విజయసాయి రెడ్డి వెనుక ఎవరున్నారు? ఆయన రాజీనామాతో ఎవరికి లాభం? కూటమికి లాభమా? లేకుంటే ప్రత్యేకంగా ఒక పార్టీకా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన తర్వాత చాలా విషయాలను చెప్పుకొచ్చారు. కానీ తన రాజీనామా విషయంలో పూర్తి స్పష్టత ఇవ్వలేకపోయారు. కానీ తనకు ఎన్నాళ్లు అవకాశం కల్పించిన జగన్, భారతి దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. అదే సమయంలో తనకు అన్ని విధాలుగా అండగా నిలిచారని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా కు సైతం కృతజ్ఞతలు తెలిపారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ తన చిరకాల మిత్రుడిగా అభివర్ణించారు. చంద్రబాబు కుటుంబంతో తనకు వ్యక్తిగత విభేదాలు లేవని చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడే అనేక అంశాలు సింక్ అవుతున్నాయి. తన రాజీనామా వెనుక బిజెపి ఉందని కొంతవరకు స్పష్టత ఇవ్వగలిగారు. బిజెపికి పవన్ చిరకాల మిత్రుడిగా ఉండాలనుకుంటున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీతో బిజెపికి ఇప్పటిలో విభేదాలు వచ్చే అవకాశం లేదు. సో విజయసాయిరెడ్డి కామెంట్స్ అలా సింక్ అవుతున్నాయి.
ఏపీలో బిజెపి బలపడాలన్నది కేంద్ర పెద్దల ప్రత్యేక వ్యూహం. అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి నష్టం జరగకూడదు. జనసేనకు సైతం ఇబ్బంది రాకూడదు. కూటమి ధర్మం ముందుకు సాగాలి. అది జరగాలంటే వైసిపి నిర్వీర్యం కావాలి. తెలుగుదేశం పార్టీకి కావాల్సింది అదే. జనసేన సైతం అదే కోరుకుంటుంది. బిజెపి బలపడాలని భావిస్తోంది. ఇన్ని ఈక్వేషన్స్ నడుమ వైసీపీని దెబ్బతీయడం ఎలా అంటే.. జగన్ ఆర్థిక మూలాలపై పడాలి. జగన్ పాత కేసులను తిరగదొడాలి. అయితే అది ఎలా? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? అని బిజెపి పెద్దలు ఆలోచించేసరికి విజయసాయిరెడ్డి తారసపడ్డారు. ఆయన ద్వారా బిజెపి పెద్దలు పొలిటికల్ స్కెచ్ ప్రారంభించినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వైసీపీలో జగన్తో విజయసాయి రెడ్డికి గ్యాప్ ఉంటుంది. కచ్చితంగా లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఎక్కడో ఒకచోట తేడా కొడుతుంది. విజయసాయిరెడ్డి విషయంలో అదే జరిగింది. ఎప్పుడో వైసీపీ ఆవిర్భావానికి ముందు నుంచి జగన్ వెంట చేతులు కట్టుకొని ఉండేవారు విజయసాయిరెడ్డి. ఆయన కష్టంలోనూ సుఖంలోనూ వెంట నడిచారు. చివరకు జైలుకు కూడా వెళ్లారు. వైసీపీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించారు. అయితే అంత కృషిచేసిన విజయసాయిరెడ్డి కంటే వై వి సుబ్బారెడ్డి కి ప్రాధాన్యంతకుతోంది. గెలుపు తర్వాత పార్టీలో ప్రవేశించిన సజ్జలకు ఎనలేని గౌరవం ఇస్తోంది జగన్ కుటుంబం. మరోవైపు బంధువైన వైవి సుబ్బారెడ్డిని చేరదీస్తోంది. కొత్తగా వచ్చిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అన్ని బాధ్యతలు అప్పగిస్తోంది. తన విషయంలో మాత్రం ప్రాధాన్యం తగ్గుతోంది. అందుకే తనను తాను తగ్గించుకోలేని విజయసాయిరెడ్డి.. వేరే పార్టీలో చేరలేక.. చేసేదేమీ లేక వ్యవసాయం అని పేరు చెప్పి పార్టీకి గుడ్ బై చెప్పారు.
రాజకీయాలనుంచి నిష్క్రమించిన చాలామంది నేతలు మళ్లీ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. తమ నాయకుడు మళ్ళీ రాజకీయాల్లోకి రావాలని అభిమానులు డిమాండ్ చేస్తారు. కార్యకర్తలు నిరసన తెలుపుతారు. అవసరమైతే పెట్రోల్ పోసుకొని దహనానికి కూడా సిద్ధపడతారు. ఓ ఫైన్ మార్నింగ్ విజయసాయిరెడ్డి విషయంలో కూడా ఇది తప్పకుండా జరిగే పరిస్థితి ఉంది. అది జరిగిన నాడు విజయసాయిరెడ్డి ఖాయం. అది కూడా తాను ఇష్టపడే.. తనను ఇష్టపడే బిజెపిలోకి వెళ్లడం ఖాయంగా తెలుస్తోంది. బహుశా దీనిని దృష్టిలో పెట్టుకొని ఆయన పవన్ కళ్యాణ్ చిరకాల మిత్రుడు అన్నారు. చంద్రబాబు కుటుంబంతో విభేదాలు లేవని చెప్పుకొచ్చారు.