మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కు పొమ్మన లేక పొగ పెట్టారా? ఆయన స్థానిక నేతల తీరుతోనే బయటకు వెళ్లిపోయారా? జగన్ చుట్టూ కోటరీ తోనే వైసీపీ నేతలు గుడ్ బై చెబుతున్నారా? గ్రంధి శ్రీనివాస్ చెబుతున్న మాటల్లో నిజం ఎంత? ఏపీ పొలిటికల్ సర్కిల్ ఇదే హాట్ టాపిక్. కొద్ది రోజుల కిందట వైసీపీకి గుడ్ బై చెప్పారు గ్రంధి శ్రీనివాస్. తాను పార్టీలో నుంచి ఎందుకు బయటకు వెళ్లి పోవాల్సి వచ్చిందో చెప్పుకొచ్చారు. వివిధ ఇంటర్వ్యూలో సైతం తన ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ విషయంలో తనకు ఎటువంటి తప్పులు లేవన్నారు. అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నప్పుడు జగన్కు థాంక్స్ చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కొందరు నేతల తీరుతోనే తన పార్టీకి గుడ్ బై చెప్పినట్లు చెప్పుకొచ్చారు.
వైసిపి ఆవిర్భావం నుంచి జగన్ వెంట నడిచిన నాయకుల్లో గ్రంధి శ్రీనివాస్ ఒకరు. 2014 ఎన్నికల్లో భీమవరం అసెంబ్లీ టికెట్ ఇచ్చారు జగన్. కానీ ఆ ఎన్నికల్లో గ్రంధి శ్రీనివాస్ ఓడిపోయారు. అయినా సరే 2019లో మరోసారి టికెట్ కేటాయించారు. పవన్ కళ్యాణ్ అక్కడ బరిలో ఉండడంతో గ్రంధి శ్రీనివాస్ కు ఎక్కడలేని ప్రోత్సాహం అందించారు జగన్. పవన్ కళ్యాణ్ పై గెలిస్తే మంత్రి పదవి ఇస్తానని కూడా ఆఫర్ చేశారు. రెట్టింపు ఉత్సాహంతో పని చేసిన గ్రంధి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ పై గెలిచారు. కానీ రకరకాల సమీకరణల నేపథ్యంలో గ్రంధి శ్రీనివాస్ కు జగన్ మంత్రి పదవి ఇవ్వలేకపోయారు. అయినా సరే పార్టీలోనే కొనసాగారు. ఈ ఎన్నికల్లో సైతం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ ఈసారి ఓడిపోయారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కొంత మౌనం పాటించారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నేతలతో సమీక్షించే క్రమంలో జగన్ గ్రంధి శ్రీనివాస్ ను పిలిచారు. పార్టీలో యాక్టివ్ కావాలని సూచించారు. అయితే తనకు వ్యక్తిగత పనులు ఉన్నాయని.. మే నుంచి తప్పకుండా యాక్టివ్ అవుతానని గ్రంధి శ్రీనివాస్ జగన్ కు విన్నవించారు. అయితే ఇక్కడే పశ్చిమగోదావరి జిల్లా నేతలు పొమ్మనలేక పొగ పెట్టినట్లు గ్రంధి శ్రీనివాస్ చెబుతున్నారు. జగన్ చుట్టూ ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి, వై వి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి లాంటి నేతలు జిల్లా నాయకుల మాటలు విని తనను పక్కన పెట్టారని.. అందుకే తాను పార్టీకి గుడ్ బై చెప్పానని.. జగన్ తన విషయంలో అసలు నిర్లక్ష్యం చేయలేదని.. ఎంతో గౌరవించేవారు అని గ్రంధి శ్రీనివాస్ చెబుతున్నారు.
