Wednesday, February 12, 2025

టిడిపిలోకి జగన్ సన్నిహిత నేత ఆదిమూలపు సురేష్!

- Advertisement -

 

జగన్ అత్యంత సన్నిహిత నేత వైసీపీని వీడనున్నారా? తెలుగుదేశం పార్టీలో చేరనున్నారా? సొంత సామాజిక వర్గం నేతల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంతకీ ఎవరు ఆ నేత? ఏంటా కథ? అంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆదిమూలపు సురేష్ ది ప్రత్యేక స్థానం. దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు ఆదిమూలపు సురేష్. 2009లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. వరుసగా రెండుసార్లు ఛాన్స్ ఇచ్చారు జగన్. వైసీపీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చి ప్రోత్సహించారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో మంత్రి పదవి ఇచ్చారు. విస్తరణలో సైతం కొనసాగించారు. దీనిని జీర్ణించుకోలేని సొంత మనుషులు బయటకు వెళ్లిపోయిన జగన్ లెక్క చేయలేదు. అది వన్ అండ్ ఓన్లీ ఆదిమూలం సురేష్ గురించి..

ఆదిమూలపు సురేష్ ఉన్నత ఉద్యోగి. మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి పిలుపుమేరకు రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. 2009లో ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగారు. ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. జగన్ వెంట అడుగులు వేశారు. 2014లో వైసీపీ అభ్యర్థిగా సంతనూతలపాడు నుంచి బరిలో దిగి విజయం సాధించారు. కానీ వైసీపీ ప్రతిపక్షానికి పరిమితం అయ్యింది. అయినా సరే వైసీపీలో కొనసాగి తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. ఐదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్న జగన్ ను అన్ని విధాల అండగా నిలుస్తూ వచ్చారు. స్వతహాగా విద్యాధీకుడు కావడంతో జగన్ కూడా అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు.

2019లో వైసీపీ తరఫున ఎర్రగొండపాలెం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు ఆదిమూలపు సురేష్. కేవలం జగన్ ఆదేశాల మేరకు ఆ నియోజకవర్గంలో నుంచి బరిలో దిగారు. భారీ మెజారిటీతో గెలిచారు. దీంతో జగన్ అనూహ్యంగా సురేష్ ను తన క్యాబినెట్ లోకి తీసుకున్నారు. కీలకమైన విద్యాశాఖ ను అప్పగించి అందర్నీ ఆశ్చర్యకితులు చేశారు. సురేష్ పై చాలా నమ్మకం ఉంచి కీలక బాధ్యతలు ఆయనపై పెట్టారు. ఒకానొక దశలో మంత్రివర్గ విస్తరణలో ఆదిమూలపు సురేష్ ను తప్పిస్తారని అంత ప్రచారం నడిచింది. 2019 ఎన్నికల్లో 25 మందిని క్యాబినెట్లోకి తీసుకున్నారు జగన్. 2017 ద్వితీయార్థంలో విస్తరణ చేపట్టారు. ఆ సమయంలో క్యాబినెట్లో సమూల మార్పులు తీసుకొచ్చారు. చాలా మార్పులు చేశారు. కీలక మంత్రులను మార్చారు. కానీ ఆదిమూలపు సురేష్ ని మాత్రం మార్చలేదు.

అదే ప్రకాశం జిల్లాలో జగన్ కు కుటుంబ విధేయుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకాశం జిల్లా నుంచి బాలినేని తో పాటు ఆదిమూలపు సురేష్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కానీ విస్తరణలో అనూహ్యంగా బాలినేనిని పక్కన పెట్టారు. ఇది ఎంత మాత్రం రుచించలేదు. బాలినేని తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. తనను మంత్రివర్గం నుంచి తీసివేయాలంటే ఆదిమూలపు సురేష్ ను సైతం పక్కన పెట్టాలని డిమాండ్ చేశారు. కానీ జగన్ పెడచెవిన పెట్టారు. ఆదిమూలపు సురేష్ ను కొనసాగించారు. చివరకు ఎన్నికల్లో ఆదిమూలపు సురేష్ ను కొండపి నుంచి బరిలో దించారు. అయినా ఆయనకు ఓటమి తప్పలేదు.

అయితే ఆదిమూలపు సురేష్ ను కొనసాగించి.. తనను మాత్రం తొలగించుటపై బాలినేని తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అందుకే ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ మారేందుకు సిద్ధపడ్డారు బాలినేని. అందుకు వన్ అండ్ ఓన్లీ కారణం ఆదిమూలపు సురేష్. నాడు ఆదిమూలపు సురేష్ తో పాటు బాలినేనిని కొనసాగించి ఉంటే.. ఆయన వైసీపీలోనే కొనసాగే వారు. కానీ ఎన్నికల ఫలితాల అనంతరం పరిణామాలతో బాలినేని జనసేన లో చేరారు. అయితే ఇప్పుడు అదే ఆదిమూలపు సురేష్ టిడిపిలో చేరేందుకు మంత్రాంగం నడుపుతున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీలో తన సామాజిక వర్గం నేతల ద్వారా ఈ ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధినాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అతి త్వరలో ఆదిమూలపు సురేష్ తెలుగుదేశం పార్టీలో చేరిక ఖాయం అయినట్లు తెలుస్తోంది. అయితే ఆదిమూలపు సురేష్ ను నమ్ముకుని తన దగ్గరివాడైన బాలినేనిని వదులుకున్నారు జగన్. ఇప్పుడు ఆయన దక్కక.. ఆదిమూలపు ఉండక.. జగన్ మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితి ఎదురైంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!