Monday, February 10, 2025

వైసిపి హయాంలో పోర్టులు.. అప్పట్లో విమర్శలు.. ఇప్పుడు వాటినే హైలెట్ చేస్తున్న చంద్రబాబు

- Advertisement -

ఏదైనా చెబితే నమ్మశక్యంగా ఉండాలి. నమ్మే విధంగానైనా ఉండాలి. కానీ ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు తో పాటు టిడిపి అనుకూల మీడియా చేస్తున్న అతి అంతా ఇంతా కాదు. దావోస్ వెళ్లి ఏపీలో పోర్టుల నిర్మాణం గురించి మాట్లాడుతున్నారు చంద్రబాబు. అయితే పోర్టుల అభివృద్ధితోనే రాష్ట్రానికి ఆదాయం సమకూరుతుందని గతంలో జగన్ కూడా చెప్పుకొచ్చారు. వైసిపి హయాంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కూడా చేశారు. అయితే అప్పట్లో పోర్టుల నిర్మాణం పై విష ప్రచారం చేసింది ఎల్లో మీడియా. కానీ ఇప్పుడు సీఎం చంద్రబాబు ఏపీలో పోర్టులను అభివృద్ధి చేస్తామని చెప్పడం విశేషం. దీనిపై పారిశ్రామిక వర్గాల సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. అధికార వర్గాల్లో కూడా ఇది చర్చకు దారితీస్తోంది.

ఏపీకి భారీగా పెట్టుబడులు తెచ్చేందుకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఒక బృందం దావోస్ వెళ్ళింది. భారీగా ఆర్భాటం చేస్తూ దావోస్ లో అడుగు పెట్టింది. వరుసగా ప్రపంచ దిగ్గజ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు చర్చలు జరిపినట్లు ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో ప్రచారం హోరెత్తించారు. అవిగో పెట్టుబడులు.. ఇవిగో పెట్టుబడులు అంటూ లేనిపోని ఆర్భాటం చేశారు. అయితే ఇంతవరకు ఏపీకి గర్వించే స్థాయిలో పెట్టుబడులేవి రాలేదు. కానీ అదే సమయంలో తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమలు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆయన టీం ఎటువంటి ఆర్భాటం చేయలేదు. భారీ ప్రచారం చేసుకోలేదు. ప్రచారానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు. సింపుల్ గా వెళ్లారు. పారిశ్రామికవేత్తలతో మాట్లాడి ఆహ్వానించారు. పెట్టుబడులు పెట్టేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు.

మూడు రోజులపాటు ఏపీకి రావాలని పారిశ్రామికవేత్తలకు ఆహ్వానించేందుకే సమయం సరిపోయింది. దానినే టిడిపి అనుకూల మీడియాలో వివిధ కంపెనీల పెద్దలతో సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, టీజీ భరత్ భేటీ అయిన ఫోటోలు మాత్రమే కనిపించాయి. ఏపీలో అపార వనరులు ఉన్నాయని.. పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్నట్లుగా మాత్రమే వార్తలు వస్తున్నాయి. కానీ మేం పెట్టుబడి పెడతాం అని ఒక్క సంస్థ కూడా ముందుకు రాకపోవడం గమనార్హం. గతంలో చంద్రబాబు దావోస్ వెళితే లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేవని కథలుగా చెప్పేవారు. ప్రత్యేక కథనాలు వండి వార్చేవారు. కానీ ఈసారి మాత్రం ఎక్కడో తేడా కొడుతోంది.

గతంలో జగన్ చేపట్టిన ప్రాజెక్టుల గురించి ఇప్పుడు చంద్రబాబు చెబుతుండడం విశేషం. వైసిపి ప్రభుత్వ హయాంలో భారీగా పోర్టుల నిర్మాణానికి అడుగులు పడ్డాయి. పోర్టుల అభివృద్ధితో ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా లభిస్తుందని నాడు జగన్ చెప్పుకొచ్చారు కూడా. 2008 జూలై 17న రాజశేఖర్ రెడ్డి కృష్ణపట్నం పోర్టు కార్యకలాపాలను ప్రారంభించారు. ఇక రామయ్య పట్నం పోర్టు నిర్మాణ పనులను సరవేగంగా జరిపించింది వైసీపీ ప్రభుత్వం. శ్రీకాకుళం జిల్లాలో భావనపాడు పోర్టు నిర్మాణాన్ని కూడా ప్రారంభించింది వైసిపి. బ్రిటిష్ కాలం నాటి బందరు పోర్టు పునరుద్ధరణ పనులు కూడా వైసీపీ ప్రారంభించింది. కాకినాడ జిల్లా తొండంగి మండలంలో ప్రైవేటు పోర్టు నిర్మాణం కూడా ప్రారంభమైంది వైసిపి హయాంలోని. ఏపీలో అతిపెద్ద పోర్టు విశాఖలో ఉంది. ఇది కేంద్రం ఆధీనంలో ఉంది. అయితే వైసిపి హయాంలో ఐదు పోర్టుల అభివృద్ధి శరవేగంగా జరిగింది. గంగవరం పోర్టులో కూడా పెద్ద ఎత్తున కార్గో రవాణా ప్రారంభం అయింది. అయితే నాడు జగన్ చేసిన అభివృద్ధి ఇప్పుడు చంద్రబాబు చెప్పుకుంటున్నారు. అవే పోర్టుల నిర్మాణం చేపడతామని.. అభివృద్ధి చేస్తామని సెలవిస్తున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!