Thursday, December 12, 2024

భారత్ కు డెత్ బౌలింగ్ టెన్షన్

- Advertisement -

భారత్ టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలుచుకుని 15 ఏళ్లు అయిపోయింది. మళ్లీ ఈ మెగా టోర్నీలో టీమిండియా విజయం సాధించలేక పోయింది.
దీంతో ఈ సారైనా ఆ కోరిక తీరుతుందేమోనని భారత అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే టోర్నీకి ముందే రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా లాంటి స్టార్ ఆటగాళ్లు గాయంతో దూరమవడం ఎదురు దెబ్బ గా చెప్పొచ్చు. దీనికి తోడు ఇటీవల జరిగిన ఆసియా కప్‌లో పరాజయం భారత్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ప్రస్తుతం టీమిండియా క ఎదుర్కొంటోన్న ప్రధాన సవాల్ డెత్ బౌలింగ్. బుమ్రా గాయంతో దూరమవడంతో అతడి స్థానాన్ని మహమ్మద్ షమీతో భర్తీ చేశారు. అయితే పొట్టి ఫార్మాట్‌లో ఈ ఏడాది షమీ ఒక్కటంటే ఒక్క టీ20లోనూ ఆడలేదు. స్టాండ్ బై ఆటగాడిగా ఉన్న దీపక్ చాహర్ కూడా గాయంతో దూరం కావడంతో షమీ తుదిజట్టులో ఉండటం ఖాయమైంది. ఆసియా కప్‌లో డెత్ ఓవర్లలో టీమిండియా బౌలర్లు దారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. కేవలం డెత్ ఓవర్లలో అధికంగా పరుగులు ఇవ్వడంతో గెలవాల్సిన మ్యాచ్‌లు కూడా టీమిండియా ఓడిపోయింది. భువనేశ్వర్ కుమార్ లాంటి అనుభవజ్ఞుడు కూడా అధికంగా పరుగులు సమర్పించాడు. యువ బౌలర్లు హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ లాంటి యువ పేసర్లు విఫలం కావడంతో భారత బౌలింగ్ దళం పేలవంగా మారింది. ఫలితంగా బుమ్రా లేని లోటు ప్రత్యక్షంగా కనిపిస్తోంది. డెత్ ఓవర్లలో స్థిరంగా యార్కర్లు సంధించే బౌలర్లు లేమి, హర్షల్ పటేల్ మిస్టరీ బౌలింగ్ విఫలం కావడం కారణంగా డెత్ ఓవర్లలో బౌలింగ్ ప్రధాన సమస్యగా మారింది. ప్రస్తుత టీ ట్వంటీ ఫార్మాట్ లో డెత్ ఓవర్లు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పైగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి జట్లలో లోయర్ ఆర్డర్ కూడా బలంగా ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ డెత్ బౌలింగ్ బలహీనతను అధిగమించడం పైనే భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయనడంలో ఎలాంటి డౌట్ లేదు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!