కోటంరెడ్డి శ్రీధర్‌పై జగన్ ఆగ్రహం… క్రమశిక్షణ చర్యలకు సిద్దం..?
అధికార పార్టీలో అసమ్మతి ఎక్కువైందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు ప్రభుత్వనికి వ్యతిరేకంగా మాట్లాతుండటం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు అటు ప్రభుత్వనికి ఇటు పార్టీకి కూడా చాలా ఇబ్బందికి మారాయి. దీంతో పార్టీ అధినేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా సమాచారం అందుతుంది. వెంటనే తనని కలవాలని జగన్ ఆదేశాలు కూడా జారీ చేసినట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..జగన్ అనుచరులలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఒకరు అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. వైఎస్ఆర్ అనుచరుడుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. వైఎస్ఆర్ మరణం తరువాత జగన్ వెంట నడిచారాయన. జగన్ వైసీపీ స్థాపించిన నాటి నుంచి కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన వెంటే నడిచారు.
2014 , 2019 వరుస ఎన్నికల్లో విజయం సాధించారాయాన. మంత్రివర్గ పున:వ్యవస్థీకరణలో తనకు మంత్రి పదవి వస్తుందని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చాలానే ఆశలు పెట్టుకున్నారు. కాని సామాజిక సమీకరణాల్లో భాగంగా మంత్రి పదవిని కాకాణికి దక్కింది. దీంతో మంత్రి పదవిని ఆశించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి తీవ్ర నిరాశే ఎదురైంది. ఆ సమయంలో ఆయన కన్నీటి పర్యాంతం కూడా అయ్యారు. అయినప్పటికి కూడా జగన్ అడుగుజాడల్లోనే నడుస్తానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మొదటి స్థానంలో కూడా నిలిచారు. ఈ విషయంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఎమ్మెల్యేలందరి ముందు జగన్ ప్రశంసలు కూడా కురిపించారు.
కాని తాజాగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వంపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పెన్షన్లు కొత్త కొస్తే గడపగడపకు ఎలా వెళ్తామని నిలదీశారు. జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలోనూ ఆయన తనదైన శైలిలో అధికార యంత్రాంగంపై మండిపడ్డారు. వారి వైఖరిని తప్పుపట్టారు. ఇప్పుడాయన ఓ అడుగు ముందుకేశారు. ఏకంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్ పై విమర్శలు గుప్పించారు. నిధులను సకాలంలో మంజూరు చేయట్లేదంటూ ఆరోపించారు. తన నియోజకవర్గం పరిధిలో రోడ్ల మరమ్మతు, ఇతర అభివృద్ధి పనులు స్తంభించిపోవడానికి ఆయనే కారణమంటూ ధ్వజమెత్తారు. అయితే ఈ విషయం జగన్ వద్దకు వెళ్లడంతో.. ఆయన ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా సమాచారం అందుతుంది. వెంటనే తనని కలవాలని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కబురుపెట్టారు. దీనిలో భాగంగానే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ రోజు తాడేపల్లిలో జగన్‌తో భేటీకి సిద్దం అవుతున్నారు. మరి వీరిద్దరు భేటీలో ఎలాంటి విషయాలు చర్చకు వస్తాయో చూడాలి.