ప్రధానంగా గ్రంధి శ్రీనివాస్ బయటకు వెళ్ళిపోవడానికి కారణం వైసీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు అని తెలుస్తోంది. ఆయన ఎక్కువగా గ్రంథ శ్రీనివాస్ కు హర్ట్ చేసినట్లు సమాచారం. ముదునూరి ప్రసాద్ రాజు నరసాపురం ఎమ్మెల్యేగా ఉండేవారు. ఆయన భీమవరం నియోజకవర్గంలో వేలు పెట్టారన్న ఆరోపణలు వినిపించాయి. ఆయనకు చెందిన బంధువులు అనుచరులు భీమవరం నియోజకవర్గంలో ఉన్నారు. వారంతా గ్రంధి శ్రీనివాస్ కు వ్యతిరేకంగా పనిచేసేవారట. నరసాపురంలో వైసీపీగా ఉండే వారు.. భీమవరానికి వచ్చేసరికి మాత్రం రాజకీయ ప్రత్యర్థులకు చేతులు కలిపే వారట. అదే వ్యక్తులను తన వెంట తీసుకొని ప్రసాద్ రాజు అసెంబ్లీ లాబీల్లో తిప్పేవారట. వీటన్నింటిని గమనించి గ్రంధి శ్రీనివాస్ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఎన్నికల ఫలితాల అనంతరం భీమవరం నియోజకవర్గంలో కనీస సమాచారం ఇవ్వకుండా… పార్టీ సమావేశాలు నిర్వహించడంతో గ్రంధి శ్రీనివాస్ పూర్తిగా మనస్థాపానికి గురయ్యారట. అందుకే పార్టీకి గుడ్ బై చెప్పానని గ్రంధి శ్రీనివాస్ చెబుతున్నారు. ఇందులో జగన్ పై ఎటువంటి కోపం లేదని కూడా గ్రంధి శ్రీనివాస్ చెబుతుండడం విశేషం.
https://youtu.be/vPiDow6cH1M?si=lACR0B734W1KZGMWhttps://youtu.be/vPiDow6cH1M?si=lACR0B734W1KZGMWప్రధానంగా గ్రంధి శ్రీనివాస్ బయటకు వెళ్ళిపోవడానికి కారణం వైసీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు అని తెలుస్తోంది. ఆయన ఎక్కువగా గ్రంథ శ్రీనివాస్ కు హర్ట్ చేసినట్లు సమాచారం. ముదునూరి ప్రసాద్ రాజు నరసాపురం ఎమ్మెల్యేగా ఉండేవారు. ఆయన భీమవరం నియోజకవర్గంలో వేలు పెట్టారన్న ఆరోపణలు వినిపించాయి. ఆయనకు చెందిన బంధువులు అనుచరులు భీమవరం నియోజకవర్గంలో ఉన్నారు. వారంతా గ్రంధి శ్రీనివాస్ కు వ్యతిరేకంగా పనిచేసేవారట. నరసాపురంలో వైసీపీగా ఉండే వారు.. భీమవరానికి వచ్చేసరికి మాత్రం రాజకీయ ప్రత్యర్థులకు చేతులు కలిపే వారట. అదే వ్యక్తులను తన వెంట తీసుకొని ప్రసాద్ రాజు అసెంబ్లీ లాబీల్లో తిప్పేవారట. వీటన్నింటిని గమనించి గ్రంధి శ్రీనివాస్ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఎన్నికల ఫలితాల అనంతరం భీమవరం నియోజకవర్గంలో కనీస సమాచారం ఇవ్వకుండా… పార్టీ సమావేశాలు నిర్వహించడంతో గ్రంధి శ్రీనివాస్ పూర్తిగా మనస్థాపానికి గురయ్యారట. అందుకే పార్టీకి గుడ్ బై చెప్పానని గ్రంధి శ్రీనివాస్ చెబుతున్నారు. ఇందులో జగన్ పై ఎటువంటి కోపం లేదని కూడా గ్రంధి శ్రీనివాస్ చెబుతుండడం విశేషం.