Thursday, December 12, 2024

జగన్ చేతికి ఐప్యాక్ సర్వే..

- Advertisement -

వెంటనే తాడేపల్లికి రండీ ఎమ్మెల్యేలకు జగన్ ఆదేశం..ఆ మంత్రులు ఎమ్మెల్యేలు అవుట్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. వెంటనే తాడేపల్లి సీఎం కార్యలయంకు రావాల్సిందిగా ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఆదేశాలు ఇచ్చినట్లుగా వార్తలు అందుతున్నాయి. ఇలా ఉన్నఫళంగా ఎమ్మెల్యేలను పిలవడం వెనుక పెద్ద కారణమే ఉందని సమాచరం అందుతుంది. ఇప్పటి వరకు ఎమ్మెల్యేల మీద ఐప్యాక్ చేసిన సర్వే రిపోర్టు జగన్ చేతికి చేరడంతోనే.. ఇలా పార్టీ ఎమ్మెల్యేందరిని కూడా తాడేపల్లికి రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ పార్టీ.. 2024లో జరిగే ఎన్నికల్లో కూడా తిరిగి విజయ దుందుభి మోగించాలని చూస్తుంది. 2019 ఎన్నికల్లో 151 సీట్లలో విజయం సాధించి ముఖ్యమంత్రి కూర్చిలో కూర్చున్న జగన్.. 2024 ఎన్నికల్లో కూడా సేమ్ సీన్ రీపిట్ చేయడానికి సిద్దం అవుతున్నట్లుగా కనిపిస్తుంది.

కాని సౌండ్ మాత్రం 2019 ఎన్నికలకంటే కాస్తా ఎక్కువుగా వినిపించాలని జగన్ భావిస్తున్నారు. దీనిలో భాగంగానే ఆయన 175 సీట్లగాను 175 సీట్లలలో విజయం సాధించాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. దీనిలో భాగంగానే పార్టీ ఎమ్మెల్యేలకు ఎప్పటికప్పుడు దిశ నిర్ధేశం చేస్తున్నారాయన. పని చేసే నాయకులకే టిక్కెట్లు ఇస్తానని తేల్చి చెప్పారు వైసీపీ అధినేత. ప్రజాక్షేత్రంలో ఎవరైతే ముందుంటారో వారికే టిక్కెట్లని.. పని చేయని నేతలకు టిక్కెట్లు ఇచ్చేది లేదని కరాఖండిగా చెప్పినట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్షలు , సర్వేలు నిర్వహిస్తున్నారాయన. గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు.

దీనిలో భాగంగానే జగన్ ఐప్యాక్ సంస్థతో ఎమ్మెల్యేలపై సర్వే కూడా నిర్వహిస్తున్నారు. తాజాగా ఐప్యాక్ సంస్థ ఎమ్మెల్యేల పనితీరుపై ఓ రిపోర్టు సిద్దం చేసి ..దానిని జగన్‌కు అందించడం జరిగింది. గతంలో జరిగిన రెండు వర్క్‌షాప్‌లల్లో కొందరు ఎమ్మెల్యేలకు జగన్ డెడ్‌లైన్ విధించిన విషయం అందరికి తెలిసిందే. ఇందులో మంత్రులు కూడా ఉండటం విశేషం. వారి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన జగన్… ఆ ఎమ్మెల్యేలు, మంత్రులపై ప్రత్యేకంగా నిఘా కూడా పట్టినట్లుగా సమాచారం అందుతుంది. ఏ మాత్రం తేడా వచ్చిన టికెట్ల కేటాయింపుల్లో వారికి ప్రాధాన్యత ఉండబోదనే సంకేతాన్ని ఈ సమావేశంలో ఇస్తారని తెలుస్తోంది. డిసెంబర్ 4వ తేదీన జగన్ మరోసారి పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలు, కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు.. అందరు కూడా ఈ సమావేశంలో పాల్గొననునన్నారు. ఈ సమావేశంలో కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకోవడానికి జగన్ రెడీ అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అసంతృప్తి ఉన్న ఎమ్మెల్యేల స్థానంలో కొత్త వారికి టికెట్లు ఇవ్వడానికీ సంకోచించట్లేదని తెలుస్తోంది. ఈ సమావేశంలో చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రుల జాతకాలు బయటపడుతాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మరి భేటీలో ఎమ్మెల్యేలకు ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాల్సి ఉంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!