విజయసాయి రెడ్డికి జగన్ ఫోన్ చేశారా? అందులో నిజం ఉందా? ఒకవేళ ఫోన్ చేస్తే ఏం మాట్లాడారు? ఎలా సముదాయించారు? అసలు ఫోనే చేయలేదా? ఆయనతో మాట్లాడడం వేస్ట్ అని భావించారా? ఇలా రకరకాల ప్రచారం నడుస్తోంది సోషల్ మీడియాలో. వైసిపి తో పాటు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి. ఇకనుంచి రాజకీయాల్లో ఉండాలని తేల్చి చెప్పారు. వ్యవసాయం చేసుకుంటానని కూడా చెప్పుకొచ్చారు. జగన్కు చెప్పి రాజీనామా చేసినట్లు వివరించారు. అయితే విజయసాయిరెడ్డి చెప్పిన దాంట్లో వాస్తవం ఏంటి? అసలు జగన్ తో చర్చించి నిర్ణయం తీసుకున్నారా? లేకుంటే జగనే ఆయనను బయటకు వదిలేసారా? ఇప్పుడు అంతటా ఇదే చర్చ నడుస్తోంది. కేవలం తనకు ఇబ్బందులు అన్న మాట తప్పించి.. విజయసాయి రెడ్డి సైతం తన రాజీనామా విషయంలో జరిగింది ఏంటి అనేది పూర్తిగా స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఎవరికి వారు తోచిన విధంగా మాట్లాడుకుంటున్నారు.
అయితే వైసిపి వర్గాల నుంచి వినిపిస్తున్న మాట ప్రకారం జగన్ విజయసాయి రెడ్డికి ఫోన్ చేయలేదని ప్రచారం నడుస్తోంది. ఒక ఆడిటర్ గా ఉన్న వ్యక్తికి ఈ స్థాయికి తెస్తే.. కనీసం చెప్పా పెట్టకుండా రాజీనామా చేయడం ఏంటని జగన్ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈరోజు ప్రధాని మోదీ తో పాటు హోం మంత్రి అమిత్ షా తో సన్నిహితంగా గడిపేలా స్థాయి కల్పిస్తే.. పార్టీని కష్టాల్లో పెట్టి వెళ్లిపోతారా అని జగన్ రుస రుస లాడినట్లు సమాచారం. విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తుల కోసం తన కుటుంబ సభ్యులనే వదులుకున్నానని.. పార్టీలో నెంబర్ 2 స్థానాన్ని కల్పించానని… పార్టీలో ఉంటూ పదవులు అనుభవిస్తూ.. చాలా డబ్బులు వెనుకేసుకొచ్చినా ఊరుకున్నానని.. పార్టీ శ్రేణుల నుంచి ఆయనపై ఫిర్యాదులు వచ్చిన లైట్ తీసుకుంటే విజయసాయిరెడ్డి ఇంత పని చేస్తారా అంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇంకోవైపు విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసినట్లు కూడా ఒక విధమైన ప్రచారం నడుస్తోంది. అయితే తాను పార్టీలో ఉండలేనని.. ఈ ప్రెషర్ తట్టుకోలేకపోతున్నానని జగన్కు విజయసాయిరెడ్డి చెప్పినట్లు సమాచారం. అయితే తనతో పాటు పార్టీ మీకు అండగా ఉంటుందని.. ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని జగన్ సూచించినట్లు తెలుస్తోంది. అయితే మునుపటిలా పరిస్థితి లేదని.. నా మూలంగా కుటుంబం ఇబ్బందుల్లో పడుతోందని.. అసలు కాకినాడ పోర్టు బదలాయింపు వ్యవహారంలో తన ప్రమేయం లేదని విజయసాయిరెడ్డి జగన్ కు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. తన మూలంగా తన కుటుంబం ఇబ్బంది పడుతోందని.. తన అల్లుడి పరిశ్రమలు ఇబ్బందుల్లో పడుతున్నాయని.. ఏమాత్రం తేడా కొట్టిన వేలాదిమంది బతుకులు పోతాయని విజయసాయిరెడ్డి జగన్ కు వివరించినట్లు సమాచారం. పైగా కొత్త కేసులు తెరపైకి తెస్తున్నారని.. కేంద్ర పెద్దలతో మాట్లాడదామంటే ఏపీలోని కూటమి ప్రభుత్వం పట్టు బిగుస్తోందని.. అందుకే క్షమించండి తాను తప్పుకుంటానని జగన్తో విజయసాయిరెడ్డి అన్నట్లు తెలుస్తోంది.
అయితే తాను ఎందుకు రాజీనామా చేసింది విజయసాయిరెడ్డి స్పష్టంగా చెప్పుకొచ్చారు. కానీ అందులో స్పష్టత కరువవుతోంది. నేరుగా ఏది చెప్పకుండా.. ఇక చాలు వ్యవసాయం చేసుకుంటానని మాత్రమే ఆయన చెబుతున్నారు. అదే సమయంలో వైసీపీ నుంచి కూడా ఎటువంటి ప్రకటన రావడం లేదు. కనీసం ఎవరు స్పందించడం లేదు కూడా. అధినేత జగన్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. ఆయన నోరు విప్పితే కానీ దీనిపై స్పష్టత రాదు. అసలేం జరిగిందో ఆయన బయటకు వ్యక్తం చేస్తే కానీ అసలు విషయం తెలియదు.