Monday, February 10, 2025

చంద్రబాబు అండ్ కోను దెబ్బతీసిన వ్యూహం.. ఎల్లో మీడియా కొత్త ప్రచారం!

- Advertisement -

ఒకే ఒక్క అబద్ధం చంద్రబాబు సర్కార్ను ముంచేసింది. ఒకే ఒక్క వ్యూహం ప్రపంచ దేశాల్లో ఏపీని బదనాం చేసింది. ఒకే ఒక్క ప్రచారం అంచనాలను తారుమారు చేసింది.. ఇంతకీ ఏంటి ఆ కథ అంటే.. దావోస్ లో మన ఏపీ సర్కార్ పనితీరు. ప్రపంచ పెట్టుబడుల సదస్సు దావోస్ లో జరిగిన సంగతి తెలిసిందే. ప్రపంచ నలుమూలల నుంచి దిగ్గజ పారిశ్రామికవేత్తలు ఆ సదస్సుకు వస్తారు. ఆ సదస్సులో ప్రతి దేశం నుంచి ప్రతినిధులు హాజరవుతారు. తమ దేశంలో, తమ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణాన్ని పారిశ్రామికవేత్తలకు తెలియజేప్పుతారు ప్రతినిధులు. వారిని ఒప్పించి మెప్పించి ఒప్పందాలు చేసుకుంటారు. ఇప్పటివరకు జరిగింది ఇదే. అయితే ఎంతో హంగు ఆర్భాటంతో దావోస్ లో అడుగు పెట్టింది చంద్రబాబు బృందం. కానీ కనీసం బోనీ కొట్టలేకపోయింది. ఒక్క పరిశ్రమ నుంచి కూడా ఒప్పందాలు చేసుకోలేకపోయింది. రిక్త హస్తంతో తిరిగి ఏపీకి చేరుకుంది. దానినే గొప్పగా ప్రచారం చేసుకుంటోంది ఎల్లో మీడియా. మున్ముందు 30 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి వస్తాయని.. కేవలం బ్రాండ్ ప్రచారానికి తాము వెళ్ళామని ప్రభుత్వం చెబుతోంది.

అయితే దావోస్లో పెట్టుబడులు రాకపోవడానికి ఒకే రకమైన ప్రచారం కారణం. ఏపీలో గత ఐదు సంవత్సరాలు విధ్వంసం జరిగిందని.. పరిశ్రమలను వెళ్ళగొట్టారని.. పారిశ్రామికవేత్తలను భయపెట్టారని.. కమిషన్లు దండుకున్నారని.. లేనిపోని ప్రచారం చేశారు. అదే ప్రచారానికి ప్రాచుర్యం కల్పించారు. కేవలం వైసీపీ తో పాటు జగన్ పై కర్కాసం నింపేందుకే ఈ తరహా ప్రచారానికి దిగారు. అయితే అదే ప్రచారం ప్రపంచ దిగ్గజ పారిశ్రామిక వర్గాలకు చేరింది. అందుకే చంద్రబాబు దేహి అన్న పారిశ్రామికవేత్తలు కనికరించలేదు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాలేదు. తమ వ్యూహం తమకే దెబ్బతీసిందని గ్రహించిన కూటమి ప్రభుత్వం.. ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీ.. ఇప్పుడు బ్రాండ్ ప్రచారానికి వెళ్ళామంటూ కొత్త పల్లవి అందుకుంది.

గత ఐదేళ్లలో పరిశ్రమలు ఏపీ నుంచి వెళ్లిపోయాయా. వెళ్ళింది అమర్ రాజా కంపెనీ. ఆ కంపెనీ టిడిపి నేత గల్లా జయప్రకాష్ కు చెందినది. రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు గాను.. కాలుష్య నియంత్రణ మండలి కొన్ని రకాల చర్యలకు దిగింది. పరిశ్రమల్లో కాలుష్య నియంత్రణకు పెద్దపీట వేయాలని ప్రభుత్వం కోరింది. అదే విషయాన్ని నోటీసుల రూపంలో పరిశ్రమలకు అందించింది. అయితే తమ పరిశ్రమ ప్రయోజనాలు కంటే టిడిపి ప్రయోజనాలను ఆశించిన అమర్ రాజా.. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తమ ఉత్పత్తులను ఉపసంహరించుకుంది. కంపెనీపై ఆధారపడిన కార్మికులకు అన్యాయం చేస్తూ.. తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలకు పెద్దపీఠ వేసింది. అయితే దాని పైనే ఎల్లో మీడియా పతాక శీర్షిక కథనాలు రాసింది. అటు విపక్షాలు ప్రచార అస్త్రంగా మార్చుకున్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీకి దారుణంగా దెబ్బతీసాయి.

చంద్రబాబు బృందం దావోస్ వెళ్లి ఖాళీగా తిరిగి వచ్చింది. దానికి బ్రాండ్ ప్రచారం కోసమే అంటూ కొత్త పల్లవి అందుకుంది ఎల్లో మీడియా. చంద్రబాబు మాదిరిగానే జగన్ దావోస్ వెళ్లి పెట్టుబడులు తేకుండా తెస్తే.. జగన్ ను చూసేందుకు పారిశ్రామికవేత్తలు సైతం ముఖం చాటేసారంటూ పతాక శీర్షిక కథనాలు రాసేది ఎల్లో మీడియా. కానీ ఇప్పుడు చంద్రబాబు 30 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగారని.. ఎంవోయులది ఏముంది.. త్వరలో పెట్టుబడులు వచ్చేస్తున్నాయి కదా.. బ్రాండ్ ప్రచారం మొదలైంది కదా అని కొత్త పల్లవి అందుకుంది. అయితే తమ వ్యూహం తమకే దెబ్బతీయడంతో కూటమి సర్కారులో మాత్రం ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ప్రజల్లో నెగిటివ్ ప్రచారం ఉందని తెలుసుకొని కవరింగ్ చేసుకునే పనిలో పడింది కూటమి సర్కార్.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!