Monday, February 10, 2025

డేరింగ్ అండ్ డాషింగ్ బొత్స.. స్థితప్రజ్ఞత కలిగిన నేత ఆయనే!

- Advertisement -

అతి సామాన్య డిసిసిబి అధ్యక్షుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనతి కాలంలోనే ఎంపీ అయ్యారు. అక్కడకు కొద్ది రోజులకే ఎమ్మెల్యేగా కావడంతో పాటు ఈ రాష్ట్రానికి మంత్రి అయ్యారు. తన జిల్లాతో పాటు ఉత్తరాంధ్రనే శాసించడం ప్రారంభించారు. అనుకోని రీతిలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఒకవైపు మంత్రిగా ఉంటూనే పిసిసి బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించారు. ఒకానొక దశలో సీఎం పదవికి కూడా ఆయన పేరు వినిపించింది. ఇంతకీ ఎవరా నేత? ఏంటా కథ? అంటే ఈ స్టోరీ చూడాల్సిందే.

విజయనగరం జిల్లాలో రాజులు రాజ్యమేలుతున్న వేళ. అటువంటి సమయంలో గాజుల రేగ అనే ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు ఓ యువకుడు. కానీ ఆ యువకుడు మూడు దశాబ్దాల్లోనే రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతాడని ఎవరూ భావించలేదు. అది వన్ అండ్ ఓన్లీ బొత్స సత్యనారాయణ కే సాధ్యం అయింది. మూడు దశాబ్దాల రాజకీయ ప్రయాణంలో ఉత్తరాంధ్రలో తనకొంటూ ఓ పొలిటికల్ సామ్రాజ్యాన్ని స్థాపించారు. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల రాజకీయాలకు, ఉత్తరాంధ్ర పాలిటిక్స్ కు ఎంతో వ్యత్యాసం ఉంటుంది. మిగిలిన ప్రాంతాల్లో డబ్బుతో రాజకీయాలను శాసించవచ్చు కానీ.. ఉత్తరాంధ్రలో డబ్బు కంటే ఎన్నో ప్రాధాన్యత అంశాలు ఉన్నాయి. సామాజిక వర్గాలు, బంధువులు, స్నేహితులు.. ఇలా ఎన్నో అంశాలు ప్రభావం చూపుతాయి. కుల బలం లేకపోయినా సమర్థతతో ఈ ప్రాంతంలో రాజకీయం చేసేవారు చాలామంది ఉన్నారు.

తెలుగుదేశం పార్టీ దూకుడు మీద ఉన్న రోజులు అవి. కాంగ్రెస్ పార్టీ అంటే జనాలు ఆదరించని రోజులు అవి. కానీ ఆ సమయంలో విజయనగరం రాజకీయాల్లో చక్రం తిప్పిన ఒకే ఒక నేత పెనుమత్స సాంబశివరాజు. కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు ఆయన. అటువంటి నేత శిష్యరికంలో రాజకీయాల్లోకి వచ్చారు బొత్స సత్యనారాయణ. విజయనగరానికి సమీపంలోని గాజులరేగ కోపరేటివ్ సొసైటీ బ్యాంకుకు చైర్మన్ అయ్యారు. గురువు అడుగుజాడల్లో కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు.

1996లో తొలిసారిగా బొబ్బిలి పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి చవిచూశారు బొత్స సత్యనారాయణ. కానీ 1999 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనంలో సైతం ఎంపీగా గెలిచి తనకంటూ ముద్ర చాటుకున్నారు బస్సు సత్యనారాయణ. అక్కడ నుంచి వెనుదిరిగి చూడలేదు. 2004లో వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రలో కీలక భాగస్వామిగా మారారు. రాజశేఖర్ రెడ్డి కి ఇష్టుడైన నేతగా మారారు. ఆ ఎన్నికల్లో చీపురుపల్లి అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. గురువు పెనుమత్స సాంబశివరాజును పక్కనపెట్టి మరి మంత్రి అయ్యారు బొత్స. 2009లో రెండోసారి చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బొత్సకు తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు రాజశేఖరరెడ్డి. కానీ వైయస్సార్ అకాల మరణంతో కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కొనసాగారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగానే పోటీ చేసి డిపాజిట్లు దక్కించుకున్న ఏకైక నేత బొత్స కావడం విశేషం.

అయితే వైసిపి ఆవిర్భావం తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో విజయనగరం నుంచి వైసీపీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ఆ సమయంలోనే జగన్ బొత్స గొప్పతనాన్ని గుర్తించారు. 2018 పాదయాత్ర సమయంలో బొత్స కుటుంబాన్ని వైసీపీలోకి రప్పించి జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర బాధ్యతలను అప్పగించారు. తండ్రి రాజశేఖర్ రెడ్డి మాదిరిగానే జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని అభిమానించిన బొత్స కుటుంబం 2019 ఎన్నికల్లో విజయనగరం జిల్లాను స్వీప్ చేసింది. ఉత్తరాంధ్రలో వైసిపి బలాన్ని అమాంతం పెంచేసింది.

అయితే ఈ ఎన్నికల్లో వైసిపి ఓడిపోయింది. ఉత్తరాంధ్రలో పార్టీలో సీనియర్లు చుట్టుకొకరు పుట్టకొకరుగా మారిపోయారు. కొంతమంది పక్క పార్టీల్లో చేరారు. కానీ ఇటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డికి గొడుగుల పని చేశారు బొత్స కుటుంబ సభ్యులు. అటు జగన్ సైతం బొత్స కుటుంబానికి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ కు అవకాశం కల్పించారు. విశాఖ జిల్లాలోని భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలను బొత్స మేనల్లుడు మధ్య శ్రీనివాసరావుకు ఇచ్చారు జగన్. అయితే బొత్స ఈ స్థాయికు రావడానికి ఆయన స్థితప్రజ్ఞత కారణం. అంతకుమించి మొక్కవోని దీక్షతో.. నమ్ముకున్న పార్టీతో పాటు అధినేత నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయడం ఆయన ఎదుగుదలకు కారణం. ఒక్కమాటలో చెప్పాలంటే ఏపీ పొలిటికల్ సర్కిల్లో డేరింగ్ అండ్ డాషింగ్ కలిగిన నేతగా బొత్సకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!