Monday, February 10, 2025

జూనియర్ ఎన్టీఆర్ పై కొనసాగుతున్న బాలకృష్ణ కోపం.. నందమూరి కుటుంబం నుంచి వెలి

- Advertisement -

నందమూరి కుటుంబంలో జూనియర్ ఎన్టీఆర్ కు మరోసారి ఘోర అవమానం జరిగింది. గత కొద్దిరోజులుగా నందమూరి కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ పై వివక్ష చూపుతున్న సంగతి తెలిసిందే. పేరుకే హరికృష్ణ కుమారుడు కానీ చాలా విషయాల్లో తారక్ పై వివక్ష కొనసాగుతూనే ఉంది. ఆ కుటుంబం వెలివేసినంతగా పరిస్థితి మారింది. దీనిపై ఎన్టీఆర్ ఎంతో బాధపడుతూ ఉన్నారు. ప్రధానంగా నారా లోకేష్ రాజకీయ ఉన్నతికి అడ్డంగా నిలుస్తారని జూనియర్ ఎన్టీఆర్ను పక్కన పెట్టినట్లు ఒక ప్రచారం ఉంది. అందుకు తగ్గట్టుగానే నందమూరి కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ విషయంలో వ్యవహరిస్తోంది. తాజాగా బాలకృష్ణకు పద్మ అవార్డు రావడంతో భారీ ఎడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. కానీ అందులో జూనియర్ ఎన్టీఆర్ కు కానీ.. కళ్యాణ్ రామ్ కు కానీ చోటు దక్కకపోవడం విశేషం.

గత కొద్ది రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ తో నందమూరి బాలకృష్ణకు గ్యాప్ ఉంది. ఇది స్పష్టంగా తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా విభేదాల పర్వం నడుస్తోంది. నందమూరి హీరోలంతా ఒకే వేదికపై రావడం చాలా రోజులు అయింది. చివరిసారిగా బాలకృష్ణ నటించిన కథానాయకుడు చిత్ర ఈవెంట్లో బాబాయ్ తో కనిపించారు అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్. అటు తరువాత ఇప్పటివరకు అసలు కనిపించిన దాఖలాలు లేవు. కనీసం వారి మధ్య పలకరింతలు కూడా లేనట్లు తెలుస్తోంది. తారకరత్న మరణం సమయంలో.. పెద్దకర్మకు హాజరైన క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ ఎదురుపడిన పలకరించనంతగా బాలకృష్ణ వారితో గ్యాప్ మెయింటెనెన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఆది నుంచి జూనియర్ ఎన్టీఆర్ విషయంలో బాలకృష్ణ ఒక రకమైన గ్యాప్ అమలు చేస్తూ ఉన్నారు. హరికృష్ణ అకాల మరణంతో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ కు అండగా ఉంటానని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. హరికృష్ణ మరణించిన తొలి రోజుల్లో అలానే చేశారు. కానీ క్రమేపి జూనియర్ ఎన్టీఆర్ తో గ్యాప్ పెంచుకుంటూ వచ్చారు బాలకృష్ణ. అయితే దీనికి అనేక రకాలుగా కారణాలు ఉన్నాయి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు, నారా భువనేశ్వరి పై వైసీపీ అనుచిత వ్యాఖ్యలు సమయంలో జూనియర్ ఎన్టీఆర్ పొడిగా మాట్లాడారు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించలేదన్న అనుమానం నందమూరి కుటుంబంలో ఉండిపోయింది.

ఇంకోవైపు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు సైతం జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ గైర్ హాజరయ్యారు. కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం హాజరైన.. తారక్ తో పాటు కళ్యాణ్ రామ్ ముఖం చాటేశారు. తమకు ముందస్తు షూటింగ్ షెడ్యూల్ ఖరారు అయిందని.. విదేశీ పర్యటనలో ఉన్నామని చెబుతూ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. చంద్రబాబు అరెస్టు సమయంలో కూడా తారక్ నుంచి స్పందన లేదు. నందమూరి కుటుంబమంతా ఏకతాటి పైకి వచ్చి చంద్రబాబు అరెస్టును ఖండించింది. ఒకానొక దశలో నందమూరి రామకృష్ణ కన్నీటి పర్యంతం అయ్యారు. కానీ కనీస స్థాయిలో కూడా జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు. అప్పట్లో తారక్ స్పందించక పోవడాన్ని బాలకృష్ణ వద్ద విలేకరులు ప్రస్తావిస్తే ఐ డోంట్ కేర్ అంటూ కామెంట్ చేశారు బాలయ్య బాబు. అప్పటినుంచి జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ పక్కన పెట్టాలని భావించారు. అదే పరంపర కొనసాగిస్తున్నారు.

తాజాగా పద్మభూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు నందమూరి బాలకృష్ణ. యావత్తు తెలుగు చిత్ర పరిశ్రమ పులకించుకుపోయింది. ఈ తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. బాలా బాబాయ్ కి శుభాకాంక్షలు అంటూ పాత మాటలను తెరపైకి తెచ్చి శుభాకాంక్షలు తెలిపారు. తనలో ఉన్న ఆప్యాయతను బయటపెట్టారు. అయితే ఇది బాలకృష్ణ మనసు చలించేలా చేయలేదు. దీనికి ఆయన ప్రచురించిన ఒక యాడ్ నిదర్శనం. బాలకృష్ణకు పద్మ అవార్డు వచ్చిన నేపథ్యంలో ఫుల్ పేజీ ప్రకటన వేశారు. అందులో నందమూరి, నారా కుటుంబ సభ్యులు అంటూ ఎన్టీఆర్ పిల్లలు, వారి పిల్లల పేర్లు చాలా వరకు వేశారు. కానీ ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ పేర్లు మాత్రం వేయలేదు. దీంతో బాలకృష్ణకు వారిపై కోపం తగ్గలేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పట్లో వారిద్దరికీ క్షమించే పరిస్థితి లేదని తెలుస్తోంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!