Thursday, December 12, 2024

వైఎస్ఆర్ మరణంపై షాకింగ్ కామెంట్స్ చేసిన కిరణ్ కుమార్ రెడ్డి.. అందుకే సీఎం అయ్యాను అంటూ..

- Advertisement -

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సంచలన విషయాలు వెలుగులోకి తీసుకువచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం గురించి ఆయన
షాకింగ్ కామెంట్స్ చేశారు. నేను బతికున్నా కాబట్టే సీఎం అయ్యాను’ అంటూ కిరణ్‌ కుమార్‌ రెడ్డి షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. అసలు ఆయన వైఎస్ఆర్ గురించి ఎందుకు కామెంట్స్ చేయాల్సి వచ్చిందో తెలియాలంటే ఈ మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ఱ అన్‌స్టాపబుల్‌ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. మొదటి సీజన్ ద్విగజయం పూర్తి చేసుకున్న ఈ షో.. ఇటీవలే రెండో సీజన్‌ను ప్రారంభించారు.

మొదటి సీజన్‌లో కేవలం సినిమా ఇండస్ట్రీకి చెందిన వారిని ఇంటర్య్వూ చేసిన యూనిట్.. రెండో సీజన్‌లో మాత్రం… సినీ నటులతో పాటు, రాజకీయ ప్రముఖులను కూడా ఆహ్వానిస్తు షోకు మరింత రేటింగ్‌ను తీసుకువచ్చేలా ప్లాన్ చేశారు. దీనిలో భాగంగానే మొదటి ఎపిసోడ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు, ఆయన తనయుడు నారా లోకేష్‌ను ఆహ్వానించారు. తరువాత ఎపిసోడ్‌కు తెలుగు సినిమా యంగ్ హీరోలను ఆహ్వానించగా..తాజాగా ఉమ్మడి ఏపీ సీఎం అయిన కిరణ్ కుమార్ రెడ్డితో పాటు మాజీ స్పీకర్ సురేష్ బాబు , ఒకప్పటి హీరోయిన్ రాధికను ఆహ్వానించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ మరణం గురించి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైఎస్ఆర్ తనకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు.

అయితే సీనియర్ మంత్రి ఒకరు వైఎస్ఆర్‌ను మిస్ లీడ్ చేశారని..ఆ సమయంలోనే ఆయన వాతవరణం బాలేకపోయినప్పటికి రచ్చబండ ప్రొగ్రామ్‌కు వెళ్లారని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. నేను బ్రతికి ఉన్నాను కాబట్టే సీఎం అయ్యానని.. వైఎస్ఆర్ చనిపోయారు కాబట్టే నేను సీఎం అయ్యాను అనే అర్థం వచ్చేలా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. అటు బాలకృష్ణ కూడా వైఎస్ఆర్ గొప్పతనం గురించి ఈ షోలో ప్రస్తావించారు. దీనికి సంబంధించిన ప్రొమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!