Monday, February 10, 2025

లోకేష్ పదోన్నతి పై టిడిపి సీనియర్ నేత అభ్యంతరం.. హాట్ కామెంట్స్!

- Advertisement -

టిడిపి నాయకత్వం పై ఆ సీనియర్ ఆగ్రహంగా ఉన్నారా? రిటైర్మెంట్ ఏజ్ లో కూడా ఆయన కోరిక నెరవేర్చడం లేదా? అందుకు యువనేత లోకేష్ కారణమని భావిస్తున్నారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ. గత కొంతకాలంగా ఓటమిలో ఒక వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ డిప్యూటీ సీఎం గా లోకేష్ కు పదోన్నతి కల్పించాలని టిడిపి నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే తాజాగా దీనిపై ఓ టిడిపి సీనియర్ భిన్నంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉండగా ఇటువంటి డిమాండ్ చేయడం సరికాదని తేల్చి చెప్పారు. ఇంతకీ ఆ నేత ఎవరంటే టిడిపి సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. నర్మగర్భంగా మాట్లాడుతారని ఆయనకు పేరు ఉంది. ఇప్పుడు లోకేష్ డిప్యూటీ సీఎం పదవి విషయంలో ఆయన అలానే మాట్లాడారు. దీంతో ఇది వైరల్ అంశంగా మారింది.

ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరిది ప్రత్యేక స్థానం. 1983 నుంచి వరుస ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధిస్తూ వచ్చారు. కానీ ఆయనకు మంత్రి పదవి అనేది కలగానే మారిపోయింది. 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనాన్ని కూడా తట్టుకొని మరి ఆయన ఎమ్మెల్యే గారి గెలిచారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేసిన ఆయన 50 వేలకు పైగానే మెజారిటీతో విజయం సాధించారు. దీంతో బుచ్చయ్య చౌదరికి ఈసారి క్యాబినెట్లో చోటు దక్కుతుందని అంతా భావించారు. కానీ అనుకున్నది జరగలేదు. పార్టీలో నమ్మకమైన నేతగా పేరున్న బుచ్చయ్య చౌదరిని ఈసారి కూడా పక్కన పెట్టారు. ఇవే తన చివరి ఎన్నికలు అంటూ ఆయన పదేపదే చెప్పుకున్న చంద్రబాబు మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. దీంతో బుచ్చయ్య చౌదరి నొచ్చుకున్నారు. తన పని తాను చేసుకుంటున్నారు.

అయితే గతంలో లోకేష్ నాయకత్వం విషయంలో భిన్నమైన కామెంట్స్ చేశారు బుచ్చయ్య చౌదరి. ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొచ్చింది ఈ సీనియర్ నేత. తెలుగుదేశం పార్టీ బలపడాలంటే జూనియర్ ఎన్టీఆర్ను కలుపు కెల్లాలి అన్నది బుచ్చయ్య చౌదరి నుంచి వినిపించిన మాట. వైసిపి హయాంలో టిడిపి కష్టకాలంలో ఉన్నప్పుడు బుచ్చయ్య చౌదరి ఇదే డిమాండ్ చేశారు. తప్పకుండా జూనియర్ ఎన్టీఆర్ను కలుపుకెళ్లాలని పార్టీ అధినేత చంద్రబాబును డిమాండ్ చేశారు. అప్పట్లో పెను ప్రకంపనలకు కారణమయ్యింది ఈ డిమాండ్. అయితే సామాజిక వర్గం నేతలు సముదాయించడంతో అప్పట్లో వెనక్కి తగ్గారు బుచ్చయ్య చౌదరి. అప్పటినుంచి ఈ సీనియర్ నేతపై లోకేష్ ఆగ్రహంగా ఉన్నారు.

అయితే తనకు మంత్రి పదవి రాకుండా లోకేష్ అడ్డుకున్నారని సీనియర్ నేత బుచ్చయ్య చౌదరిలో ఒక రకమైన ఆగ్రహం ఉంది. చంద్రబాబు విషయంలో సాఫ్ట్ కార్నర్ తో ఉంటే చౌదరి.. లోకేష్ విషయంలో మాత్రం కాస్త కఠినంగానే వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇటీవల లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈ విషయంలో సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి తాజాగా స్పందించారు. అది తప్పుడు విధానం అంటూ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ఏకైక డిప్యూటీ సీఎం గా ఉండగా.. లోకేష్ కు ఆ పదవి ఇవ్వాలనడం సరికాదని తేల్చి చెప్పారు. అయితే దీనిపై విమర్శలు వస్తాయని తెలిసి లోకేష్ పై మరో రకంగా ప్రశంసలు కురిపించారు. మొత్తానికైతే లోకేష్ విషయంలో పార్టీలోనే సీనియర్ వ్యతిరేకించడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మరి దీనిపై లోకేష్ ఎలా స్పందిస్తారో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!