Monday, February 10, 2025

లక్షల మందితో భారీ బహిరంగ సభ.. జూనియర్ ఎన్టీఆర్ పక్కా పొలిటికల్ స్కెచ్

- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారా? తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభిమానులకు ప్రత్యేక పిలుపు ఇవ్వనున్నారా? త్వరలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారా? అధికారుల నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఈ సభ నిర్వహించనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల కోసం ప్రత్యేక ప్రకటన జారీ చేశారు. తనను ప్రత్యేకంగా కలిసేందుకు చాలామంది పాదయాత్రగా వస్తున్నారని.. అటువంటి పనులు మానుకోవాలని.. త్వరలో తాను మీ వద్దకు వస్తానంటూ ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. దీంతో ఇది రకరకాల చర్చకు దారితీస్తోంది. అదే సమయంలో అన్ని జిల్లాల్లో యాక్టివ్ గా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సభ ఎక్కడ జరిగిన సక్సెస్ చేసేందుకు వ్యూహాలు పన్నుతున్నారు.

జూనియర్ ఎన్టీఆర్కు విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉంది. తెలుగు అగ్ర కథానాయకులు ఆయన ఒకరు. పైగా పాన్ ఇండియా స్టార్ గా కూడా ఎదిగారు. తన మార్కెట్ ను సైతం పెంచుకున్నారు. అయితే దురదృష్టవశాత్తు మిగతా హీరోల సినిమాల మాదిరిగా ఈవెంట్ల విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో ఆయన సినిమా ఈవెంట్ల నిర్వహణకు భయపడుతున్నారు. ఏడు నెలల కిందట ఆయన నటించిన దేవర సినిమా విడుదలైంది. గాని ఆ సినిమాకు సంబంధించి ఈవెంట్లను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. దీంతో లక్షలాదిమంది అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. తాము అభిమానించే హీరోను చూసే అవకాశం వారికి లేకుండా పోయింది. అందుకే జూనియర్ ఎన్టీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయానికి వచ్చారు.

అయితే జూనియర్ ఎన్టీఆర్ సభ వెనుక పొలిటికల్ వ్యూహం ఉందా అన్న అనుమానాలు ఉన్నాయి. దాదాపు నందమూరి కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ను పక్కన పెట్టినట్టు కనిపిస్తోంది. కనీసం ఒక స్టార్ హీరో తన కుటుంబంలో ఉన్నారన్న విషయాన్ని వారు పట్టించుకోవడం లేదు. నందమూరి కుటుంబంలో జరుగుతున్న కార్యక్రమాలకు జూనియర్ ఎన్టీఆర్ హాజరు కావడం లేదు. వారు ఆహ్వానిస్తున్నారా? లేదా? అన్నది పక్కన పెడితే.. పిలిచినా రాలేని విభేదాలు వారి మధ్య ఉన్నాయి. ఒకవేళ పిలవకుంటే.. ఆ స్థాయిలో మనస్పర్ధలు కూడా ఉన్నాయి. మొన్నటికి మొన్న బాలకృష్ణకు పద్మ పురస్కారం వచ్చింది. గతంలో ఉన్న విభేదాలు మరిచి బాల బాబాయ్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు జూనియర్ ఎన్టీఆర్. కానీ బాలకృష్ణ నుంచి రిప్లై లేదు. సో జూనియర్ ఎన్టీఆర్ విషయంలో బాలకృష్ణ కఠినంగా ఉన్నారన్నమాట.

మొన్నటికి మొన్న నారా భువనేశ్వరి తన అన్న బాలకృష్ణకు పద్మ పురస్కారం రావడంపై ప్రత్యేకంగా ట్రీట్ ఇచ్చారు. కార్యక్రమానికి నందమూరి తో పాటు నారా కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. కానీ నందమూరి హరికృష్ణ కుటుంబ సభ్యులు ఎవరు పాల్గొనలేదు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కోసం అంతా ఆరా తీశారు. కానీ వారు ఎవరు కనిపించకపోవడంతో నందమూరి అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. అంతకుముందు బాలకృష్ణ పత్రికలకు భారీ స్థాయిలో యాడ్లు ఇచ్చారు. అందులో కూడా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లకు చోటు ఇవ్వలేదు. సో నందమూరి కుటుంబం తనను పూర్తిగా విడిచిపెట్టిందని జూనియర్ ఎన్టీఆర్ భావిస్తున్నారు. అందుకే తను సొంతంగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు.

ఇంకోవైపు తెలుగుదేశం పార్టీలో లోకేష్ ప్రాబల్యం పెరుగుతోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లేకుంటే పార్టీ చీఫ్ చేసే పరిస్థితి ఉంది. అదే జరిగితే పార్టీ మొత్తం లోకేష్ చేతిలోకి వెళ్ళక తప్పదు. అందుకే ఇటువంటి తరుణంలో తన మార్కు చూపించేందుకు లక్షలాది మందితో భారీ బహిరంగ సభకు జూనియర్ ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నారు. అందుకే అభిమానులకు ప్రత్యేకంగా పిలుపు ఇచ్చారు. త్వరలో బహిరంగ సభ ఉంటుందని బహిరంగ లేఖ రాశారు. జూనియర్ ఎన్టీఆర్ సభతో ఏపీలో రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!