Monday, February 10, 2025

జగన్ పై ఇప్పటికీ ఆ విషప్రచారమే.. ఎల్లో మీడియాకు అదే పని!

- Advertisement -

జగన్.. జగన్.. జగన్… రాష్ట్రంలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా.. మాజీ సీఎం జగన్ పేరు లేనిదే వారికి పూట గడవని పరిస్థితి. అధికారంలో ఉన్న అదే వైఖరి.. వైసిపి విపక్షంలోకి వచ్చిన అదే వైఖరి. వారికున్న ఏకైక లక్ష్యం జగన్ ను భారీ డ్యామేజ్ చేయడం. జగన్ ను ఈ రాష్ట్ర రాజకీయాలనుంచి దూరం చేయడం. రాష్ట్రాన్ని మరో శ్రీలంక లా మార్చేశాడు.. రాష్ట్రం 20 ఏళ్ల పాటు వెనక్కి వెళ్ళిపోయింది. కనీసం అభివృద్ధి అన్న జాడలేదు. అప్పుల్లో ముంచేశాడు. భవిష్యత్తును అంధకారం చేశాడు.. ఇలా ఆడి పోసుకోవడమే ఆ సెక్షన్ ఆఫ్ మీడియా లక్ష్యం. తెలుగుదేశం పార్టీ ఆ మీడియాను పెంచి పోషిస్తుంది. జగన్ కు వ్యతిరేకంగా విష ప్రచారం చేయిస్తోంది. అయితే గత ఐదేళ్లలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అదే మాదిరిగా ప్రచారం చేశారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆ విష ప్రచారం కొనసాగిస్తున్నారు.

తాజాగా నీతి ఆయోగ్ నివేదిక అంటూ పతాకస్థాయిలో కథనాలు రాసుకోచ్చారు. అందులో కూడా తిమ్మిని బమ్మిని చేశారు… బమ్మిని తిమ్మిని చేసి చూపించారు. వైసీపీ హయాంలో సంపద సృష్టి లేకుండా పోయిందని.. ఆర్థిక లోటు కొనసాగిందని.. ఆదాయం పూర్తిగా పడిపోయిందని ప్రచారం చేస్తున్నారు. అయితే ఈనాడులో వచ్చిన కథనాన్ని పరిశీలిస్తే అందులో ఎంత కల్పితాన్ని జోడించారు అర్థమవుతోంది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అలా వచ్చిన ఏడాదిలోనే రాష్ట్ర ఆదాయం 64% గా చూపించారు. అదే ఆదాయం 2023-24 కి వచ్చేసరికి 67% గా చూపించారు. అంటే ఆదాయం పెరిగినట్టే కదా? అయితే ఇక్కడే రాష్ట్రం సొంతంగా ఆదాయం వచ్చేసరికి గణాంకాలు తగ్గించి చూపించారు. సొంత ఆదాయానికి చేరుకోలేదని ప్రచారం చేస్తున్నారు. కానీ 2019, 2020, 2021 వరుసగా కరోనా విపత్తు. అయినా సరే ఆదాయాన్ని పెంచగలిగారంటే దానిని ఏమనాలి. అంతటి విపత్తులో కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఆదాయం సమకూర్చుకోవడం అంత సామాన్యం కాదు. పైగా మూలధన వ్యయం పైనే ఆదాయం పొందగలిగారు. కీలకమైన ప్రభుత్వానికి ఆదాయం వచ్చే పోర్టులు, జెట్టీల నిర్మాణం చేపట్టారు. మెడికల్ కాలేజీలు ప్రారంభించారు. కానీ ఎల్లో మీడియాకు అవి అభివృద్ధి పనులు అన్నట్టు ఉంది పరిస్థితి. వాటిపై ప్రభుత్వానికి ఆదాయం సమకూరినా.. అది సంపద సృష్టి కాదని భావించింది ఎల్లో మీడియా.

కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభం అయింది. అయితే కేవలం ఎన్నికల హామీలు అమలు చేయకపోవడం వల్లే ఆ పరిస్థితి వచ్చింది. ఇంకా వైసీపీ ప్రజల్లోకి వెళ్ళలేదు. ప్రజా పోరాటాలు ప్రారంభించలేదు. అయినా సరే వ్యతిరేకత ఆరంభమయ్యింది. అది పతాక స్థాయికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు దావోస్ పర్యటన తుస్సు మంది. ఒక్క కంపెనీతో కూడా ఒప్పందం చేసుకోలేకపోయింది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు అండ్ కో ఉత్త చేతులతో రావడంతో ముప్పేట విమర్శలు ప్రారంభమయ్యాయి. అనేక రకాలుగా ఆరోపణలు చుట్టుముట్టాయి. ఈ తరుణంలో ప్రజలను డైవర్ట్ చేసేందుకు నీతి ఆయోగ్ అంటూ ఎల్లో మీడియా ప్రచారం మొదలుపెట్టింది. తమకు అలవాటైన విద్యను ప్రజల ముందు పెట్టింది. లేనిపోని ప్రచారం చేస్తోంది. ఇప్పటికీ వైసీపీ ప్రభుత్వం కొనసాగుతోందన్న భ్రమలోనే ఉంది.

ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఒక బృందం దావోస్ వెళ్ళింది. ఈనెల 20న ప్రత్యేక విమానంలో వెళ్ళింది ఈ బృందం. అక్కడ దిగ్గజ పారిశ్రామికవేత్తలతో సమావేశం అయినట్లు ఎల్లో మీడియా ప్రచారం చేసింది. పతాక శీర్షికన కథనాలు వండి వార్చింది. కనీ విని ఎరుగని రీతిలో భారీగా పెట్టుబడులు వచ్చేస్తున్నాయి అంటూ చెప్పుకొచ్చింది. దిగ్గజ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబుతో పాటు లోకేష్ సమావేశమైన ఫోటోలను ప్రముఖంగా ప్రచురించింది. అవునా నిజమా అని ప్రజలు చర్చించుకునేలా చేసింది ఎల్లో మీడియా. కానీ చంద్రబాబు అండ్ కో ఖాళీ చేతులతో రావడంతో మైండ్ బ్లాక్ అయింది. అందుకే ఈ కొత్త కథలు అల్లుతూ.. ఏవేవో విష ప్రచారాన్ని మొదలుపెట్టింది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!