎటువంటి తప్పులు లేవన్నారు. అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నప్పుడు జగన్కు థాంక్స్ చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కొందరు నేతల తీరుతోనే తన పార్టీకి గుడ్ బై చెప్పినట్లు చెప్పుకొచ్చారు.

వైసిపి ఆవిర్భావం నుంచి జగన్ వెంట నడిచిన నాయకుల్లో గ్రంధి శ్రీనివాస…https://youtu.be/0hsKSubJMTI?si=7SKPhQevIkQmNEYE

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!