Monday, February 10, 2025

నెల్లూరులో కోటంరెడ్డి వర్సెస్ మంత్రి నారాయణ.. కూటమికి బీటలు

- Advertisement -

అక్కడ ఎమ్మెల్యే వర్సెస్ మంత్రి అన్నట్టు పరిస్థితి మారిందా? వేరే నియోజకవర్గంలో ఆ మంత్రి వేలు పెడుతున్నారా? దానికి ఆ ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారా? క్రమేపి అక్కడ విభేదాలు పెరుగుతున్నాయా? ఇంతకీ ఏదా జిల్లా? ఎవరా నాయకులు?.. ఏపీ రాజకీయాల్లో సింహపురి పాలిటిక్స్ వేరేగా ఉంటాయి. ఇక్కడ నెల్లూరు పెద్దారెడ్లు హవా నడుస్తుంటుంది. మాటతో పాటు గౌరవానికి వారు ప్రాధాన్యమిస్తారు. ఏమాత్రం గౌరవం తగ్గిన ఊరుకోరు. వైసీపీ ఆవిర్భావం నుంచి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చారు నెల్లూరు పెద్దారెడ్డిలు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవం తగ్గడంతో.. ఏకంగా పార్టీని మార్చేశారు. కూటమి వైపు మొగ్గు చూపారు. వైసీపీని దారుణంగా దెబ్బతీశారు. జిల్లాలో పదికి పది సీట్లలో కూటమి గెలవడంతో వీరి స్టామినా జగన్ కు తెలిసింది. అయితే ఇప్పుడు టిడిపి కూటమిలో సైతం అదే పరిస్థితి ప్రారంభం అయింది. అదే జరిగితే వచ్చే ఎన్నికల నాటికి సీన్ మారిపోనుంది.

ఈ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో స్వీప్ చేసింది టిడిపి కూటమి. నెల్లూరు సిటీ నుంచి గెలిచిన నారాయణ మంత్రి అయ్యారు. పురపాలక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అదే జిల్లాకు చెందిన మరో సీనియర్ ఆనం రామనారాయణరెడ్డి దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కానీ మంత్రి పదవి ఆశించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలకు మాత్రం చాన్స్ దక్కలేదు. అయితే అధినేత వేరే హామీ ఇవ్వడంతో వారు తమ పని తాము చేసుకుంటున్నారు. ఇద్దరు సీనియర్లకు మంత్రి పదవులు దక్కాయి. ఆ ఇద్దరి మధ్య సమన్వయం సాగుతోంది.

అయితే తాజాగా నెల్లూరు నగరపాలక సంస్థ విషయంలో సిటీ ఎమ్మెల్యే గా ఉన్న మంత్రి నారాయణ కు, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి మధ్య విభేదాలు ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో 54 డివిజన్లు ఉన్నాయి. అందులో సిటీ నియోజకవర్గంలో 28 డివిజన్లు ఉండగా.. రూరల్ నియోజకవర్గం లో మరో 26 డివిజన్లు కొనసాగుతున్నాయి. అయితే మంత్రిగా ఉన్నారు నారాయణ. ఆపై పురపాలక శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. కానీ అక్కడే తేడా కొట్టింది. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం వ్యవహారాలు తన కనుసన్నల్లో జరగాలని నారాయణ కోరుకోవడం కోటంరెడ్డికి మింగుడు పడడం లేదు.

ప్రధానంగా అధికారులు, ఉద్యోగుల బదిలీలు, పన్నుల వసూలు వంటి వాటి విషయంలో ఇద్దరి నేతల మధ్య విభేదాలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. తన 28 డివిజన్లలో ఏం చేసుకున్న పర్వాలేదు కానీ.. తన నియోజకవర్గ పరిధిలోని 26 డివిజన్ల విషయంలో ఎందుకు వేలు పెడుతున్నారు అన్నది కోటంరెడ్డి నుంచి వినిపిస్తున్న ప్రశ్న. అయితే నేను రాష్ట్ర మంత్రిని, ఆపై పురపాలక శాఖ మంత్రిని.. తన పెత్తనం వద్దంటే ఎలా అని నారాయణ ప్రశ్నిస్తున్నారు. దీంతో ఇద్దరి నేతల మధ్య వివాదం రోజురోజుకు పెరుగుతోంది. అయితే నేతలు కావాల్సిన వారే కావడంతో నాయకత్వం ఇంతవరకు కలుగజేసుకోలేదు.

నారాయణ సీనియర్ నాయకుడు. చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడు. దశాబ్దాలుగా పార్టీకి బ్యాక్ బోన్ గా వ్యవహరిస్తూ వచ్చారు. 2014 ఎన్నికల్లో క్రియాశీలకంగా పని చేశారు. పార్టీ అధికారంలోకి రావడానికి అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చారు. పైగా ఆర్థికంగా స్థితిమంతుడు కూడా. ఆపై అడ్మినిస్ట్రేటర్ గా పేరు తెచ్చుకున్నారు. అందుకే అమరావతి రాజధాని నిర్మాణ బాధ్యతలు చంద్రబాబు ఆయనకు అప్పగించారు. అయితే నెల్లూరు కార్పొరేషన్ విషయంలో చంద్రబాబు ఇప్పటికే సూచనలు చేశారని.. రూరల్ నియోజకవర్గంలో వేలు పెట్టకూడదని సూచించారని తెలుస్తోంది.

అదే సమయంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సైతం చంద్రబాబుకు అత్యంత సన్నిహిత నేతగా మారిపోయారు. 2014 నుంచి వరుసగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి గెలుపొందుతూ వస్తున్నారు కోటంరెడ్డి. రెండు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా, తాజా ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో గెలిచిన కోటంరెడ్డి అధినేత జగన్మోహన్ రెడ్డిని విభేదించారు. 16 నెలల పదవీకాలం ఉండగానే పార్టీపై అసమ్మతి జెండా ఎగురవేశారు. నెల్లూరు జిల్లాలో టిడిపి కూటమికి బలం పెరిగేలా వ్యవహరించారు. కేవలం వైసీపీలో గౌరవం దక్కలేదన్న ఒకే ఒక్క కారణంతో ఆయన టిడిపిలోకి వచ్చారు. ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీలో సహచర ఎమ్మెల్యే నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంత్రి నారాయణ వ్యవహార శైలితో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. చంద్రబాబు కలుగజేసుకోకపోతే మున్ముందు ఈ ఇద్దరి నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే కూటమికి దొరికిన

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!