టీడీపీ అధినేత చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బ పడుతునే ఉంది. గెలుపుపై ఆశలు వస్తున్న ప్రతిసారి ఏదో ఒక రూపంలో పార్టీకి తీవ్ర సంక్షోభంలో మునిగిపోతుంది. 2019 ఎన్నికలలో ఘెర ఓటమిని చవి చూసిన తరువాత కోలుకోవడానికి చాల సమయం పట్టింది. దాదాపు మూడేళ్లు ప్రజల ముందుకు రావడానికి చంద్రబాబు సంకోచించరంటే టీడీపీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నాయకులు ఒక్కొక్కరు టీడీపీని వీడుతున్నారు. ఇటీవలే గంజి చిరంజీవి టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన మంగళగిరిలో కీలక నేత కావడం.. అలాంటి వ్యక్తి పార్టీని వీడటం మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీకి పెద్ద దెబ్బ అని అంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా మరో నేత టీడీపీకి గుడ్ బై చెప్పాలని చూస్తున్నారని తెలుస్తుంది. టీడీపీ సీనియర్ నేత, తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ త్వరలో టీడీపీ నుంచి వైసీపీలోకి మారనున్నారా? అంటే…అవననే సమాధానం వస్తోంది.
ఇటీవల పరిణామాలు పొమ్మనకుండానే పార్టీ పెద్దలు పొగ పెడుతున్నట్టు సుగుణమ్మ అనుమానిస్తున్నారు. తిరుపతికి చెందిని టీడీపీ మహిళ నాయకురాలు సుగుణమ్మ .. ఆ పార్టీకి గుడ్ బై చెప్పడానికి రెడీ అవుతన్నట్లు తెలుస్తుంది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే… 2019 ఎన్నికల్లో తిరుపతి నుంచి టీడీపీ తరుఫున సుగుణమ్మ పోటీ చేశారు. వైసీపీ తరుఫున భూమన కరుణకర్ రెడ్డి పోటీ చేసి సుగుణమ్మపై విజయం సాధించారు. తిరుపతిలో వైసీపీ చాలబలంగా ఉంది. భూమన కరుణకర్ రెడ్డి ఢీకొట్టాలంటే సుగుణమ్మ సరిపోరని భావిస్తున్నారట చంద్రబాబు. తిరుపతిలో మరో అభ్యర్థిని రంగంలోకి దించాలని చూస్తున్నారని తెలుస్తుంది. మరోవైపు సుగుణమ్మ ప్లేస్‌ను భర్తీ చేసేందుకు టీడీపీ నేతలు కసరత్తు చేస్తున్నారు. తిరుపతిలో టీడీపీ అభ్యర్థి ఎంపిక బాధ్యతను చంద్రగిరి ఇన్‌చార్జ్ పులివర్తి నానీకి ఇచ్చినట్టు సమాచారం దీనిలో భాగంగానే జేబీ శ్రీనివాస్ అనే పారిశ్రామిక వేత్తను తిరుపతి బరిలోకి దింపాలని ప్రయత్నిస్తుంది.
ఇప్పటికే జేబీ శ్రీనివాస్‌తో పార్టీ నేతలు వెళ్లి చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. టికెట్ ఇస్తే ఎంత డబ్బైనా ఖర్చు పెడతానని నల్లారితో జేబీ అన్నట్టు సమాచారం. వైసీపీని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం తనకు ఉన్నాయని జేబీ అన్నట్టు తెలిసింది. జేబీ శ్రీనివాస్‌తో పాటు మున్సిపల్ మాజీ చైర్మన్ వెంకటముని శెట్టి కుమారుడు పురందర్, అలాగే బీజేపీ నాయకుడు ఆకుల సతీష్‌తో పులివర్తి నాని పేర్లను కూడా టీడీపీ పార్టీ పరిశీలిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.
జేబీతో నల్లారి మంతనాలు జరిపారని తెలిసి సుగుణమ్మ గుర్రుగా ఉన్నారని సమాచారం. గౌరవం, నమ్మకం లేని చోట ఉండడం కంటే, ప్రత్యామ్నాయం చూసుకోవడమే బెటర్ అనే ఆలోచనలో వున్నారు. తనని పక్కన పెడుతున్నారని సమాచారం అందుతున్న సుగుణమ్మ పార్టీ మీద తన అసంతృప్తిని వ్యక్తం చేశారట. పార్టీకి కష్టకాలంలో తోడుగా ఉంటే.. ఇలా చేస్తారా అంటూ టీడీపీ అధినాయకత్వన్ని ప్రశ్నాస్తున్నారట. పరిస్థితి ఇలానే ఉంటే.. ఆమె టీడీపీని వీడటం ఖాయం అని అంటున్నారు. ఇటు సుగుణమ్మ కూడా రాజకీయంగా నిర్ణయం తీసుకోవడానికి రెడీ అవుతున్నారని సమాచారం అందుతుంది. మరి సుగుణమ్మ టీడీపీలో కొనసాగుతరో లేదో చూడాల్సి ఉంది.