Monday, February 10, 2025

విశాఖ కూటమిలో లుకలుకలు.. ‘స్టీల్’ క్రెడిట్ కోసం ఎవరికి వారే!

- Advertisement -

ఏపీలో మూడు పార్టీల కూటమి ప్రభుత్వం నడుస్తోంది. ఏడు నెలల పాలన సజావుగా పూర్తయింది. మూడు పార్టీల మధ్య సమన్వయం చక్కగా నే ఉంది. మధ్య మధ్యలో చిన్న అవాంతరాలు వస్తున్న.. ఎవరికి వారే సర్దుబాటు చేసుకుని ముందుకు సాగుతున్నారు. రాష్ట్రమంతటా ఎక్కడ అరమడికలు లేకుండా గడుపుతున్నారు. అయితే విశాఖ జిల్లాలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది పరిస్థితి. ముఖ్యంగా స్టీల్ సిటీలో మూడు పార్టీలు ఎవరికి వారే యమునాతిరి అన్నట్టు వ్యవహరిస్తున్నాయి. కూటమి ప్రభంజనంలో విశాఖ జిల్లాలో వైసిపి కొట్టుకుపోయింది. కేవలం మన్యప్రాంతమైన అరకు, పాడేరు కి పరిమితం అయ్యింది. దీంతో మూడు పార్టీల శ్రేణుల్లో ఒక రకమైన ఆనందం వెల్లి విరిసింది.

కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కూడా సమన్వయం సమగ్రంగా సాగేది విశాఖ జిల్లాలో. ఏదైనా సమస్యపై పోరాటం చేయాల్సి వచ్చిన.. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినా మూడు పార్టీలు ఒకే మాటతో ముందుకు సాగేవి . అవసరమైతే హై కమాండ్ పెద్దల సూచనలు, సలహాలు తీసుకునేవి. రుషికొండ భవనాలు, ఎర్రమట్టి దిబ్బలు, స్టీల్ ప్లాంట్, మత్స్యకార సమస్యలు, ఫార్మా పరిశ్రమల్లో ప్రమాదాలు, విశాఖ డైరీ వంటి అంశాలతో పాటు అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో సైతం ఒకే మాటగా ముందుకు సాగేవి కూటమి పార్టీలు. కానీ ఇటీవల కూటమిలో వాయిస్ తేడా కొడుతోంది. ఎవరికి వారే అన్నట్టు పరిస్థితి మారింది. ఎవరికి వారుగా ప్రెస్ మీట్ పెడుతున్నారు. కలిసి మీడియాతో మాట్లాడేందుకు ఇష్టపడడం లేదు. దీంతో విశాఖ కూటమిలో కలహాల కాపురం కొనసాగుతోందన్న కామెంట్స్ ప్రారంభమయ్యాయి. ప్రధానంగా విశాఖ స్టీల్ ఇష్యూ మూడు పార్టీల మధ్య అగాధాన్ని పెంచుతున్నట్లు అర్థమవుతోంది.

గత కొన్నేళ్లుగా విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ పై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రైవేటీకరణ నిలుపుదల చేసి ప్లాంటును పరిరక్షిస్తామని కూటమి నేతలు ఎన్ని కులం ముందు హామీలు ఇచ్చారు. పైగా మేనిఫెస్టోలో కూడా చేర్చారు. అయితే ఇటీవల కేంద్రం స్పెషల్ ప్యాకేజీని ప్రకటించింది. ప్లాంట్ కు చేయూతనిచ్చింది. ఈ ప్రకటన రాగానే కూటమి నేతల్లో ఒక రకమైన ఆనందం కనిపించింది. అయితే అప్పటివరకు ఐక్యంగా పనిచేసిన మూడు పార్టీలు ఎవరికి వారే సంబరాలు చేసుకున్నారు. కేంద్రమంత్రి కుమారస్వామి ప్రకటన చేయగానే టిడిపి నేతలు తమ పార్టీ కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తో పాటు విశాఖ ఎంపీ శ్రీ భరత్ పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు చెరువుతోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిచిపోయిందని.. ప్రత్యేక ప్యాకేజీ వచ్చిందని నేతలు చెప్పుకొచ్చారు.

సందట్లో సడేమియా అన్నట్టు జనసేన నేతలు సెపరేట్ గా సంబరాలు చేసుకున్నారు. విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో జనసేన ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, సుందరపు విజయ్ కుమార్ భారీ సెలబ్రేషన్స్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కటౌట్ కు పాలాభిషేకం చేశారు. ఇదంతా పవన్ కళ్యాణ్ పుణ్యమే అని చెప్పుకొచ్చారు. కేంద్ర పెద్దల వద్ద పరపతిని ఉపయోగించుకుని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిచిపోయే విధంగా చూశారని చెప్పుకొచ్చారు. అయితే ఈ పరిణామాలతో ఎన్డీఏ పక్ష పార్టీలలో స్పష్టమైన విభజన రాక కనిపించింది.

కేవలం విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం నిధులు విడుదల చేయడంతో దానిని అనుకూలంగా మార్చుకోవాలని ఆ మూడు పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ప్యాకేజీ క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకునేందుకు మూడు పార్టీలు పోటీ పడుతున్నాయి. భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ పరిణామాలు ఎదురైనా.. సేఫ్ జోన్ లో ఉండేందుకు ఈ ప్రయత్నాలని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. అయితే స్టీల్ ప్లాంట్ ఇష్యూ పుణ్యమా అని విశాఖ జిల్లాలో ఎన్డీఏలో విభేదాలు రావడంతో మూడు పార్టీల శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. అయితే ఈ పరిణామాలు వైసీపీలో ఆనందం రేపుతున్నాయి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!