Monday, February 10, 2025

ఏపీ సీఎం గా లోకేష్.. పవన్ గ్రీన్ సిగ్నల్!

- Advertisement -

ఏపీలో అధికారం చేంజ్ కాబోతుందా? సీఎం పదవి వేరొకరు తీసుకోనున్నారా? కొత్తగా ప్రారంభమైన ఈ ప్రచారంలో నిజం ఎంత? అసలు అది సాధ్యమేనా? పొలిటికల్ సర్కిల్లో ఇదో చర్చ నడుస్తోంది. ఏపీలో కూటమి జర్నీకి ఏడు నెలలు పూర్తవుతుంది. గత ఏడాది జూన్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మూడు పార్టీల ఉమ్మడి ప్రభుత్వం పాలన ప్రారంభించింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్, మరో 23 మంది మంత్రులు కొలువుదీరారు. అయితే ఆరు నెలల పాటు సవ్యంగా సాగిన కూటమి ప్రయాణంలో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ రాష్ట్రానికి లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. అయితే దీనిపై జనసేన నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. టిడిపి నుంచి కూడా అదే స్థాయిలో రిప్లై వచ్చాయి. అయితే ఈ తరుణంలో రెండు పార్టీలు అప్రమత్తమయ్యాయి. ఇంతటితో ఈ ప్రకటనలు వద్దంటూ పార్టీ శ్రేణులకు ఇరు నాయకత్వాలు ఆదేశాలు ఇచ్చాయి. దీంతో అంతా గుప్ చప్ నడుస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే మరో ఆసక్తికర వార్త ప్రారంభం అయింది. అదే సీఎం పదవి మార్పు.

వాస్తవానికి డిప్యూటీ సీఎం గా లోకేష్ ను జనసైనికులు అంగీకరించలేదు. లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని టిడిపి శ్రేణులు కోరుకున్నట్టే.. పవన్ సీఎం కావాలని తాము కోరుకున్నట్టు జనసేన నేతలు బహిరంగ ప్రకటనలు చేశారు. అయితే ఇప్పుడు తాజా అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. అదే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అతి కొద్ది నెలల్లో నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేస్తారని ఒక వార్త హల్చల్ చేస్తోంది. ఇందుకు సంబంధించి గ్రౌండ్ వర్క్ కూడా పూర్తయినట్లు ప్రచారం నడుస్తోంది. తెలుగుదేశం పార్టీని తెర వెనుక ఉండి నడిపించిన వారంతా ఈ నిర్ణయానికి వచ్చేసారని.. లోకేష్ ప్రమాణస్వీకారం చేయడమే తరువాయి అని టాక్ అయితే ప్రారంభం అయ్యింది. అయితే రాజకీయ విశ్లేషణలు చేసే చాలామంది సీనియర్ జర్నలిస్టులు సైతం తమ వద్ద సమాచారం ఉందని చెబుతున్నారు. అయితే అందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. తెలుగుదేశం పార్టీకి అత్యంత సన్నిహితులైన నేతలు మాత్రం చంద్రబాబుకు ఇదే సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో రాహుల్ గాంధీ, కేటీఆర్ మాదిరిగా లోకేష్ కెరీర్ ఉండకుండా ఉండాలంటే తక్షణం ఆయనను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలని సన్నిహితులు, జాతీయస్థాయిలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా మెలిగే నేతలు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది.

అయితే లోకేష్ సీఎం అనగానే జనసేన నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చాయి. అటువంటిది లోకేష్ కు సీఎం పదవి అంటే జనసేన ఊరుకుంటుందా? జన సైనికులు ఊరుకుంటారా? అంటే మాత్రం సమాధానం దొరకదు. కానీ ఇక్కడే ఒక్క ట్విస్ట్. ఈ రాష్ట్రానికి లోకేష్ ముఖ్యమంత్రిగా సాక్షాత్ పవన్ కళ్యాణ్ సైతం ఓకే చెప్పినట్లు ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారని.. అతి కొద్ది నెలల్లో లోకేష్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఖాయం అన్న ప్రచారం పెద్ద ఎత్తున నడుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ కన్వెన్స్ చేయగలిగారని.. ఆయనకు భవిష్యత్తు భరోసా కల్పించారని.. అందుకు పవన్ కళ్యాణ్ సంతృప్తి చెందారని ఒక టాక్ నడుస్తోంది. అయితే లోకేష్ ను సీఎం చేయాలన్న ప్రణాళిక ఇప్పటిది కాదని.. అది నాగబాబును క్యాబినెట్ లోకి తీసుకుంటామన్న ప్రకటన తోనే వ్యూహం ప్రారంభం అయిందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

తెలుగుదేశం పార్టీ ఏదైనా అంశాన్ని తెరపైకి తెచ్చింది అంటే దాని వెనుక లోతైన వ్యూహం ఉంటుంది. ముందుగా ప్రజల్లోకి ఒక ప్రచారాన్ని పంపిస్తారు. దానిని సానుకూలంగా మారుస్తారు. లోకేష్ విషయంలో కూడా అలానే చేశారు. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. ఒకానొక దశలో ముఖ్యమంత్రి పదవికి అర్హుడు అంటూ చెప్పుకొచ్చారు. ప్రజల్లో చర్చకు వచ్చేలా చేశారు. అయితే పవన్ ఒప్పుకోవడం గ్రేట్. కానీ దీనిని కొందరు విశ్లేషకులు కొట్టి పారేస్తున్నారు. ఈ రాష్ట్రానికి మరోసారి జగన్ సీఎం కాకూడదన్నది పవన్ స్థిర అభిప్రాయం. అందుకే ఎన్నికల్లో తక్కువ స్థానాలకు సైతం ఒప్పుకున్నారు. పరిమిత మంత్రి పదవులను మాత్రమే తీసుకున్నారు. రాజ్యసభ పదవుల్లో కూడా రాజీ పడుతున్నారు. అయితే ఇలా జనసేన వెనక్కి తగ్గే క్రమంలో ప్రతిసారి ఆ పార్టీ శ్రేణులను కన్విన్స్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు కూడా పవన్ సీఎంగా లోకేష్ కు ఓకే చెప్పారని.. కానీ జన సైనికులకు కన్వెన్స్ చేసేందుకే ఈ ప్రచారాన్ని తెరపైకి తెచ్చారన్న అనుమానాలు ఉన్నాయి. మొత్తానికి అయితే మరీ కొద్ది నెలల్లో నారా లోకేష్ అను నేను.. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నాను.. అంటూ జరగడం ఖాయమని తెలుస్తోంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!