వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కొడాలి నాని ఆస్పత్రిలో చేరినట్లుగా సమాచారం అందుతుంది. గత మూడు రోజులుగా ఆయన ఆస్పత్రిలోనే ఉన్నట్లు సమాచారం అందుతుంది. అయితే ఆయన ఎందుకు ఆస్పత్రిలో చేరారో అనేది మాత్రం పూర్తి వివరాలు తెలియడం లేదు. గత వారం నుంచి హైదరాబాద్‌లోనే ఉంటున్నారట కొడాలి. అయితే సడన్‌గా ఆయన్ను హాస్పిటల్‌లో చేరడంతో…ఆయనకు ఏం జరిగిందో అని ఆయన అభిమానులతో పాటు, వైసీపీ శ్రేణులు కూడా భయపడుతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కొడాలి నానికి మెజర్ సర్జరీ ఒకటి జరిగిందని తెలుస్తుంది. గత కొంత కాలంగా ఆయన తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్నారని సమాచారం. దీనికి సంబంధించిన ఆపరేషన్ చేయించుకోవడానికే కొడాలి నాని హైదరబాద్ వచ్చారని ఆయన అనుచరులు తెలిపారు.
ఈ రోజే కిడ్నీ ఆపరేషన్ జరిగిందని… మూడు రోజుల తరువాత మరో మేజర్ సర్జరీ చేయనున్నారట. కొడాలి నాని ఆరోగ్యం బాగానే ఉందని.. ఆయన ఆరోగ్యంపై ఎవరు కూడా భయపడాల్సిన లేదని డాక్టర్లు తెలిపారు. సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితులలో కొడాలి నాని కూడా ఒకరు. కొడాలి నానికి ఆపరేషన్ చేశారని తెలుసుకున్న జగన్.. ఆయన ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారట. ఫ్లోన్‌లో కొడాలి నానిని పరామర్శించారట జగన్. కొడాలి నానికి అవసరమైన అన్ని మౌలిక సధుపాయాలను సమకూర్చాలని ఆస్పత్రి వర్గాలను జగన్ ఆదేసించిన్నట్లుగా తెలుస్తుంది. కొడాలికి అత్యంత స్నేహితులు అయిన వల్లభనేని వంశీ, వంగవీటి రాధా ఇద్దరు కూడా హైదరాబాద్ బయలుదేరినట్లుగా సమాచారం అందుతుంది.