Monday, February 10, 2025

పోతుల సునీతకు చుక్కలు చూపిస్తున్న టిడిపి క్యాడర్!

- Advertisement -

పోతుల సునీత.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పరిచయం ఈ పేరు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం నెరిపిన చరిత్ర ఆమెది. ఏ పార్టీలో ఉన్నా అధినేతలకు బాగా దగ్గరయ్యే నేర్పరితనం ఆమె సొంతం. ఆ నేర్పు ఓర్పుతోనే చట్టసభలకు ఎన్నిక కావాలని భావించారు. కానీ సాధించలేకపోయారు. పోతేనేం రెండుసార్లు ఎమ్మెల్సీగా ఎన్నికై పెద్దల సభలో అడుగు పెట్టారు. మొన్నటి వరకు సక్సెస్ ఫుల్ గా సాగిన ఆమె పొలిటికల్ జర్నీకి ఇప్పుడు బ్రేక్ పడింది. వైసీపీతో పాటు పదవికి రాజీనామా చేసిన ఆమె పొలిటికల్ జంక్షన్లో నిలబడ్డారు. అధికార తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధపడ్డారు. కానీ తెలుగు తమ్ముళ్లు అడ్డుకుంటున్నారు. దీంతో ఆమె పరిస్థితి రెండిటికి చెడ్డ రేవడిలా మారింది.

విప్లవ నేపథ్యం నుంచి రాజకీయాల్లో అడుగుపెట్టారు పోతుల సునీత. సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. మాజీ మంత్రి పరిటాల రవీంద్ర అనుచరులుగా ఆమెతోపాటు భర్త సురేష్ గుర్తింపు పొందారు. అందువల్లే ఆమెకు తెలుగుదేశం పార్టీ ఎనలేని ప్రాధాన్యం ఇచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో మహబూబ్నగర్ జిల్లా అలంపూర్ నుంచి జడ్పిటిసి గా ఎన్నికయ్యారు సునీత. అటు తరువాత రాయలసీమ రాజకీయాల్లో చక్రం తిప్పారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళనేత కావడంతో చంద్రబాబు ఎంతో ప్రోత్సహించారు. 2014లో ప్రకాశం జిల్లా చీరాల అసెంబ్లీ టికెట్ ఇచ్చారు చంద్రబాబు. కానీ ఆమె ఓడిపోయారు. అయినా సరే చంద్రబాబు వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో.. టిడిపికి గుడ్ బై చెప్పి ఆ పార్టీలో చేరిపోయారు. అక్కడ కూడా రెండోసారి ఎమ్మెల్సీగా ఛాన్స్ కొట్టేశారు. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో తెలుగుదేశం పార్టీని వెతుక్కుంటూ వచ్చారు. వైసిపి తో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అయితే ఇది జరిగి నాలుగు నెలలు అవుతున్నా.. పోతుల సునీతను పట్టించుకునేవారు లేకుండా పోయారు. కనీసం టిడిపిలో చేర్పించేందుకు ఎవరు ఆసక్తి చూపడం లేదు.

టిడిపికి చెందిన ఓ మంత్రి సలహాతో పోతుల సునీత వైసిపికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.తీరా రాజీనామా చేశాక మీ సేవలు మాకు అక్కర్లేదంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ముఖం మీద చెబుతున్నాయి. పార్టీ కష్టకాలంలో ఉండగా వైసీపీలోకి వెళ్లిపోవడంతో పాటు అధినేత చంద్రబాబు, లోకేష్ పై సునీత విరుచుకుపడిన తీరును తెలుగు తమ్ముళ్లు గుర్తు చేస్తున్నారు. అటు చీరాల టిడిపి క్యాడర్ సైతం ఆమె చేరికను అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాజీనామాకు ప్రోత్సహించిన మంత్రి సైతం చేతులెత్తేసినట్లు సమాచారం. దీంతో అనవసరంగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని లోలోపల పోతుల సునీత బాధపడిపోతున్నారట.

తెలుగుదేశం పార్టీకి శాసనమండలిలో తక్కువ బలం ఉంది. అందుకే రాజీనామా చేసి వస్తే ఆ ప్లేస్లో టిడిపి నేతలు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. అందుకే టిడిపి మంత్రి సలహా ఇచ్చారో లేదో.. ముందు వెనుక చూసుకోకుండా పోతుల సునీత పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిని సైతం విడిచిపెట్టారు. అయితే సరిగ్గా టిడిపిలో అడుగు పెడతాను అనగా తెలుగు తమ్ముళ్లు అడ్డుకుంటున్నారు. ముఖ్యంగా చీరాల నియోజకవర్గ క్యాడర్ అయితే ఆమె విషయంలో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అయితే తన ఆవేదనను చెప్పి పార్టీలో చేరేందుకు ఆమె సీఎం చంద్రబాబును కలుస్తారని తెలుస్తోంది. మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఆమెకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!